5 ఈశాన్య రాష్ట్రాల మీదుగా స్పెష‌ల్ టూరిస్ట్ రైలు

ఐదు ఈశాన్య రాష్ట్రాల‌ను క‌లుపుతూ స్పెష‌ల్ టూరిస్టు రైలును ప్రారంభించ‌డానికి గ‌ల అవ‌కాశాల‌ను ప‌రిశీలిస్తున్న‌ట్లు ఇండియ‌న్ రైల్వే క్యాట‌రింగ్ అండ్ టూరిజం కార్పొరేష‌న్ (ఐఆర్సీటీసీ) తెలిపింది. దేఖో అప్నా దేశ్ అనే ఇన్షియేటివ్‌లో భాగంగా తాము ఈ ప్రాజెక్టును చేప‌ట్ట‌నున్న‌ట్లు పేర్కొంది. ప్ర‌యాణికుల ర‌ద్దీ లేకుండా14 రాత్రులు, 15 ప‌గ‌ళ్లు నిరంత‌రాయంగా ఈ టూరిస్ట్ రైలు ప్ర‌యాణిస్తుంది.

ఇప్ప‌టి వ‌ర‌కు తాక‌ని, అన్వేషించ‌ని, అనూహ్య ప్రాంతాల‌కు ప్ర‌యాణికుల‌ను తీసుకెళ‌తామ‌ని ఐఆర్సీటీసీ వెల్ల‌డించింది. గువ‌హాటి ఆవ‌ల ఈశాన్య ప్రాంతాల ఆవిష్క‌ర‌ణ కోసం సాగే దేఖో అప్నా దేశ్ ఏసీ డీల‌క్స్ టూరిస్టు రైలులో అద్భుత‌మైన ప్ర‌యాణానికి సిద్ధం కావాలంటూ ఐఆర్సీటీసీ అధికారి పిలుపునిచ్చారు.

దేశ చ‌రిత్ర‌లోనే తొలిసారి ఈశాన్య రాష్ట్రాల‌ను క‌లుపుతూ స్పెష‌ల్ టూరిస్ట్ రైలును న‌డుప‌నున్న‌ట్లు ఐఆర్సీటీసీ అధికారి చెప్పారు. ప్ర‌ముఖ ఐదు ఈశాన్య రాష్ట్రాల మీదుగా ఈ టూరిస్ట్ రైలు వెళుతుంది. ఢిల్లీలోని స‌ప్ధ‌ర్‌జంగ్ రైల్వే స్టేష‌న్ నుంచి ఈ స్పెష‌ల్ రైలు ప్ర‌యాణం మొద‌ల‌వుతుంది.

అసోంలోని గువాహ‌టి, కాజిరంగా, జోహ్రాత్‌, అరుణాచ‌ల్ ప్ర‌దేశ్లోని ఇటా న‌గ‌ర్‌, నాగాలాండ్‌లోని కోహిమా, త్రిపుర‌లోని ఉన‌కోటి, అగ‌ర్త‌ల‌, ఉద‌య్‌పూర్‌ల‌ను, మేఘాల‌య‌లోని షిల్లాంగ్‌, చెరాపుంజీ ప్రాంతాల మీదుగా ఈ రైలు ప్ర‌యాణం సాగుతుంది. ల్లీలోని స‌ప్ధ‌ర్‌జంగ్, ఘ‌జియాబాద్‌, తుండ్లా, కాన్పూర్‌, ల‌క్నో, వార‌ణాసి, పాట్నా రైల్వే స్టేష‌న్ల‌లో ప్ర‌యాణికులు రైలెక్క‌వ‌చ్చు. వ‌చ్చేనెల 26వ తేదీన స‌ఫ్ధ‌ర్ జంగ్ రైల్వే స్టేష‌న్ నుంచి ఈ రైలు బ‌య‌లుదేరుతుంది.

పూర్తి త‌మాషా, అడ్వెంచ‌ర్‌తోపాటు క‌జీరంగా నేష‌న‌ల్ పార్క్‌లోని జంగిల్ స‌ఫారీ, మేఘాల‌యలోని రూట్ బ్రిడ్జి మీదుగా ఈ టూర్ సాగుతుంది. అలాగే గువాహ‌టిలోని కామ‌ఖ్యా టెంపుల్ సంద‌ర్శించే చాన్స్ ప్ర‌యాణికుల‌కు ఉంటుంది. ఇక త్రిపుర‌లో త్రిపుర సుంద‌రి దేవాల‌యాన్నీ ద‌ర్శించుకునే వీలు ఉంటుంది.

బ్ర‌హ్మ‌పుత్ర న‌ది మీదుగా, అసోంలోని టీ తోట‌ల మీదుగా టూరిస్ట్ రైలు వెళుతుంది. త్రిపుర‌లో ఉన కోటి శిల్పాలు, ఉజ‌యంతా ప్యాలెస్‌, నీర్‌మ‌హాల్ ప్యాలెస్‌నూ సంద‌ర్శించేకు అవ‌కాశం ఉంటుంది.

ప్ర‌యాణికుల‌కు టూటైర్ ఏసీపై రూ.85,495, ఫ‌స్ట్ క్లాస్ ఏసీ బోగీలో ప్ర‌యాణానికి రూ.1,02,430 టిక్కెట్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఆర్థిక శాఖ మార్గ‌ద‌ర్శ‌కాల‌ను బ‌ట్టి కేంద్ర ప్ర‌భుత్వ‌, ప్ర‌భుత్వ రంగ సంస్థ‌ల ఉద్యోగులు ఎల్టీసీ ఫెసిలిటీని ఉప‌యోగించుకోవ‌చ్చు. ఇక ప్ర‌యాణికులకు డీల‌క్స్ క్లాస్ వ‌స‌తులు, రుచిక‌ర‌మైన ఫుడ్‌, ప‌ర్యాట‌క ప్ర‌దేశాల‌కు ఏసీ టూర్ ప్ర‌యాణం అందుబాటులోకి తెస్తుంది ఐఆర్సీటీసీ.