అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బిజెపి

వచ్చే ఏడాది మొదట్లో జరుగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని పార్టీ శ్రేణులకు బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డా పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలని, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలు, కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాని ఆయన సూచించారు. 

ఢిల్లీలో బీజేపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ జాతీయ కార్యవర్గ సమీక్షా సమావేశం, పార్టీ జాతీయ ఆఫీసు బేరర్ల భేటీలో పాల్గొంటూ ప్రభుత్వ అభివృద్ధి ఎజెండాకు అడ్డంకులు సృష్టించేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. ప్రతిపక్షాల ఆరోపణలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని కోరారు.పార్టీ అధికారమలో ఉన్న ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ లతో పాటు పంజాబ్ లో ఎన్నికలు జరుగనున్నాయి. 

కరోనా మహమ్మారి వ్యాప్తి ఉధృతంగా ఉన్న సమయంలో బీజేపీ కార్యకర్తలు సామాజిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని దేశం కోసం పనిచేశారని నడ్డా అభినందించారు. ఈ సమావేశంలో కరోనా మహమ్మారి సమయంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి ఎజెండా, ఉచితంగా ఆహార ధాన్యాల పంపిణీ వంటి కార్యక్రమాలను నడ్డా ప్రస్తావించారు.

వీటిని పార్టీకి చెందిన వివిధ మోర్చాల ద్వారా క్షేత్రస్థాయిలోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు అనుసరించాలి్సన ప్రణాళికలపై చర్చ జరిగింది. “ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ అయిన బిజెపి ప్రారంభించిన వివిధ ప్రచారాల గురించి మేము చర్చించాము. మా మిలియన్ల మంది వాలంటీర్లు వాటిని  ప్రజల్లోకి ఎలా తీసుకెళుతున్నారని సమీక్షించాము” అని బిజెపి ఉపాధ్యక్షుడు బైజయంత్ పాండా తెలిపారు.

ఈ వారం సాధించనున్న 100 కోట్ల వ్యాక్సినేషన్ మైలురాయితో సహా ప్రభుత్వం సాధించిన వివిధ విజయాలను దేశంలోని ప్రతి మూలకు, ప్రత్యేకించి ఎన్నికలు జరుగనున్న రాష్ట్రాలలో ఎలా తీసుకెళ్లాలనే దానిపై పార్టీ నాయకులు చర్చించారు. కొన్ని వారాల క్రితం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కొద్దీ వారల క్రితం పార్టీ ఆఫీస్ బేరర్ లతో  జరిపిన విస్తృతమైన చర్చలలో ప్రస్తావించిన అంశాలను కూడా చర్చినహరు.  ముఖ్యంగా విదేశాంగ విధానం ప్రస్తావనకు వచ్చిన్నట్లు పార్టీ  వర్గాలు తెలిపాయి.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న “లెఫ్ట్ లిబరల్ ఎకోసిస్టమ్” బిజెపి నేతృత్వంలోని ప్రభుత్వానికి వ్యతిరేకంగా కథనాన్ని సృష్టిస్తుందని ప్రధాని ఈ సమావేశాలలో పార్టీ నేతలను అప్రమత్తం చేశారు.  అందువల్ల, దీనిని ఎదుర్కోవడానికి వివిధ వ్యూహాలను సోమవారం సమావేశంలో చర్చించారు. అందుకోసం ప్రవాస భారతీయుల  ఉపయోగించుకోవాలని  నిర్ణయించారు.

కరోనా మహమ్మారి సమయంలో సృష్టించిన 10 లక్షల మంది హెల్త్ వాలంటీర్ల బ్యాంకును మరొక క్లిష్ట పరిస్థితి ఎదురు కాకుండా, పార్టీ ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నాలను తిప్పికొట్టడం కోసం కూడా ఉపయోగించుకోవాలని నిర్ణయించారు. “ప్రతి గ్రామంలో ప్రాథమిక శిక్షణతో ఆరోగ్య వాలంటీర్లను కలిగి ఉండాలనేది మా ఆలోచన. దీని కోసం పార్టీ విభిన్న కార్యక్రమాలు, ప్రచారాలను రూపొందిస్తుంది” అని పార్టీ నేత ఒకరు తెలిపారు.

ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా సెప్టెంబర్‌ 17 నుంచి అక్టోబర్‌ 7 వరకు దేశవ్యాప్తంగా నిర్వహించిన సేవా కార్యక్రమాలపైనా చర్చించారు. క్షేత్రస్థాయిలో పార్టీ విస్తరణతో పాటు వివిధ రాష్ట్రాల్లో ఇన్‌చార్‌్జలుగా ఉన్న ప్రధాన కార్యదర్శులు, ఎన్నికలు జరుగనున్న రాష్ట్రాలకు నియమించిన ఇన్‌చార్‌్జలు ఇచ్చిన నివేదికలపై చర్చ సాగింది.