కరోనా కొత్త వేరియంట్‌పై దృష్టి

ఇప్పుడిప్పుడే దేశం మహమ్మారి నుంచి బయటపడుతున్నది. ఈ క్రమంలో మరో కొత్త రకం వైరస్‌ వెలుగు చూడడం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. మధ్యప్రదేశ్‌, మహారాష్ట్రలో పలువురికి కరోనా కొత్త వేరియంట్ ఏవై.4 (ఎవై 4.2) సోకినట్లు తేలింది. ఈ క్రమంలో కేంద్ర ఆరోగ్యశాఖ మన్సుఖ్‌ మాండవీయ స్పందించారు. 

వేరియంట్ అంశం ప్రభుత్వం దృష్టిలో ఉందని, ప్రతి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ మెడికల్‌ రీసెర్చ్‌ , నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌  అధ్యయనం చేస్తాయని చెప్పారు.

కాగా, కొవాగ్జిన్‌ టీకాకు డబ్ల్యూహెచ్‌  ఆమోదంపై స్పందిస్తూ.. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రత్యేక వ్యవస్థను కలిగి ఉందని, నేటి సమావేశంలో సాంకేతిక కమిటీ నిర్ణయం ఆధారంగా కొవాగ్జిన్‌కు గుర్తింపు ఆధారపడి ఉంటుందని పేర్కొ న్నారు.

ప్రధాన మంత్రి ఆయుష్మాన్‌ భారత్‌ హెల్త్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మిషన్‌పై మాట్లాడుతూ.. మిషన్‌లో అన్ని ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలతో రెండు కంటైనర్‌లను ఏర్పాటు చేస్తామని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో ఒక ప్రదేశం నుంచి మరో ప్రాంతానికి తరలించనున్నట్లు వెల్లడించారు. 

ఒక్కో కంటైనర్‌లో 200 పడకల సామర్థ్యం ఉంటుందని, వీటిని ఢిల్లీ.. చెన్నై అందుబాటులో ఉంచనున్నట్లు కేంద్ర మంత్రి పేర్కొన్నారు. అత్యవసర పరిస్థితుల్లో విమానాలు, రైలు మార్గాల ద్వారా తరలించవచ్చని చెప్పారు.