కేసీఆర్‌ మీద కొట్లాటకు దిగినా.. అండగా ఉండండి

 ‘మీ కోసం కేసీఆర్‌ మీద కొట్లాటకు దిగిన… నాకు అండగా ఉండండి… నన్ను గుండెల్లో పెట్టుకొని కమలం పువ్వు గుర్తుకు ఓటు వేయాలి’ అని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్‌ ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. ఈ నెల 30న జరుగనున్న హుజురాబాద్ ఉపఎన్నికల ప్రహకారంకు ఎక్కడికి వెళ్లినా ఆయనకు ప్రజలు బ్రహ్మరధం పడుతున్నారు.
సోమవారం హుజూరాబాద్‌ హనుమాన్‌ ఆలయంలో మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డితో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించి ఈటల రాజేందర్‌ ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తూ  ప్రజలందరూ తమ  జేబుల్లో ఉన్నారని, తాము ఎటు చెప్తే అటు ఓటు వేస్తారని నాయకులు అనుకుంటున్నారని చెప్పారు. ‘అసలు హుజూరాబాద్‌లో జరిగే పంచాయితీ ధరల కోసం కాదు. కేసీఆర్‌ అహంకారానికి, ప్రజల ఆత్మగౌరవానికి జరుగుతున్న ఎన్నిక ఇది’అని రాజేందర్ స్పష్టం చేశారు.
`నాయకులు ఎటుపోయినా, ప్రజలు మాత్రం నాకు మద్దతుగా ఉన్నారు. అవసరం అయితే వాళ్ల జెండాలు, కండువాలు వేసుకొని ప్రచారం చేస్తాం కానీ ఓటు మాత్రం మీకే వేస్తామని అంటున్నారు’అని తెలిపారు. బానిసత్వంలో మగ్గిపోదామా..? తెలంగాణ ఆత్మగౌరవ బావుటా ఎగురవేద్దామా..? అని హుజూరాబాద్‌ నియోజకవర్గ ప్రజలు నిర్ణయించుకోవాలని పిలుపిచ్చారు. కేసీఆర్ సర్వే చేయించుకుంటే ఒక్క ఇంచు కూడా టీఆర్‌ఎస్‌ పెరగలేదట అంటూ ఎద్దేవా చేశారు.
ఐదు నెలల పది రోజులు అయ్యింది.. నాయకులు ఎటు పోయినా.. ప్రజలు మాత్రం తనకు మద్దతుగా ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు. ప్రతి సిలిండర్‌ వీద రాష్ట్ర ప్రభుత్వం రూ 291 పన్ను వసూలు చేస్తోందని చెబుతూ  ప్రజల మీద ప్రేమ ఉంటే ఆ పన్నును మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్‌ అహంకారానికి, ప్రజల ఆత్మ గౌరవానికి మధ్య జరగుతున్న ఎన్నిక ఇది రాజేందర్ చెప్పారు. కేసీఆర్‌ ఎన్ని ఇచ్చినా తీసుకోండి.. అవి ఇవ్వడానికి కారణం తనకు మాత్రం ఓటు వేయండని ఆయన కోరారు.
ఇలా ఉండగా, ఈ  ప్రభుత్వం ఎన్నికల ప్రభుత్వమని, ఎన్నికలు  వచ్చినప్పుడు మాత్రమే ప్రజలు గుర్తొస్తారని, ఆ సమయంలో హామీలు గుప్పించి తర్వాత మర్చిపోవడం సీఎం కేసీఆర్‌‌కు పరిపాటిగా మారిందని బీజేపీ జాతీయ కార్యవర్గం సభ్యుడు వివేక్ వెంకటస్వామి విమర్శించారు. హుజురాబాద్‌ నియోజకవర్గంలోని కమలాపూర్ మండల కేంద్రంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ మద్యం, బిర్యానీలు పంచుతూ ఈటలను ఓడించాలని చూస్తోందని, జనాలకు మాయమాటలు చెబుతోందని ధ్వజమెత్తారు. అయితే ప్రజల మనసును గెలిచిన ఈటల రాజేందర్ భారీ మెజారిటీతో ఎన్నికల్లో కూడా విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. 

టీఆర్ఎస్ సభకు వెళ్తూ.. ఈటలకు జై

రాజేందర్​ సోమవారం ప్రచారం చేస్తున్న టైమ్​లో ఓ ఆసక్తికర దృశ్యం కనిపించింది. హుజూరాబాద్​ మెయిన్​ రోడ్డు మీదుగా ప్రజలకు అభివాదం చేస్తూ ఈటల వెళ్తూ ఉన్నారు.  అదే సమయం​లో టీఆర్​ఎస్​ నిర్వహించిన మున్నూరుకాపు ఆత్మీయ సమ్మేళనానికి వెళ్లి వస్తున్న వాళ్ల బస్సు ఎదురైంది. 
 
ఈటలను చూడగానే బస్సులోని వాళ్లు ఆయనకు దండం పెడుతూ, విక్టరీ సింబల్​ చూపిస్తూ కనిపించారు. అంతకుముందు జరిగిన మున్నూరుకాపు సభలో మంత్రి హారీశ్ రావు మాట్లాడుతూ  తాను మాత్రం బాగుంటే చాలని ఈటల అనుకుంటున్నారని.. రైతులు,  ప్రజలు ఏమైనా ఆయనకు బాధ లేదని విమర్శించారు. మున్నూరుకాపుల వ్యతిరేకి ఈటలను చిత్తుగా ఓడించాలని మరో మంత్రి కమలాకర్​ పిలుపిచ్చారు. అయినా ఈటెలను చూడగానే వారిలో అభిమానం కొట్టుకొచ్చిన్నట్లు కనిపించింది.
 
అంతకు ముందు రోజు, హుజురాబాద్ ఇల్లందుకుంట మండలం హరీశ్ రావు ఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్ నాయకులు ఈటెలకు జై కొట్టారు. రాచపల్లిలో రోడ్ షోలో ఈటల రాజేందర్ నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదం ఇవ్వడం.. కింద ఉన్న కార్యకర్తలు జై కొట్టడం జరిగిపోయింది. అదే ప్రచార వాహనంలో ఉన్న మంత్రి హరీశ్ రావు..అలవాట్లో పొరపాటు అంటూ సర్దేశారు. 15 ఏళ్ల దోస్తాన ఆమాత్రం ఉంటుందని కవర్ చేశారు హరీశ్ రావు. హరీష్ రావు సభలలో ముందు వరసలో తప్ప జనం కనిపించడం లేదు. వెనుక ఉన్న కుర్చీలన్నీ ఖాళీగానే దర్శనం ఇస్తున్నాయి.