
పశ్చిమ బెంగాల్‌కు చెందిన బీజేపీ ఎంపీ అర్జున్ సింగ్ నివాసం వద్ద బాంబు దాడి జరిగింది. కోల్‌కతా సమీపంలోని ఆ ఎంపీ ఇంటి ముందు ఇవాళ మూడు బాంబులను విసిరారు. ఉదయం 6 గంటల ప్రాంతంలో ఈ దాడి జరిగింది.
పేలుళ్ల వల్ల ఎంపీ ఇంటి ముందు గేట్లు ధ్వంసమైనట్లు తెలుస్తోంది. ఆ సమయంలో ఎంపీ ఇంట్లో లేరు. ఆయన కుటుంభం సభ్యులు మాత్రం ఉన్నారు. ఢిల్లీలో ఉన్న ఎంపీ అర్జున్ సింగ్ .. హుటాహుటిన కోల్‌కతాకు పయనమయ్యారు. ఆ ప్రాంతంలోని సిసి కెమెరాల ఫ్యూటేజ్ లను పోలీసులు పరిశీలిస్తున్నారు.
ఈ ఘటనపై ఆ రాష్ట్ర గవర్నర్ జగదీప్ ధంకర్ ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఇటువంటి సంఘటనలు తరచుగా జరుగుతున్నాయని, అధ్వాన్నంగా ఉన్న శాంతిభద్రతల పరిస్థితులను వెల్లడి చేస్తుందని ఆయన ట్విట్టర్ లో పేర్కొన్నారు.
నార్త్ 24 పార్గనాస్ వద్ద ఉన్న ఎంపీ అర్జున్ సింగ్ ఇంటి వద్ద ప్రస్తుతం భద్రతా దళాలను మోహరించారు. జగత్దల్ వద్ద ఉన్న ఇంటి ముందు బాంబు దాడి జరిగింది. కోల్‌కతాకు వంద కిలోమీటర్ల దూరంలో జగత్దల్ ఉంది. బైక్‌పై వచ్చిన ముగ్గురు వ్యక్తులు బాంబులు విసిరినట్లు తెలుస్తోంది.
ఎంపీ ఇంటి ముందు బాంబు పేలుళ్ల ఘటనకు పాల్పడింది తృణమూల్ కాంగ్రెస్ అని బీజేపీ ఆరోపిస్తున్నది. ఈ విషయంలో ఎన్ఐఏ దర్యాప్తు జరపాలని డార్జిలింగ్ ఎంపీ రాజు బిస్టా డిమాండ్ చేశారు. “పశ్చిమ బెంగాల్‌లో, టిఎంసి గూండాలు నిర్వహించిన ఉగ్రవాద చర్యలపై పోలీసులు కన్నుమూయవలసి వచ్చింది. ఎంపీ @అర్జున్సింగ్ డబ్ల్యూబి జీ నివాసంపై జరిగిన ఈ దారుణమైన దాడి ఈ ఉగ్రవాదుల బ్రేజన్ అని చూపిస్తుంది. ఈ బాంబు దాడిపై @NIA_India దర్యాప్తును అభ్యర్ధిస్తున్నాను'”అంటూ ట్వీట్ చేశారు.
More Stories
కర్ణాటకలో ముస్లిం కాంట్రాక్టర్లకు 4 శాతం కోటా
తమిళనాడులో రూ.1000 కోట్ల లిక్కర్ స్కామ్!
పోక్సో కేసులో మాజీ సిఎం యడియూరప్పకు ఊరట