రహదారులపై శ్వేతపత్రం ప్రకటించండి జగన్

రాష్ట్రంలో తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రహదారుల  నిర్మాణం, మౌలిక వసతుల అభివృద్ధి కి తీసుకున్న చర్యలు ఏమిటో తెలుపుతూ ఒక శ్వేత పత్రం విడుదల చేయాలని ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహనరెడ్డిని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు డిమాండ్ చేశారు.
 
రాష్ట్రంలో రహదారులు ప్రమాదకర స్థితిలో ఉన్నా ప్రజల ఇబ్బందులను పట్టించుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ ప్రభు త్వనికి రు 4 వేల కోట్లు, గత తెలుగుదేశం ప్రభుత్వానికి రు 5 వేల కోట్ల రూపాయల నరేగా నిధులను కేంద్రం లోని నరేంద్ర మోదీ  ప్రభుత్వం విడుదల చేసిందని ఈ సందర్భంగా తెలిపారు. 
 
పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం రూరల్ మండలం మాధవరం గ్రామంలోని అమ్మ వార్ల ఆలయాల ప్రాంగణంలో భక్తులు ఆర్థిక సహకారంతో నిర్మించిన విశ్రాంతి భవనాన్ని సోము వీర్రాజు శనివారం ప్రారంభించిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహారశైలిపై మండిపడ్డారు.
 
  రాష్ట్రమంతా రహదారులన్ని పాడయి, దుస్థితిలో ఉన్నప్పటికీ రాష్ట్ర  ప్రభుత్వానికి నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని ఆయన  విమర్శించారు.   

About The Author