14 మంది పారిపోయిన ఆర్ధిక నేరస్తులకై ముమ్మర ప్రయత్నాలు

రూ .100 కోట్లు లేదా అంతకన్నా ఎక్కువ ఆర్థిక నేరాలకు పాల్పడి, దేశం విడిచి పారిపోయిన వారిని వెనుకకు తీసుకు రావడానికి  ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్  ప్రయత్నాలను ముమ్మరం చేస్తుంది.

14 మందిలో తొమ్మిది మంది – విజయ్ మాల్యా, నిరవ్ మోడీ, నితిన్ సందేశారా, చేతన్ సందేశర, దీప్తి చేతన్ సందేశర, హితేష్ కుమార్ నరేంద్రభాయ్ పటేల్, హజ్రా ఇక్బాల్ మెమన్, జునైద్ ఇక్బాల్ మెమన్ మరియు ఆసిఫ్ ఇక్బాల్ మెమన్ – ఇప్పటికే పారిపోయిన ఆర్థిక నేరస్థులుగా కోర్టులు ప్రకటించాయి.

ఇతర కేసుల్లో కూడా నల్లధనాన్ని త్వరగా రికవరీ చేయాలని, నష్టపోయిన బ్యాంకులకు నష్టపరిహారం చెల్లించాలని కోర్టులలో ఈడీ విశేష ప్రయత్నాలు చేస్తున్నది.  లండన్, బహామాస్, ఆంటిగ్వా, బార్బుడా. వంటి పన్ను ఎగవేతదారుల స్వర్గధామాలలో ఆశ్రయం పొందుతున్నవారికై ప్రయత్నాల వేగం పెంచింది.

పి  ఎన్ బి  స్కామ్‌ లో  మెహుల్ చోక్సీని  ఫ్లైట్ ఆంటిగ్వా, డొమినికాల నుండి రప్పించే ప్రయత్నాలకు అవరోధం ఏర్పడింది. దానితో దర్యాప్తు స్థాయిలో, చట్టపరంగా గల అవాంతరాలను భర్తీ చేయడంకోసం ప్రభుత్వం వేగవంతంగా చర్యలు చేపట్టింది.

పారిపోయిన ఆర్థిక నేరస్థులుగా ప్రకటించడానికి వివిధ కోర్టులలో ఈడీ  దరఖాస్తులు దాఖలు చేసిన మరో ఐదుగురు: పి ఎన్ బి  స్కామ్ నిందితుడు మెహుల్ చోక్సీ ఆంటిగ్వాలో ఉన్నారు;  ఐదు సంవత్సరాలకు పైగా మనీలాండరింగ్ ఆరోపణలను ఎదుర్కొంటున్న వివాదాస్పద టెలివెంజిలిస్ట్ జాకీర్ నాయక్ మలేసియాలో ఉన్నాడు.

అసమాన ఆస్తులు, మనీలాండరింగ్ ఆరోపణలను ఎదుర్కొంటున్న మహారాష్ట్రా మాజీ డిప్యూటీ కలెక్టర్ నితీష్ ఠాకూర్; బ్యాంకును మోసం చేసిన కేసులో నిందితుడైన  గుజరాత్‌కు చెందిన విన్‌సమ్ డైమండ్ గ్రూప్‌కు చెందిన జతిన్ మెహతా, నల్లధనం ఆరోపణలపై ఈడీ దర్యాప్తు చేపట్టిన సంజయ్ భండారి వీరిలో ఉన్నారు.

ఫ్యూజిటివ్ ఎకనామిక్ అఫెండర్స్ యాక్ట్, 2018 కింద కేసుల తాజా ED జాబితాను ఈడీ  గత ఆగస్టు 31 న రూపొందించింది. జూలై 2020 లో, రూ .329.66 కోట్ల విలువైన నిరవ్ మోదీ ఆస్తులను కేంద్ర ప్రభుత్వం జప్తు చేసింది.