తమిళనాడు గవర్నర్ గా ఆర్ఎన్‌ రవి

ప్రస్తుతం నాగాలాండ్‌లో గవర్నర్‌‌గా ఉన్న మాజీ ఐపీఎస్ ఆఫీసర్ ఆర్ఎన్‌ రవిని నియమించారు. నాగాలాండ్‌ గవర్నర్ బాధ్యతలను అస్సాం గవర్నర్ ప్రొఫెసర్ జగదీశ్ ముఖికి అదనంగా అప్పగించారు.  ఐదు రాష్ట్రాల గవర్నర్ల నియామకానికి  సంబంధించి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్ ఆమోద ముద్ర వేశారు.

2015లో కేంద్ర ప్రభుత్వం నాగా తీవ్రవాద బృందాలతో చేసుకున్న శాంతి ఒప్పందం సందర్భంగా ఆయా బృందాలతో చర్చలకు రవి నేతృత్వం వహించారు. అయితే ఈ ఒప్పందం ముందుకు వెళ్ళాక పోవడంతో ఆయన బృందాలు అసంతృప్తిగా ఉన్నాయి.  గత సంవత్సరకాలంగా కేంద్ర నిఘా విభాగం నేరుగా వారితో  చర్చలు జరుపుతున్నాయి.  

తమిళనాడుకు గవర్నర్‌‌గా ఉన్న బన్వరీలాల్ పురోహిత్‌ కొన్నాళ్లుగా పంజాబ్‌ గవర్నర్‌‌గా కూడా అదనపు బాధ్యతలను నిర్వహిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఆయనకు పూర్తిగా పంజాబ్‌ బాధ్యతలను మాత్రమే అప్పగిస్తూ రాష్ట్రపతి భవన్ ఉత్తర్వులు జారీ చేసింది.

ఉత్తరాఖండ్ గవర్నర్‌‌గా ఉన్న బేబీ రాణి మౌర్య రాజీనామాను రాష్ట్రపతి ఆమోదించారని, ఆమె స్థానంలో కొత్తగా మాజీ ఆర్మీ ఆఫీసర్, లెఫ్టినెంట్ జనరల్ గుర్మిత్ సింగ్‌ను నియమించారని అందులో పేర్కొన్నారు.

గుర్మిత్ సింగ్ 2016 ఫిబ్రవరిలో ఆర్మీ నుంచి రిటైర్ అయ్యారు. ఆయన 40 ఏండ్ల పాటు ఆర్మీలో సర్వీస్ చేశారు. డిప్యూటీ చీఫ్​ ఆఫ్​ ఆర్మీ స్టాఫ్ స్థాయి వరకూ వెళ్లారు. చైనాతో ఉన్న సరిహద్దు వివాదాల్లో ఆపరేషనల్,  సైనిక వ్యూహాత్మక అంశాలపైనా గుర్మిత్ సింగ్ పని చేసి, కీలకపాత్ర వహించగారు. అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్​ మిలటరీ ఆపరేషన్స్ ర్యాంక్‌లో ఆయన ఈ వ్యవహారాలను డీల్ చేశారు.

 

రాష్ట్రంలో సాయుధ బృందాలు ప్రత్యామ్న్యాయ పాలన నడుపుతూ రాష్ట్ర ప్రభుత్వ చట్టబద్దతను సవాల్ చేస్తున్నాయని రవి విమర్శించారు. అయితే ఆయన అంచనా వాస్తవం కాదని రాష్ట్ర ప్రభుత్వం తోసిపుచ్చింది. రవిని ఒక పెద్ద రాష్ట్రంపై గవర్నర్ గా నియమించడం ద్వారా ఆయన సేవలు తమకు అవసరం అనే సంకేతం ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం, అదే సమయంలో నాగా ఒప్పందం అమలు పట్ల కూడా శ్రద్ద ఉన్నట్లు వ్యక్తం చేసింది.