తెలంగాణలో కీలక మలుపు హుజురాబాద్ ఉపఎన్నిక

హుజురాబాద్ ఉపఎన్నికలో ఎవ్వరు గెలిచినా కేసీఆర్ ప్రభుత్వ సుస్థిరతకు ముప్పు లేదు. అసెంబ్లీలో ఇద్దరే ఉన్న బిజెపి సభ్యుల సంఖ్య మరొకటి పెరిగినా ఆ పార్టీ సాధించెడిది ఏమీ ఉండదు. కానీ ఉపఎన్నిక అనివార్యం అని తేలినప్పటి నుండి ఈటెల ఎక్కడ గెలుస్తారో అంటూ కేసీఆర్, ఆయన కుటుంభం సభ్యులు అందరు భయపడుతున్నారు.
 
అంతేకాదు, ఆయన ప్రాపకంతో ఉన్నత పదవులు పొందిన తెలంగాణ `ఉద్యమ ద్రోహులు’ అందరు ఖంగారు పడుతున్నారు. 
వారందరికీ తెలుసు ఈ ఎన్నిక కేవలం అసెంబ్లీలో బలాబలాలు తేల్చే ఎన్నిక కాదని, తెలంగాణ రాజకీయాలలో కీలక మార్పుకు ఈ ఎన్నిక నాంది కానున్నదని గ్రహించారు. అందుకనే వారంతగా భయపడుతున్నారు. 
 
కేసీఆర్ కు కంచుకోట వంటి దుబ్బాకలో బిజెపి అభ్యర్థి రఘునందనరావు గెలుపొందడంతో మొదటిసారిగా ఆయనలో భయం తొంగి చూసింది. ఆ తర్వాత గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ ఎన్నికలలో అధికార పార్టీతో దాదాపు సమానంగా బిజెపి సీట్లు తెచ్చుకోవడంతో వణుకు ప్రారంభమయింది. తెలంగాణ ప్రజలు కేసీఆర్ ఏడేళ్ల పాలనతో విసుగు చెందారని ఈ ఫలితాలు నిరూపించాయి.
వారు రాజకీయ ప్రత్యామ్న్యాయంగా కాంగ్రెస్ ను నమ్మడం లేదు. ఎందుకంటె ఆ పార్టీ సభ్యులను గెలిపించినా వారంతా కేసీఆర్ కు అమ్ముడు పోతారని గ్రహించారు. అందుకనే బిజెపి మాత్రమే నిక్కచ్చిగా కేసీఆర్ నిరంకుశ, అక్రమ, ప్రజా వ్యతిరేక పాలనకు అంతం పాలక గలదని భావిస్తున్నారు. ఇప్పుడు హుజురాబాద్ లో బిజెపి అభ్యర్థి ఈటెల రాజేందర్ గెలుపు మరోసారి ప్రజల నమ్మకాన్ని మరింతగా ఇనుమడింప చేస్తుంది.
 
