పింక్ బాల్ టెస్ట్‌లో స్మృతి మందానా రికార్డు

భారత మహిళా  టీమ్ ఓపెన‌ర్ స్మృతి మందానా చరిత్ర సృష్టించింది. ఆస్ట్రేలియా వుమెన్ క్రికెట్ టీమ్‌తో జ‌రుగుతున్న ఏకైక డేనైట్ టెస్ట్ లో ఆమె అత్యధిక స్కోర్ సాధించిన భారతీయురాలిగా రికార్డు నెలకొల్పింది.  

పింక్ బాల్ టెస్(డే అండ్ నైట్)లో శతకాన్ని నమోదు చేసిన తొలి  భారతీయ మహిళా  క్రికెటర్ గా రికార్డు సాధించింది. కాగా, శతకాన్ని సాధించిన రెండో భారతీయ మహిళా క్రికెట్ క్రీడాకారిణిగా మహారాష్ట్రకు చెందిన ఆమె నిలిచారు. ఆమెకన్నా ముందు 1984లో సంధ్య గోయల్ శతకం సాధించారు. 

రెండో రోజు ఆట సమయానికి భారత్ 231/3తో పురోగమనంలో ఉంది. ఆస్ట్రేలియా గడ్డపై భారతీయ మహిళా క్రికెటర్ కు ఇదే తొలి శతకం. 171 బంతుల్లో ఆమె మూడంకెల స్కోరును అందుకుంది. నిజానికి తొలి రోజే ఆమె సెంచ‌రీ చేసేలా క‌నిపించినా.. వ‌ర్షం అడ్డుప‌డ‌టంతో కేవ‌లం 44 ఓవ‌ర్ల ఆట మాత్ర‌మే సాధ్య‌మైంది.

దీంతో ఆమె 80 ప‌రుగుల‌తో నాటౌట్‌గా నిలిచింది. రెండో రోజు అదే దూకుడు కొన‌సాగించిన ఆమె.. ఆట ప్రారంభ‌మైన కాసేప‌టికే సెంచ‌రీ మార్క్ అందుకుంది. ఆమె సెంచ‌రీలో 19 ఫోర్లు, ఒక సిక్స్ ఉండ‌టం విశేషం. ఈ అద్భుత‌మైన ఇన్నింగ్స్‌లో ఆమె కొన్ని క‌ళ్లు చెదిరే ఆఫ్‌సైడ్ షాట్ల‌తో అల‌రించింది. ఈ టెస్ట్ మ్యాచ్ కోసం గ‌త మూడు నెల‌లుగా తాను పింక్ బాల్‌ను ద‌గ్గ‌ర పెట్టుకొని ప్ర‌త్యేకంగా ప్రాక్టీస్ చేస్తున్న‌ట్లు తొలి రోజు ఆట త‌ర్వాత మందాన చెప్పింది. అందుకే తాను ఆ బంతికి అల‌వాటు ప‌డిన‌ట్లు ఆమె తెలిపింది.

స్మృతి మంధన 216 బంతుల్లో 127 పరుగులు చేసి రికార్డు సృష్టించింది. ఆ స్కోరులో 22 బౌండరీలు, ఒక సిక్సర్ ఉన్నాయి. రెండో వికెట్ (పూనమ్ రౌత్-36) పతనం సమయానికి భారత్ ఆస్ట్రేలియాపై 102 పరుగుల ఆధిక్యతతో ఉంది. తొలి రోజున షఫాలీ వర్మ 93 పరుగులతో శుభారంభం చేసినప్పటికీ వాన వల్ల ఆట ఆగిపోయింది.

స్కోరు సంక్షిప్తంగా: భారత్ తొలి ఇన్నింగ్స్: 231/3(84 ఓవర్లలో).