సిరివెన్నెల సీతారామ‌శాస్త్రికి అస్వ‌స్థ‌త‌

ప్ర‌ముఖ సినీ గేయ ర‌చ‌యిత సిరివెన్నెల సీతారామాశాస్త్రి తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. దీంతో ఆయన్ను కుటుంబ స‌భ్యులు కిమ్స్ ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ప్ర‌స్తుతం ఆయ‌న‌కు వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

రెండు రోజుల క్రిత‌మే సిరివెన్నెల కిమ్స్‌లో చేరిన‌ట్టు తెలుస్తోంది. ఆయ‌న గ‌త కొన్ని రోజుల నుంచి న్యుమోనియాతో బాధ‌ప‌డుతున్నారు. దీంతో దానికి చికిత్స తీసుకునేందుకే ఆయ‌న కిమ్స్‌లో చేరిన‌ట్టు తెలుస్తోంది.

రెండు రోజుల క్రితం సిరివెన్నెల సీతారామశాస్త్రి న్యుమోనియాతో బాధపడుతూ హాస్పిటల్‌లో చేరారని, ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఎవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదని కిమ్స్ హాస్పిటల్ యజమాన్యం తెలిపింది. 

‘‘ప్రముఖ తెలుగు సినీ గీతరచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి రెండు రోజుల క్రితం న్యుమోనియాతో ఇబ్బందిపడుతూ.. చికిత్స నిమిత్తం సికింద్రాబాద్‌లోని కిమ్స్ హాస్పిటల్‌‌లో చేరడం జరిగింది. ప్రస్తుతం ఆయనను ఐసియులో ఉంచి నిపుణులైన డాక్టర్లు చికిత్స అందిస్తున్నారు. లంగ్స్‌కి సంబంధించిన సమస్య నుండి ఆయన కోలుకుంటున్నారు. 24 గంటలుగా ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉంది..’’ అని కిమ్స్ హాస్పిటల్ యజమాన్యం తెలియజేసింది.

1986లో కె.విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘సిరివెన్నెల’ సినిమాతో సీతారామశాస్రి పాటల రచయితగా తెలుగు చలనచిత్ర  ప్రస్థానం మొదలైంది. తొలి సినిమాకే ఈయన రాసిన పాటలు సూపర్ గ్రీన్ హిట్ గా నిలిచాయి. 

ఈ సినిమాకు ఉత్తమ సినీ గేయ రచయితగా నంది అవార్డు అందుకున్న ఆయనకు తెలుగు చిత్రపరిశ్రమ సొంతం అయ్యారు. ఇప్పటి వరకు వందల పాటలు రాసిన ఆయనకు తొలిసినిమా టైటిల్ ‘సిరివెన్నెల’ ఇంటిపేరుగా మారిపోయింది. ఆ త‌ర్వాత ఆయ‌న తెలుగులో వంద‌ల సినిమాల‌కు పాట‌లు రాశారు.