శ్రీనగర్ లో ముగ్గురు ఉగ్రవాదులు హతం

జమ్మూకశ్మీర్‌లో బుధవారం భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో శ్రీనగర్ లోని రాంబాగ్ వద్ద ముగ్గురు ఉగ్రవాదులను బలగాలు హతమార్చాయి. ఉగ్రవాదులను లొంగిపోవాల్సిందిగా కోరామని, అయితే వారు కాల్పులు జరిపారని పోలీసులు తెలిపారు. అనంతరం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. హతమైన మిలిటెంట్ల వివరాలను ఆరా తీస్తున్నారు.

గతేడాది సెప్టెంబర్‌లో శ్రీనగర్‌ను ఉగ్రవాద రహితంగా ప్రకటించారు. ఏదేమైనప్పటికీ, ఒక సంవత్సరం తర్వాత, మైనారిటీ వర్గాల వారితో సహా పౌరులను లక్ష్యంగా చేసుకున్న హత్యలు, భద్రతా అధికారులు, ఎన్‌కౌంటర్‌లు,  సైనికీకరణ తిరిగి వచ్చాయి. పౌరుల హత్యలపై ప్రభుత్వం స్పందించి ఆ ప్రాంతంలో భద్రతను కట్టుదిట్టం చేసింది.

అక్టోబర్‌లో హోం మంత్రి అమిత్ షా జమ్మూ, కాశ్మీర్ లో పర్యటించిన తర్వాత దాదాపు 55 కంపెనీల సి ఆర్ పి ఎఫ్, దళాలను కాశ్మీర్‌కు తరలించారు. తాజాగా వచ్చిన చాలా మంది సైనికులు శ్రీనగర్ మునిసిపాలిటీ ద్వారా రద్దీగా ఉండే ప్రాంతాల్లో సామాజిక సమావేశాల కోసం నిర్మించిన కళ్యాణ మండపాలను స్వాధీనం చేసుకున్నారు. 

అదనపు బలగాలు రావడంతో నగరమంతటా మరిన్ని చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. ఈ ఏడాది నగరంలో మొదటి ఎన్‌కౌంటర్ అక్టోబర్ 8న జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, నాటిపోరా వద్ద జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒక ఉగ్రవాది పోలీసు బృందంపై కాల్పులు జరిపాడు.

నవంబర్ 11న బెమీనాలోని హమ్దానియా కాలనీలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఓ ఉగ్రవాది హతమైనట్లు పోలీసులు తెలిపారు. అతడిని ఖ్రూ పుల్వామాకు చెందిన అమీర్ రియాజ్‌గా గుర్తించారు, అతను తీవ్రవాద సంస్థ ముజాహిదీన్ ఘజ్వత్-ఉల్-హింద్‌కు అనుబంధంగా ఉన్నాడు.

మిలిటెంట్లు ఉన్నారనే సమాచారంతో  జమ్మూ, కాశ్మీర్ పోలీసులు,  సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టిన తర్వాత బెమీనాలో ఎన్‌కౌంటర్ జరిగింది. ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో పోలీసులు ఎదురుకాల్పులు జరపగా, ఎదురుకాల్పుల్లో ఒక ఉగ్రవాది హతమయ్యాడు.

అక్టోబరు 14న,  విదేశీ ఉగ్రవాది బిలాల్ భాయ్, అతని సహచరుడు అమీర్ అహ్మద్, ఓవర్‌గ్రౌండ్ వర్కర్  అల్తాఫ్ అహ్మద్ భట్, ఎన్‌కౌంటర్ జరిగిన భవనం యజమాని అల్తాఫ్ అహ్మద్ భట్, అతని అద్దెదారుడు రియల్ ఎస్టేట్ కాంట్రాక్టర్ గా మారిన దంత వైద్యుడు   డాక్టర్ ముదాసిర్ గుల్ లను చంపినట్లు పోలీసులు చెప్పారు. 

భట్, గుల్ , అహ్మద్ కుటుంబాలు ముగ్గురు మిలిటెంట్లని పోలీసుల వాదనను తీవ్రంగా తిరస్కరిస్తూ శ్రీనగర్‌లోని రెసిడెన్సీ రోడ్‌లోని ప్రెస్ ఎన్‌క్లేవ్ వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు. దానితో ఈ హత్యలపై ప్రభుత్వం మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించింది.