ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన శుక్రవారం జరిగిన కేంద్ర క్యాబినెట్ సమావేశంలో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లోని మూడు జిల్లాలను అనుసంధానం చేసే కీలక రైల్వే ప్రాజెక్ట్‌కు ఆమోదం తెలిపారు. బళ్లారి – గుంతకల్ రైల్వే డివిజన్‌లో రూ.1,240 కోట్ల అంచనా వ్యయంతో 3వ, 4వ లైన్ల నిర్మాణానికి ఆమోదం తెలిపిన కేంద్రం ఈ ప్రాజెక్ట్ 2028-29 నాటికి పూర్తవుతుందని అంచనా వేసింది.
దీంతో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లోని 3 జిల్లాల్లో అదనంగా మరో 46 కిలోమీటర్ల రైల్వే లైన్ అందుబాటులోకి రానుంది. ప్రణాళికాబద్ధమైన రవాణా, సరుకు రవాణా సామర్థ్యాన్ని పెంచడంపై దృష్టి పెడుతూ ఈ ప్రాజెక్ట్‌ను ‘పీఎం-గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్’ కింద రూపోందించారు. ఈ ప్రాజెక్ట్ పరిధిలోని దాదాపు 99 గ్రామాల్లోని సుమారు 7 లక్షల మంది జనాభాకు మెరుగైన రైలు సౌకర్యం లభిస్తుంది.
బళ్లారి కోట, శ్రీ కుమార స్వామి ఆలయం వంటి ప్రముఖ పర్యాటక ప్రాంతాలకు దీని వల్ల రైలు కనెక్టివిటీ మరింత మెరుగవుతుంది. ఈ ప్రతిపాదిత ప్రాజెక్ట్ ఇనుప ఖనిజం, డోలమైట్, సున్నపురాయి, ఉక్కు, బొగ్గు, ఎరువులు, ఆహార ధాన్యాలు మొదలైన సరుకు రవాణాకు ఒక ముఖ్యమైన మార్గంగా నిలవనుంది. సామర్థ్యం పెంపు వల్ల అదనంగా ఏడాదికి 16.22 మిలియన్ టన్నుల సరుకు రవాణా జరిగే అవకాశం ఉంటుంది.
రైల్వేలు పర్యావరణ అనుకూల, ఇంధన సమర్ధత కలిగిన రవాణా సాధనం కావడం వల్ల భారత్ నిర్దేశించుకున్న వాతావరణ లక్ష్యాలను సాధించడం, లాజిస్టిక్స్ ఖర్చులను తగ్గించడంలోనూ సహాయపడతాయి. అంతేకాకుండా, ఇంధన దిగుమతులు (1.32 కోట్ల లీటర్లు), కర్భన ఉద్గారాలను (6.67 కోట్ల కిలోలు) తగ్గిస్తాయి. ఇది 0.27 కోట్ల చెట్లను నాటడంతో సమానం.
ఈ మల్టీ-ట్రాకింగ్ ప్రతిపాదన కార్యకలాపాలను క్రమబద్ధీకరించి, రద్దీని తగ్గించడానికి సహకరిస్తుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ‘వికసిత్ భారత్’ ఆలోచనలకు అనుగుణంగా రూపుదిద్దుకుంది. ఇది ఆ ప్రాంతంలో సమగ్ర అభివృద్ధిని సాధించడం ద్వారా స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలను మెరుగుపరిచి ‘ఆత్మనిర్భర్ భారత్’దిశగా నడిపిస్తుంది.
ఈ మల్టీ-ట్రాకింగ్ ప్రతిపాదన కార్యకలాపాలను క్రమబద్ధీకరించి, రద్దీని తగ్గించడానికి సహకరిస్తుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ‘వికసిత్ భారత్’ ఆలోచనలకు అనుగుణంగా రూపుదిద్దుకుంది. ఇది ఆ ప్రాంతంలో సమగ్ర అభివృద్ధిని సాధించడం ద్వారా స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలను మెరుగుపరిచి ‘ఆత్మనిర్భర్ భారత్’దిశగా నడిపిస్తుంది.
అలాగే, దీంతో పాటు మూడు ప్రత్యేక రసాయన పార్కులను ఏర్పాటుకు ‘భారత్ ఔద్యోగిక్ వికాస్ యోజన రసాయన్’ లేదా ‘భవ్య – రసాయన్’ పథకాన్ని ఆమోదించింది. 2026-27 ఆర్థిక సంవత్సర కేంద్ర బడ్జెట్‌లో ఈ పథకాన్ని ప్రకటించారు. ఈ పథకానికి మొత్తం రూ.3,030 కోట్లు కేటాయించారు. పార్కు లోపల ఉమ్మడి మౌలిక సదుపాయాల కోసం రూ.3,000 కోట్లు, పరిపాలనా వ్యయం కోసం రూ.30 కోట్లు కేటాయించారు. పథకం ప్రకారం, ప్రతి పార్కుకు కేంద్రం రూ.1,000 కోట్ల వరకు గ్రాంటును అందిస్తుంది. అయితే, సంబంధిత రాష్ట్ర ప్రభుత్వం వాటాగా కనీసం రూ.500 కోట్లు అందించాల్సి ఉంటుంది.

More Stories
నీట్ వివాదంతో వైషమ్యాలు రెచ్చగొట్టే కుట్ర
మాజీ నాబార్డ్ ఛైర్మన్ పామిడి కోటయ్య కన్నుమూత
మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అరెస్ట్