కరోనా వ్యాక్సినేషన్‌లో కాంగ్రెస్, దాని మిత్రపక్షాల పాలిత రాష్ట్రాలు వెనుక ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కాంగ్రెస్ లేదా దాని మిత్రపక్షాల పాలిత మొదటి డోస్ 90 శాతంలోపే ప్రజలకు టీకాలు ఇవ్వగా, బిజెపి పాలిత రాష్ట్రాలలో 90 శాతంకు మించి ఇచ్చారు. ప్రతిపక్షాల పాలిత రాష్ట్రాలలో ఎక్కడా రెండో డోస్ ఇచ్చిన ప్రజల సంఖ్యా 50 శాతంకు చేరుకోలేదు. కి 2వ డోస్ ఇవ్వలేకపోయాయని పేర్కొన్నాయి.
టీకాల విషయంలో బాగా వెనుకబడిన కొన్ని ప్రతిపక్ష పాలిత రాస్త్రాలు బూస్టర్ డోసులకు అనుమతి ఇవ్వాలని కేంద్రంపై వత్తిడి తీసుకు రావడం పట్ల అధికార వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. ఈ రాష్ట్రాల్లో టీకా డ్రైవ్‌ను రాజకీయాలు ప్రభావితం చేశాయా అని కూడా వారు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
కరోనా టీకా కార్యక్రమాన్ని రాజకీయం చేయడం కోసం ప్రతిపక్ష పార్టీలు ప్రయత్నిస్తున్నాయని బిజెపి చేస్తున్న విమర్శలు బలం చేకూరినట్లయింది. పైగా భారత్ లో తయారైన రెండు వ్యాక్సిన్ల ఆమోదం విషయంలో సహితం ప్రభుత్వాన్ని ఈ ప్రతిపక్ష పార్టీలు ప్రశ్నించడం గమనార్హం.
జార్ఖండ్‌లో మొదటి, రెండు డోస్‌లతో టీకాలు వేసిన జనాభా శాతం వరుసగా 66.2, 30.8 ఉండగా, పంజాబ్‌లో 72.5, 32.8 ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. తమిళనాడు, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ల సంబంధిత గణాంకాలు వరుసగా 78.1, 42.65; 80.11, 42.5; 83.2, 47.2 శాతంగా ఉన్నాయి. రాజస్థాన్‌కు 84.2, 46.9 కాగా, పశ్చిమ బెంగాల్‌కు వరుసగా 86.6, 39.4 శాతంగా ఉన్నాయి.
పంజాబ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లలో కాంగ్రెస్ అధికారంలో ఉండగా, తమిళనాడులో డీఎంకే నేతృత్వంలోని పాలక కూటమిలో, జార్ఖండ్‌లో జేఎంఎం నేతృత్వంలోని ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామిగా ఉంది. బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్, కీలక ప్రతిపక్ష పార్టీ కానీ కాంగ్రెస్ మిత్రపక్షం కాదు.
ఇక బిజెపి పాలిత హిమాచల్ ప్రదేశ్, గోవా లలో మొదటి డోస్ టీకాలు 91.9 శాతంకు, రెండో డోస్ లు 87.9 శాతంకు ఇచ్చారు. గుజరాత్‌లో సంబంధిత శాతం గణాంకాలు 93.5, 70.3: ఉత్తరాఖండ్‌లో 93, 61.7: మధ్యప్రదేశ్‌లో 92.8, 62.9; కర్ణాటకలో 90.9, 59.1; హర్యానాలో 90.04, 48.3; అస్సాంలో 88.9, 50; త్రిపురలో 80.5, 63.5 శాతంగా ఉన్నాయి.
More Stories
చైనా జాతీయుడికి `సుప్రీం’ బెయిల్ నిరాకరణ
బుల్డోజర్ న్యాయం ఆపేయమన్న సుప్రీంకోర్టు
కేరళలో నిపా కలకలం.. మరోసారి మాస్క్ తప్పనిసరి!