మల్లన్నపై ఇన్ని కేసులా… హైకోర్టు ఆగ్రహం

తీన్మార్‌ మల్లన్న అలియాస్‌ చింతపండు నవీన్‌ కు హైకోర్టులో ఊరట లభించింది. మల్లన్నపై ఒకే ఒక్క కారణంతో పలు కేసులు నమోదు చేయడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మల్లన్న సతీమణి మాతమ్మ వేసిన పిటిషన్ పై సోమవారం విచారణ చేసిన న్యాయ స్థానం మల్లన్నపై ఒకే కారణం తోటి  పలు కేసులు నమోదు చేయడం ఏంటని ప్రశ్నించింది. 
 
తెలంగాణలో మల్లన్నను  అరెస్ట్ చేయాలన్న, మరో కేసు నమోదు చేయాలన్నా డీజీపీ అనుమతి తప్పనిసరి అని చెప్పింది. డీజీపీ పర్యవేక్షణలోనే విచారణ జరగాలన్న న్యాయస్థానం, కేసు నమోదు చేసిన తర్వాత  41 సీఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చాకే విచారణ చేయాలని సూచించింది. మల్లన్నపై ఉన్న 35 కేసులపై వాదనలు వినిపించిన మల్లన్న న్యాయవాది దిలీప్ సుంకర బెయిల్ పిటిషన్ పై మంగళవారం మరోసారి వాదనలు వినిపించునున్నారు, 

 కాగా, తీన్మార్ మల్లన్నను దేశ ద్రోహి లాగా జైలులో బంధించారని,  37 రోజులుగా మానసికంగా వేధిస్తున్నారని బిజెపి ఎంపీ డి అరవింద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మల్లన్నను చంచల్ గూడ జైలులో కలిసిన అరవింద్ మల్లన్న ఉగ్రవాది కాదని, పోరాట యోధుడని అని స్పష్టం చేశారు. ఒక్కడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర అభార్థిగా గా అయ్యా, కొడుకులకు చుక్కలు చూపెట్టాడని గుర్తు చేశారు. 

కేసీఆర్, కేటీఆర్ ఇంతకు ఇంత అనుభవిస్తారని హెచ్చరిస్తూ “అసలైన దొంగలు మీరు.. మల్లన్న కాదు” అని అరవింద్ స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజలు అన్నీ గమనిస్తున్నారని,  రాష్ట్రంలో రజాకార్ల రాజ్యం నడుస్తోందని విమర్శించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే మల్లన్నను బంధించారని ఆరోపించారు. మల్లన్నను బీజేపీలో చేర్చుకోవాలని కేంద్ర నాయకత్వం చెప్పిందని., .త్వరలోనే ఆయన బయటకు వస్తాడని, తాము ఘన స్వాగతం పలుకుతామని అరవింద్ వెల్లడించారు.

కేసీఆర్ గాంధీ కాదు.. బ్రాంది అంటే జైలులో పెడతారా ? కేసీఆర్ గాంధీ నా, బ్రాంది నా?? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. చిల్లర కేసుల పేరుతో మల్లన్నను వేదించాలనుకున్నారని,  కానీ.. పోరాట యోధుడు ఎవరికీ భయపడడని స్పష్టం చేశారు.  అంతేకాదు..ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుందని భరోసా వ్యక్తం చేశారు.