పడవల ద్వారా 15 మంది తీవ్రవాదులు చొరబడినట్లు కేంద్ర ఇంటెలిజెన్స్ విభాగం అనుమానం వ్యక్తం చేసిన నేపథ్యంలో తమిళనాడులో రాష్ట్రవ్యాప్తంగా తీరంలో నిఘా తీవ్రతరం చేశారు. ఏమాత్రం సందేహం వచ్చినా అనుమానితుల్ని అదుపులోకి విచారిస్తున్నారు.
తీవ్రవాదుల గురించి రాష్ట్రంతో పాటు కేరళ, కర్నాటకలను కూడా కేంద్రం హెచ్చరించింది. దీంతో రాష్ట్రంలోని కన్నియాకుమారి, తిరునల్వేలి, తూత్తు కుడి, రామనాథపురం తదితర సముద్రతీర ప్రాంతాల్లో స్థానిక పోలీసులు, క్యూబ్రాంచ్ పోలీసులు తీవ్ర నిఘా ఏర్పాటు చేశారు.
రాజధాని నగరం చెన్నైలోనూ పోలీసులు గస్తీ ముమ్మరం చేశారు. నగరంలోని రెసిడెన్షియల్ ప్లాట్లలో ఎవరైనా అనుమానాస్పదంగా సంచరిస్తే తమకు సమాచార మివ్వాలని ప్లాట్ల యజమానులకు, నిర్వాహకులకు పోలీసు అధికారులు విజ్ఞప్తి చేశారు.
బుధవారం సాయంత్రం పూందమల్లిలోని రెసిడెన్షియల్ ప్లాట్ వద్ద అనుమా నాస్పదంగా సంచరిస్తున్న ఇద్దరిని క్యూబ్రాంచ్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. రాష్ట్రంలోని సముద్రతీర ప్రాంతాల్లోని జాలర్ల కుప్పాల్లో పోలీసులు విచారణ జరుపుతున్నారు.
ఎవరైనా కొత్త వ్యక్తులు పడవల్లో వస్తే వెంటనే తమకు ఫిర్యాదు చేయాలని సముద్రతీర భద్రతాదళం పోలీసులు హెచ్చరించారు. ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని జాలర్లను ఆదేశించారు. కన్నియా కుమారి, కుళచ్చల్, కేరళ సరిహద్దుల్లోని తీర ప్రాంతాల్లో ప్రస్తుతం సముద్రతీర భద్రతాదళానికి చెందిన పోలీసులు, కోస్ట్‌గార్డ్ సిబ్బంది, మినీ నౌకలో గస్తీ తిరుగుతున్నారు.
కన్నియాకుమారి జిల్లా నుంచి కేరళ తీర ప్రాంతాలైన మునప్పం, అళికోడ్డు ప్రాంతాలకు చేపలవేటకు వెళ్తున్న జాలర్లను కూడా పోలీసులు విచారిస్తున్ననరు. కన్నియాకుమారి తీరం పొడవునా గస్తీ తీవ్రతరం చేసినట్లు అధికారులు తెలిపారు.
More Stories
బయటపడిన మావోయిస్టుల భారీ ఆయుధాల డంప్
99.1 కోట్లకు చేరిన భారత ఓటర్ల సంఖ్య
మహారాష్ట్రలో పుష్పక్ ఎక్స్ ప్రెస్ ప్రమాదంలో 12 మంది మృతి