మయూరి’ నటి సుధాచంద్రన్‌కు సిఐఎస్‌ఎఫ్ క్షమాపణలు

ఉషోదయ మూవీస్ కింద నిర్మించిన ‘మయూరి’ సినిమాలో నటించి బాగా పేరు తెచ్చుకున్న నటి, ప్రముఖ భరతనాట్య నృత్యకారిణి  సుధా చంద్రన్ ను విమానాశ్రయంలో రక్షణ బాధ్యతలు, తనిఖీ నిర్వహించే కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం(సిఐఎస్‌ఎఫ్)కు చెందిన మహిళా పోలీసులు ఆమె కృత్రిమ కాలును తొలగించమని కోరి అవమానించారు. అయితే దీనికి సెంట్రల్ ఇండస్ట్రీయల్ సెక్యూరిటీ ఫోర్స్ క్షమాపణలు చెప్పుకుంది.
 
 ఆమె కృత్రిమ కాలును తీయాలని భద్రతా సిబ్బంది కోరారు. ఈటీడీ (ఎక్స్ ప్లోజివ్ ట్రేస్ డిటెక్టర్)‌తో చెక్ చేయమని ఆమె అడగగా వారు అందుకు అంగీకరించలేదు.  దీంతో మనస్తానికి గురైన ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోను పోస్ట్ చేసింది. ఆ వీడియో నెట్టింట్లో విపరీతంగా వైరల్ అయింది. నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో ఆమెకు మద్దతు లభించింది.
 
దీంతో సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(సీఐఎస్‌ఎఫ్) ట్విట్టర్‌లో స్పందిస్తూ.. తమను క్షమించాలని కోరింది. సీఐఎస్ఎఫ్ మమ్మల్ని క్షమించమని వరుసగా ట్వీట్‌లు చేసింది. ‘‘ సుధా చంద్రన్‌కు ఎయిర్ పోర్టులో జరిగిన అవమానానికి మేం చింతిస్తున్నాం” అంటూ పేర్కొన్నది. 
 
” నిబంధనల పకారం కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో  భద్రతా కారణాల రీత్యా కృత్రిమ అవయవాలను అమర్చుకున్నవారు వాటిని తీసేయాల్సి ఉంటుంది. మీ రిక్వెస్ట్‌ని అంగీకరించని మహిళ అధికారిపై మేం తప్పకుండా దర్యాప్తు జరుపుతాం. కృత్రిమ అవయవాలను అమర్చుకుని ప్రయాణించే వారికి ఎటువంటి ఇబ్బంది కలగదని సుధా చంద్రన్‌కు మేం హామీ ఇస్తున్నాం ’’ అని సీఐఎస్‌ఎఫ్ ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది.
 
ఇలా ఉండగా, తాను ఎయిర్ పోర్ట్ కు  వెళ్లిన ప్రతిసారి బాధపడుతున్నానని పేర్కొంటూ కనీసం  తనలాంటి  సీనియర్‌ సిటిజన్లకు ఒక నిర్థిష్ట కార్డునైనా జారీ చేయాలంటూ  ప్రధాని మోదీకి ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె ఒక విజ్ఞప్తి చేశారు. సుధాచంద్రన్‌ ఒక కారు ప్రమాదంలో తన కాలును కోల్పోయినప్పటికి కృత్రిమ కాలుతో నృత్యం చేసి భారతదేశ గర్వపడే స్థాయికి ఎదిగిన సంగతి అందరికి తెలిసిందే. ఈ మేరకు  వృత్తిరీత్యా ప్రయాణాల నిమిత్తం ఎయిర్ పోర్ట్ కు వెళ్లిని ప్రతిసారి సెక్యూరిటీ తీరుతో తాను చాలా బాధపడుతున్నాను అంటూ చెప్పుకొచ్చారు. 

ఈ క్రమంలో సుధాచంద్రన్‌ మాట్లాడుతూ “నేనే ఎయిర్‌ పోర్ట్‌కి వెళ్లిన ప్రతిసారి సెక్యూరిటీ సిబ్బంది తనిఖీ నిమిత్తం కృత్రిమ కాలు తొలగించమంటన్నారు. దీని వల్ల చాలా బాధపడుతున్నానను. అంతేకాదు ఒక ప్రమాదంలో కాలును కోల్పోయినప్పటికీ కృత్రిమ కాలుతో చరిత్ర సృష్టించటమే కాక భారతదేశ గరవ్వపడేలా చేశాను” అని ఆమె తెలిపారు.

“అలాంటి నన్ను సెక్యూరిటీ సిబ్బంది ఈటీడీ (పేలుడు ట్రేస్ డిటెక్టర్) తనిఖీ నిమిత్తం ప్రతిసారి నా కృత్రిమ అవయం తొలగించమంటున్నారు ఇది మానవీయంగా సాధ్యమేనా మోదీజీ. మన సమాజంలో ఒక మహిళ మరొక మహిళకు ఇచ్చే గౌరవం ఇదేనా? ఈ సందేశం రాష్ట్ర, కేంద్ర ప్రభత్వాధికారులకు చేరుతుందని ఆశించడమే కాదు సత్వరమే చర్యలు తీసుకుంటారని భావిస్తున్నాను” అంటూ ఆవేదనగా అభ్యర్థిస్తూ ఆమె ప్రధానికి  ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ పెట్టారు.