పండిత్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ ప్రతిపాదించిన ఏకాత్మ మానవ దర్శనం, అంత్యోదయ సిద్ధాంతాలు నేటికీ సమాజానికి, ప్రభుత్వాలకు మార్గదర్శకంగా ఉన్నాయని ఏపీ బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ తెలిపారు. విజయవాడ లబ్బీపేటలోని పండిత్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ విగ్రహం వద్ద శుక్రవారం ఆయన జయంతి వేడుకలలో పాల్గొంటూ ప్రపంచం క్యాపిటలిజం, కమ్యూనిజం అనే రెండు సిద్ధాంతాల మధ్య విభజించబడిన సమయంలో భారతీయ చింతన ఆధారంగా దీన్‌దయాళ్ ఉపాధ్యాయ ఏకాత్మ మానవ దర్శనాన్ని ప్రతిపాదించారని తెలిపారు.
మనిషిని కేవలం ఆర్థిక జీవిగా కాకుండా శారీరక, మానసిక, బౌద్ధిక, ఆధ్యాత్మిక అవసరాలతో కూడిన సంపూర్ణ వ్యక్తిగా చూడాలని ఆయన సూచించారని ఆయన పేర్కొన్నారు. మహాత్మాగాంధీ ప్రతిపాదించిన సర్వోదయ భావనకు మరింత విస్తృత రూపంగా దీన్‌దయాళ్ ఉపాధ్యాయ అంత్యోదయ సిద్ధాంతాన్ని ముందుకు తీసుకొచ్చారని మాధవ్ తెలిపారు. సమాజంలోని చివరి వ్యక్తికి ప్రభుత్వ సంక్షేమం, అభివృద్ధి ఫలాలు చేరినప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన స్పష్టం చేశారు.
ప్రజల సంతోషం, సంక్షేమం ప్రభుత్వ విధానాలకు ప్రధాన కొలమానంగా ఉండాలని దశాబ్దాల క్రితమే దీన్‌దయాళ్ చెప్పారని గుర్తుచేశారు. పర్యావరణ పరిరక్షణ, సుస్థిర అభివృద్ధి, కుటుంబ వ్యవస్థ, సామాజిక సంబంధాలు, ఆధ్యాత్మిక విలువలపై కూడా దీన్‌దయాళ్ ఉపాధ్యాయ దూరదృష్టితో ఆలోచనలు చేశారని మాధవ్ పేర్కొన్నారు. నేడు ప్రపంచవ్యాప్తంగా చర్చకు వస్తున్న హ్యాపీనెస్ ఇండెక్స్, సస్టెయినబుల్ డెవలప్‌మెంట్ వంటి అంశాల్లో ఆయన ఆలోచనలతో పోలికలు కనిపిస్తున్నాయని చెప్పారు.
భారతీయ జనసంఘ్ అఖిల భారత అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం 1968 ఫిబ్రవరి 11న దీన్‌దయాళ్ ఉపాధ్యాయ అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించారని మాధవ్ తెలిపారు. భారతీయ ఆలోచనా విధానాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన గొప్ప దార్శనికుడిగా ఆయనను స్మరించుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
దీన్‌దయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా బీజేపీ కార్యకర్తలు ఆయన సిద్ధాంతాలను అధ్యయనం చేసి, సమాజంలోని చివరి వ్యక్తి సంక్షేమానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
దీన్‌దయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా బీజేపీ కార్యకర్తలు ఆయన సిద్ధాంతాలను అధ్యయనం చేసి, సమాజంలోని చివరి వ్యక్తి సంక్షేమానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఆయన ఆలోచనల నుంచి స్ఫూర్తి పొంది దేశ నిర్మాణంలో ప్రతి కార్యకర్త భాగస్వామి కావాలని కోరారు. పార్టీ సిద్ధాంతం, కార్యపద్ధతి, కార్యకర్త నడవడిక ఎలా ఉండాలో తన ఆచరణ ద్వారా దీన్‌దయాళ్ ఉపాధ్యాయ చూపించారని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన దీనదయాళ్ జయంతి వేడుకలలో పాల్గొంటూ తెలిపారు. జాతీయ అధ్యక్షుడిగా ఉన్నప్పటికీ అత్యంత నిరాడంబరంగా, సాధారణ కార్యకర్తగానే జీవించారని పేర్కొన్నారు.
ఏకాత్మ మానవ దర్శనం భారతీయ తత్వచింతనకు ప్రతిరూపమని, కుటుంబం నుంచి పాలన వరకు సమాజంలోని ప్రతి అంశంపై దీన్‌దయాళ్ ఉపాధ్యాయ విలువైన మార్గదర్శకత్వం అందించారని మాధవ్ చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌తో ఆయనకు ప్రత్యేక అనుబంధం ఉందని చెబుతూ విజయవాడలో ఏకాత్మ మానవ దర్శనంపై జాతీయ స్థాయి కార్యక్రమం నిర్వహించడం, ఆయన విగ్రహాన్ని ప్రతిష్ఠించడం రాష్ట్ర బీజేపీకి గర్వకారణమని తెలిపారు.

More Stories
అంబటి రాంబాబుకు మరోసారి ఈడీ నోటీసులు
“తైవాన్ స్వాతంత్ర్యాన్ని” వ్యతిరేకించాలని ట్రంప్ ను కోరిన జిన్‌పింగ్
సర్‌ను వ్యతిరేకించడమే దేశ ద్రోహం.. రాహుల్ రాజకీయ పరిజ్ఞానం `సున్నా’