అక్కడ గత ఎన్నికలలో ఈటెలకు గట్టి పోటీ ఇచ్చిన కాంగ్రెస్ అభ్యర్థి అధికార పక్షంలో చేరడం, కాంగ్రెస్ చివరి వరకు అభ్యర్థిని పెట్టలేక పోవడం జనం చూసారు. మనకు ఫామ్ హౌస్ పాలన కావాలా? సంక్షేమ పాలన కావాలా? ఒకసారి ఆలోచించండి అని కేంద్ర మంత్రి జి కిషన్ ఎన్నికల ప్రచార సభలలో ఇచ్చిన పిలుపు ప్రజల మనోభావాలను వెల్లడి చేస్తుంది.
నీళ్లు, నిధులు, నియామకాలు కోసం కోట్లాది తెచ్చుకున్న తెలంగాణ నేడు కేసీఆర్ కుటుంభం పాలనలో బందీ కావడాన్ని ప్రజలు గమనిస్తున్నారు. కోట్లాది తెచ్చుకున్న తెలంగాణ మంత్రివర్గంలో ఉద్యమకారులు ఎంత మంది? ఉద్యమ ద్రోహులు ఎంతమంది?  అని కూడా ప్రజలు ఆలోచిస్తున్నారు.
తెలంగాణ ఉద్యమకారులును అవమానపరచి, తెలంగాణ ఉద్యమంలో బలిదానాలు చేసిన కుటుంబాలను విస్మరించి, తెలంగాణ ఫలాలను కేసీఆర్ కుటుంభం మాత్రమే అనుభవించడాన్ని సహింపలేక పోతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటును వ్యతిరేకించిన వ్యక్తులు, శక్తులతో టి ఆర్ ఎస్ ప్రభుత్వం కలసి నడవడాన్ని ప్రజలు తమాయించుకోలేక పోతున్నారు.
నాడు తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ వెంట నడిచి, నిర్ణయాత్మక పాత్ర వ్హాహించిన ఈటెల నేడు వారి దృష్టిలో `ఉద్యమ ద్రోహి’ యెట్లా అయ్యారో తెలుసుకోలేక పోతున్నారు. కేవలం ప్రజల పక్షాన నిలబడి, వారికోసమే ప్రభుత్వం పనిచేయాలని వత్తిడి తెచ్చినందుకు భూముల కబ్జా ఆరోపణలు సృష్టించి మంత్రి పదవి నుండి తొలగించడం వెనుక గల కుట్రను ప్రజలు గ్రహిస్తున్నారు.
కరోనా మహామ్మారి ఉధృతంగా ఉన్న సమయంలో ప్రజల మధ్యనే ఉంటూ, తన ప్రాణాలను సహితం పణంగా పెట్టి పనిచేసిన ఈటెలను మంత్రి పదవి నుండి తొలగించడాన్ని `తెలంగాణ ద్రోహం’ గా ప్రజలు భావిస్తున్నారు. కేవలం హుజురాబాద్ ఉపఎన్నిక కోసమే దళిత బంధు పధకం తీసుకొచ్చి, ఇక్కడ మాత్రమే అమలు చేపట్టడం, దానిని ఎన్నికల కమీషన్ ఆపివేసి విధంగా చేసి ప్రజల ముందు నాటకాలు ఆడటాన్ని తెలుసుకోలేనంత అమాయకులు ప్రజలు కారు.
ఎన్నికల సమయంలో ప్రజలకు గొప్ప గొప్ప హామీలు ఇవ్వడం, ఆ తర్వాత మరచి పోవడం అనే కేసీఆర్ నిజస్వరూపం ఇప్పటికే ప్రజలకు అర్ధమయింది. అందుకనే కపట హామీలు దుబ్బాకలో పనిచేయలేదు. గ్రేటర్ హైదరాబాద్ లో పనిచేయలేదు. ఇప్పుడు హుజురాబాద్ లో కూడా పనిచేవు.
కేవలం ఈటెలను ఓడించడం కోసం, వందలు, వేల కోట్ల రూపాయలు ప్రభుత్వ పధకాల పేరుతో, ఓటర్లను ప్రలోభంకు గురిచేయడానికి ఖర్చు పెడుతున్నారు. ఇంతటి అధికార దుర్వినియోగం దేశంలో మరెక్కడా జరిగి ఉండదు. పోలీస్ యంత్రంగం అంతా ఎవ్వరెవ్వరు బిజెపి అభ్యర్హ్ది వెంట తిరుగుతున్నారో నిఘా పెట్టడంలోనే మునిగి పోయింది.
ఈటెలకు మద్దతు ఇస్తున్నవారిని ప్రలోభాలకు గురిచేసే, భయపెట్టో తమ వైపు తిప్పుకొని ప్రయత్నం చేస్తున్నారు. లొంగి రాకపోతే దొంగ కేసులు పెడుతున్నారు. ఇంతటి భయానక దృశ్యాలు గతంలో ఎన్నడూ యెరుగము. తెలంగాణ ఏర్పడగానే రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు నింపుతామన్నారు. ఏడేళ్లలో లక్ష ఉద్యోగాలు కూడా నింపలేదు. పోడు భూములలో ఆక్రమణలు తొలగిస్తామన్నారు. కానీ ప్రభుత్వం ఆక్రమణదారులకే కొమ్ము కాస్తున్నది. 
 
పేదలు అందరికి డబల్ బెడ్ రూమ్ ఇల్లన్నారు. కానీ ఏడేళ్లలో ఇచ్చిన ఇల్లు 13,000 కూడా లేవు.  రైతుల రుణమాఫీ అన్నారు…. ఇటువంటి మరెన్నో హామీలు మాటలకే పరిమితం అవుతున్నాయి. దేశం మొత్తం మీద సచివాలయంకు రాని ముఖ్యమంత్రి తెలంగాణలో మాత్రమే ఉన్నారు. సాధారణ జనంకె కాదు మంత్రులు, ఉన్నతాధికారులు కలవాలన్న ఆయన అందుబాటులో ఉండరు. 
 
