అలీఖాన్ తో రవితేజ లావాదేవీలపై ఈడీ ఆరా

మనీలాండరింగ్ వ్యవహారంలో హీరో రవితేజను దాదాపు 6 గంటల పాటు ఈడీ అధికారులు టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ప్రశ్నించారు. రవితేజతోపాటు అతని డ్రైవర్ శ్రీనివాస్ ను కూడా విచారించారు. కేసులో నిందితుడు కెల్విన్ స్నేహితుడు జీషన్ ను సైతం ఈడీ ప్రశ్నించింది.
జీషన్ అలీఖాన్ తో జరిపిన లావాదేవీలపై ఈడీ అధికారులు ఆరా తీశారు. రవితేజ, జీషన్ మధ్య ప్రత్యక్ష లావాదేవీలు జరిగినట్లు ఈడీ గుర్తించింది. లావాదేవీలపై రవితేజ, జీషన్ ను ప్రశ్నించారు. జీషన్ జరిపిన లావాదేవీలపై సమాధానాలను రవితేజ దాటవేసినట్లు సమాచారం. గతంలో ఇదే కేసులో ఎక్సైజ్‌ అధికారులు జరిపిన విచారణ సందర్భంగా జీషాన్‌కు, రవితేజ వాట్సా్‌ప లో సంభాషణలు జరిపినట్లు గుర్తించారు. అయితే, జీషాన్‌ ఎవరో తనకు తెలియదని రవితేజ ఈ సందర్భంగా చెప్పినట్లు సమాచారం.

2017లో అరెస్టయిన జీషాన్‌ అలీ.. ఆ తర్వాత బెయిల్‌పై బయటకొచ్చాడు. ఈ ఏడాది జూలైలో రంగారెడ్డి జిల్లా కడ్తాల్‌ శివారులోని ఓ ఫాంహౌ్‌సలో రేవ్‌పార్టీని నిర్వహించడం గమనార్హం. హైదరాబాద్‌లోని ఎంఎన్‌సీలకు చెందిన 70 మంది సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లు ఆ పార్టీలో పాల్గొన్నారు. రాత్రి మద్యం సేవిస్తూ.. డీజే శబ్దాలతో చిందులు వేశారు. 

స్థానికులు సమాచారం ఇవ్వడంతో కడ్తాల్‌ పోలీసులు దాడులు చేశారు. 67 మందిని అరెస్టు చేశారు. అందులో 21 మంది యువతులు, 43 మంది యువకులుండగా.. ముగ్గురు నిర్వాహకులున్నారు. అప్పుడు జీషాన్‌ అలీని సొంత పూచికత్తుపై పోలీసులు విడుదల చేశారు.

కాగా, డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితుడు కెల్విన్ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగానే టాలీవుడ్ ప్రముఖులను ఈడీ అధికారులు విచారిస్తున్నారు. డ్రగ్స్ కేసులో నిన్న హీరో రానాను ఈడీ అధికారులు విచారించారు. అంతకు ముందు డైరెక్టర్ పూరి జగన్నాధ్, హీరోయిన్స్ ఛార్మీ, రకుల్ ప్రీత్ సింగ్ హాజరైయ్యారు. ఈ కేసులో సినీరంగానికి చెందిన 12 మందికి ఈడీ నోటీసులు జారీ చేసింది. నవదీప్‌తో పాటు ఎఫ్‌-క్లబ్‌ జనరల్‌ మేనేజర్‌ 13న, ముమైత్‌ఖాన్‌ 15న, తనీష్‌ 17న, తరుణ్‌ 22న విచారణకు హాజరుకానున్నారు.