తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి)కి 28మంది సభ్యులతో కొత్త పాలక మండలిని ఏపీ ప్రభుత్వం నియమించింది. వీరిలో నలుగురు ఎక్స్ అఫిషియో సభ్యులు ఉంటారు. ఈ మేరకు బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసిం గత బోర్డుల నియామకం సమయంలోనూ ప్రత్యేక ఆహ్వానితుల సంఖ్య పరిమితంగా ఉండగా ఈసారి మాత్రం ఏకంగా 52మందిని నియమించింది. మొత్తం బోర్డు సభ్యుల సంఖ్యను 81కి చేర్చింది.
పాలక మండలిలో రెండోసారి సభ్యత్వం దక్కించుకున్న వారిలో తెలంగాణకు చెందిన మైహోం అధినేత రామేశ్వరరావు, హెటిరో పార్థసారథి రెడ్డి, రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర రెడ్డి భార్య ప్రశాంతిరెడ్డి, ముంబైకి చెందిన రాజేశ్ శర్మ, ఇండియా సిమెంట్స్ అధినేత శ్రీనివాసన్ ఉన్నారు.
వ్యాపారవేత్త మారుతి, ఆడిటర్ సనత్, ఎంఎ్‌సఎన్ ల్యాబ్స్ అధినేత జీవన్‌రెడ్డి, కోల్‌కతాకు చెందిన సౌరభ్, డాక్టర్ కేతన్ దేశాయ్, కర్ణాటక నుంచి శశధర్ శంకర్, పుదుచ్చేరి మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు సభ్యులుగా నియమితులయ్యారు. రాష్ట్రం నుంచి పోకల అశోక్, ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్‌రెడ్డి, మధుసూదన్ యాదవ్, తెలంగాణకు చెందిన కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుర్తి విద్యాసాగర్, తమిళనాడు నుంచి వేల్లూరు ఎమ్మెల్యే నందకుమార్, కర్ణాటక నుంచి ఎమ్మెల్యే విశ్వనాథరెడ్డి ఉన్నారు.
ఎక్స్ అఫిషియో సభ్యులుగా దేవదాయ శాఖ ముఖ్యకార్యదర్శి, కమిషనర్, తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ చైర్మన్, టీటీడీ ఈవో (మెంబర్ సెక్రటరీ) ఉంటారు. తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి, బ్రాహణ కార్పొరేషన్ చైర్మన్ సుధాకర్, కె.శివకుమార్, ఒడిశాకు చెందిన దుష్మంత్ కుమార్ దాస్ సహా 52మందిని ప్రత్యేక ఆహ్వానితులుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.
పాలకమండలి సభ్యులు వీరే
పోకల అశోక్, మల్లాడి కృష్ణారావు, టంగుటూరు మారుతి ప్రసాద్, మన్నే జీవన్‌రెడ్డి, బండి పార్థసారథి రెడ్డి, జూపల్లి రామేశ్వరరావు, ఎన్.శ్రీనివాసన్, రాజేశ్ శర్మ, బోరా సౌరభ్, మురంశెట్టి రాములు, కల్వకుర్తి విద్యాసాగర్, ఏపీ నందకుమార్ (ఎమ్మెల్యే), పి.సనత్ కుమార్ (ఆడిటర్), వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, కేతన్ దేశాయ్, బూదాటి లక్ష్మీనారాయణ, మిలింద్ కేశవ్ నర్వేకర్, ఎం.ఎన్.శశిధర్, రాజోలుకు చెందిన కృష్ణంరాజు భార్య అల్లూరి మల్లీశ్వరి, ఎస్.శంకర్, ఎస్.ఆర్.విశ్వనాథరెడ్డి (ఎమ్మెల్యే), బుర్రా మధుసూదన్ యాదవ్, కిలివేటి సంజీవయ్య, కాటసాని రాంభూపాల్‌రెడ్డి.
More Stories
తిరుమలలో శారదాపీఠం అక్రమ నిర్మాణంపై హైకోర్టు ఆగ్రహం
తిరుపతి తొక్కిసలాటపై హైకోర్టు రిటైర్డ్ జడ్జితో విచారణ
వీర జవాన్ కార్తీక్ కు కన్నీటి వీడ్కోలు