
ముంబై డ్రగ్స్ కేసులో ఇటీవలే ఎన్సీబీ అధికారులు అరెస్ట్ చేసిన స్టార్ హీరో షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ కు మద్దతుగా హృతిక్ రోషన్ తో సహా పలువురు బాలీవుడ్ ప్రముఖులు మద్దతుగా సోషల్ మీడియాలో పోస్టింగ్ లు చేయడంను నటి కంగనారనౌత్ ఎద్దేవా చేశారు.
.‘ఇప్పుడు ఆర్యన్ ఖాన్ డిపెండ్ చేయడానికి మొత్తం మాఫియా పప్పు రంగంలోకి దిగింది. మనం తప్పుటు చేస్తాం. కానీ వాటిని గొప్పగా చెప్పుకోం. ఈ తప్పు (డ్రగ్ కేసు) వల్ల కలిగే ఇబ్బందులు అతని దృక్పథాన్ని మారుస్తాయని నేను గట్టిగా నమ్ముతున్నా. కానీ అతను ఎటువంటి తప్పు చేయలేదు అని చెప్పడం మంచిది కాదు’ అని అందులో కంగనా ఘాటుగా విమర్శించింది.
ఆర్యన్‌కు రాసిన బహిరంగ లేఖలో హృతిక్ రోషన్ “నేను అతడికి సానుభూతి తెలుపుతున్నాను. అనుభవిస్తున్న ఈ చీకటి అతడికి వెలుగును చూయిస్తుందని ఆశిస్తున్నాను” అంటూ పేర్కొన్నారు. అలాగే, ఇప్పటికే కండల వీరుడు సల్మాన్ ఖాన్, సునీల్ శెట్టి, పూజ భట్‌లతో పాటు పలువురు ఆర్యన్ ఖాన్ కు మద్దుతుగా నిలిచారు.
సోనూసూద్ పై నెటిజన్లు మండిపాటు
తాజాగా నటుడు సోనుసూద్, స్టార్ హీరో హృతిక్ రోషన్ మాజీ భార్య సుసానే ఖాన్‌లు సైతం షారుక్ మద్దుతుగా నిలిచారు. ఆర్యన్‌కు ముంబై కోర్టు బెయిల్ నిరాకరించి అక్టోబర్ 7 వరకు ఎన్‌సీబీ కస్టడిలో ఉండాల్సిందిగా ఆదేశించింది. ఈ క్రమంలో ఆర్యన్ పేరు ప్రస్తావించకుండా సోనూసూద్ హిందీలో ట్వీట్ చేశాడు.
‘పిల్లలు విలువైన వారు. నిజానిజాలు బయటకు రావడానికి కాస్త సమయంలో పడుతుంది. అప్పుడే మీరు దేవుడిలా పరిస్థితిని మీ చేతిలోకి తీసుకోకండి. ఇలాంటి క్లిష్ట సమయంలో ఒకరికి ఒకరు అండగా ఉండాలి’ అంటూ సానుభుతి వ్యక్తం చేశారు. దీనిపై నెటిజన్లు మండిపడుతున్నారు.
సోనుసూద్ ఆర్యన్ ఉద్దేశించే ఈ ట్వీట్ చేశారని భావించిన ఓ నెటజన్ స్పందిస్తూ.. ‘23 ఏళ్ల వయసులోనే కపిల్ దేవ్ ఇండియాకు వరల్డ్ కప్ గెలిచాడు. 23 ఏళ్ల వయసులో నీరజ్ చొప్రా ఒలింపిక్స్ గెలిచిని ఇండియాకు గోల్డ్ మెడల్ తెచ్చాడు. 23 ఏళ్ల వయసులోనే సచిన్ 1996 వరల్డ్ కప్ సమయంలో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడి రికార్డు సృష్టించాడు’ అంటూ గుర్తు చేసాడు.
పైగా, `ఇదే 23 ఏళ్లలో భగత్ సింగ్ దేశం కోసం ప్రాణ త్యాగం చేశాడు. మరీ 23 ఏళ్లకు ఆర్యన్ చిన్నపిల్లాడా?’ అంటూ కామెంట్ చేశాడు. మరో నెటిజన్ కూడా ‘ఆర్యన్ ఎంటో మాకు తెలుసు. 23 ఏళ్లలోనే అతడు రేవ్ పార్టీకి వెళ్లాడంటే అతడు మంచివాడ, చెడ్డవాడనేది తెలిసిపోతుంది. అతడి అలవాట్లు ఎలా ఉంటాయో కూడా అంచన వేయగలం. జనాలు అంత పిచ్చివాళ్లు కాదు’ అంటూ ఎద్దేవా చేసాడు.
`ఇప్పుడు మీరు అతడిని మంచి వాడిలా చూపించే ప్రయత్నం చేయకండి’ అంటూ కామెంట్ చేశాడు. అలాగే హృతిక్ మాజీ భార్య సుసానే కూడా ‘ఆర్యన్ మంచి పిల్లాడు. తనపై ఇలాంటి ఆరోపణలు రావడాన్ని నమ్మలేకపోతున్నా. ఒకవేళ ఆర్యన్ అనుకొకుండా తప్పుడు ప్లేస్ ఉండోచ్చు. కావాలనే అతడిని ఇందులో ఇరికించారమో….. ‘ అంటూ ట్వీట్ చేసింది. వారు చేసిన ట్వీట్‌లు చూసిన నెటిజన్లు వీరిద్దరిపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఇంతకుముందు ఆర్యన్ బెయిల్ పిటిషన్ పెట్టుకోగా కొట్టివేసిన కోర్టు.. అక్టోబర్ 7 వరకు ఎన్‌సీబీ కస్టడీకి అప్పగించింది. గురువారంతో ఆ గడువు ముగియగా.. ఈ కేసు విచారించిన కోర్టు మళ్లీ బెయిల్ నిరాకరించి, అతడి కస్టడీని 14 రోజుల వరకు పొడిగించింది. అంతేకాకుండా ఈ కేసును ఇకపై ప్రత్యేక ఎన్‌డీపీఎస్ కోర్టు విచారించనున్నట్లు కోర్టు తెలిపింది.
More Stories
సామరస్యపూర్వక, వ్యవస్థీకృత హిందూ సమాజ నిర్మాణం
మహారాణి అబ్బక్కకు ఆర్ఎస్ఎస్ ఘనంగా నివాళులు
`సర్వ స్పర్శి, సర్వవ్యాపి’గా ఆర్ఎస్ఎస్ అన్ని అంశాల స్పృశి