తమది రైతు ప్రభుత్వం అన్నారు. విత్తన సబ్సిడీ ఎత్తేసారు. వ్యవసాయ ఆయాంత్రికరణ, బిందు సైద్యంపై సబ్సిడీ ఎత్తేసారు. పకృతి వైపరీత్యాల సమయంలో రైతులకు ఎటువంటి నష్ట పరిహారం ఇవ్వడం లేదు. గ్రామా పంచాయితీలకు, స్థానిక సంస్థలు కేంద్రం ఇస్తున్న నిధులు తప్పా రాష్ట్ర ప్రభుత్వం నుండి ఒక్క రూపాయి కూడా అందటం లేదు. 
 
ఏడేళ్లుగా ఉపాధ్యాయులు, లెక్చరర్ల నీయమకాలు నిలిపి వేశారు. విశ్వవిద్యాలయాలలో సగం మంది కూడా బోధనా సిబ్బంది లేదు. 
ఇక విద్యార్థుల్లాకు ఫీజ్ రేయింబర్సమెంట్, ఉపకారవేతనాలు చెల్లించడం లేదు. దానితో పేద విద్యార్థులు ఎన్నో అవస్థలకు గురవుతున్నారు. నిరుద్యోగ భృతి, ఇంటికో ఉద్యోగం అన్నారు. దళిత ముఖ్యమంత్రి అన్నారు. లేదంటే తల నరుక్కుంటా అన్నారు. 
 
 యాదవుల దగ్గర తీసుకున్న వందల కోట్ల రూపాయిలను అకౌంట్లో పెట్టుకుని గొర్రెలు ఇవ్వడం లేదు.    ఈత చెట్ల దగ్గర, తాటి చెట్ల దగ్గర కల్లు అమ్ముకుంటే పోలీసులతో డ్రంక్ డ్రైవ్ చేస్తూ గౌడన్నలను వేధిస్తున్నారు. గొర్రెలు, బర్రెలు అయిపోయాయి.. ఇప్పుడు కోళ్లు ఇస్తారట. గొర్రెలు, బర్రెలు తీసుకున్నోళ్లు ఎంత మంది కోటిశ్వరులు అయ్యారో చెప్పాలి. 
కేసీఆర్ మోసకారి అని ప్రజలు గుర్తిస్తున్నారు. ఆయన మాటలను ఇంకేమాత్రం నమ్మడం లేదు. హైదారాబాద్‎లో వరదలొస్తే పదివేలు ఇస్తానని ఇవ్వలేదు. తెలంగాణ ఉద్యమంలో మొదటి నుండి ముందు వరుసలో ఉంటూ వస్తున్న ఈటెల గెలుపొందితే సొంత పార్టీలోనే తిరుగుబాటు ప్రారంభం అవుతుందని కేసీఆర్ భయపడుతున్నారు. 
 
ఇప్పటి వరకు ఉద్యమ ద్రోహులను అక్కున చేర్చుకొంటున్నా మారుమాట్లాడని పార్టీ కార్యకర్తలే ప్రశ్నించడం ప్రారంభిస్తారని తండ్రి, కొడుకులు ఆందోళన చెందుతున్నారు. అదే జరిగితే రాబోయే రోజులలో పెద్ద ఎత్తున పార్టీ నుండి బిజెపిలోకి వలసలు ప్రారంభం కావాలనే భయం వారికి పట్టుకొంది. 
 
వత్తిడులకు, బెదిరింపులకు భయపడి ఇప్పుడు టి ఆర్ ఎస్ లో ఎవ్వరు పైకి మాట్లాడలేక పోయినా చాలామంది ఈటెలకు అన్యాయం చేస్తున్నారంటూ సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. ఆ సానుభూతి తమ నాయకత్వంపై తిరుగుబాటుగా మారుతుందని, తెలంగాణ రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చివేస్తుంది కేసీఆర్, కేటీఆర్ భయపడుతున్నారు. 
 
కేసీఆర్ అవకాశవాద రాజకీయాలకు, కుటుంభం పాలనకు; ఈటెల నిజాయతీకి, ప్రజల పట్ల ప్రదర్శిస్తున్న అంకితభావానికి మధ్య జరుగుతున్న ఎన్నిక ఇది. తెలంగాణ భవిష్యత్ కు రాజబాట వేసేందుకు దోహదపడే ఉపఎన్నిక. అందుకనే తెలంగాణ ప్రజల భవిష్యత్ కు ఈ ఎన్నిక కీలక మలుపు కాగలదు.