ముఖ్యమంత్రి అయ్యాక నియంతలాగా పాలిస్తున్న కేసీఆర్

ప్రజాస్వామిక తెలంగాణ తెస్తానన్న కేసీఆర్ము ఖ్యమంత్రి అయ్యాక నియంతలాగా పాలిస్తున్నాడని బీజేపీ కోర్ కమిటీ సభ్యుడు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి ధ్వజమెత్తారు. కేసీఆర్, ఆయన కుటంబ సభ్యులే తెలంగాణను పాలిస్తూన్నారని, రాష్ట్రంలో ఇంత గొడవ నడుస్తుంటే.. కేసీఆర్ తిరుపతి తిరుమల దేవస్థానంలోనూ వారి కుటుంబ సభ్యులు ఐదుగురికి పదవులు ఇప్పించుకున్నాడని ఆరోపించారు. 
 
తెలంగాణ సాధించుకున్నది కల్వకుంట్ల కుటుంబం కోసమే అన్నట్లుగా మారిందని కమలాపూర్ మండలం ఉప్పలపల్లిలో జరిగిన బీజేపీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ ధ్వజమెత్తారు. తెలంగాణ సాధనలో ఈటలతో పాటు తాను  ముందుండి పోరాడం.. ఆస్తులు ఖర్చు చేశామని పేర్కొన్నారు.
‘‘ప్రజలు గొర్రెలు.. పైసలిస్తే ఓట్లేస్తారని అనుకుంటుండు కేసీఆర్ .. తెలంగాణ సాధించుకున్నది కల్వకుంట్ల కుటుంబం కోసమే అన్నట్లుగా మారింది.. దేశంలో అతిపెద్ద అవినీతి పరుడు కేసీఆర్ అని ఇండియా టుడే  సర్వేలో తేలింది.. అవినీతి డబ్బుతో హుజూరాబాద్ లో గెలవాలని చూస్తున్నాడు..’’ అంటూ విమర్శలు గుప్పించారు.
 
కెసీఆర్ తన అవసరానికి అందరినీ వాడుకుని పక్కన పెడతాడని చెబుతూ నమస్తే తెలంగాణ పత్రిక కోసం ఈటల రాజేందర్ సొంత భూమి తాకట్టు పెట్టి డబ్బులు ఇచ్చాడని, ఇప్పుడు అదే భూమిపై ఈటలపై భూ ఆక్రమణ ఆరోపణలు చేసి పక్కన పెట్టాడని వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. 
 
తాను కూడా టీఆర్ఎస్ కు ఓనర్నని అన్నందుకు, వడ్ల కొనుగోలు ఉండాలన్నందుకే ఈటలపై కేసీఆర్ కోపం పెంచుకున్నాడని చెబుతూ కౌలు రైతులకు రైతు బంధు ఇవ్వాలని ఈటల కొట్లాడారని త్లెఇపారు. భూస్వాములకు కాకుండా.. సాగు చేసేవారికే రైతు బంధు ఇవ్వాలని అడిగారని, దీంతో ఈటల రాజేందర్ ఎక్కువగా మాట్లాడుతున్నాడని కేసీఆర్ భావించి బయటకు పంపించేశారని విమర్శించారు.

అవినీతిలో కూరుకుపోయిన సీఎం కేసీఆర్ కు తనకు ఎదురులేదన్న భావనతో అధికార గర్వం తలకెక్కిందని వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. ఎప్పుడు ఫామ్ హౌస్ లో పడుకుని ఆస్తులు ఎలా పెంచుకోవాలని ఆలోచిస్తాడన్నారని ఆరోపిస్తూ మిషన భగీరథలో రూ 40 వేల కోట్ల కుంభకోణం చేశాడని, కాళేశ్వరం ప్రాజెక్టులో రూ 30 వేల కోట్ల నుంచి లక్ష కోట్లకు పెంచి అవినీతికి పాల్పడ్డాడని విమర్శించారు.