చైనానేప్రధాన భాగస్వామ్యపక్ష దేశం … తాలిబన్లు స్పష్టం 

చైనానే తమ ప్రధాన భాగస్వామ్యపక్ష దేశం అని తాలిబన్లు స్పష్టం చేశారు. దెబ్బతిని ఉన్న అఫ్ఘనిస్థాన్ పునర్ని ర్మాణానికి తాము చైనా సాయం కోసం ఎదురుచూస్తు న్నామని తాలిబన్లు తెలిపారు. దేశంలోని సుసంపన్నమైన తగరపు నిక్షేపాలను వెలికితీయడం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థను నిలబెట్టుకోవచ్చునని తాలిబన్లు భావిస్తున్నారు.

చైనా ఇందుకు సిద్ధంగా ఉందని తమకు నమ్మకం కుదిరినట్లు తాలిబన్ల అధికార ప్రతినిధి జబిహుల్లా ము జాహిద్ ప్రకటించారు. తాలిబన్ల సర్కారుకు అటు పాకిస్థాన్ నుంచి ఇటు చైనా నుంచి అందే సాయం పలు విధాలుగా ఇబ్బందికర పరిణామాన్ని సృష్టిసుందని భారతదేశం భావిస్తోంది.

చైనా అత్యంత వ్యూహాత్మకంగా అఫ్ఘనిస్థాన్‌కు చెందిన భౌగోళిక, భూగర్భ వనరులను తనకు అనుకూలంగా వినియోగించుకోవడం ద్వారా తాను తలపెట్టిన పలు ఆర్థిక వాణిజ్య కార్యకలాపాలను విస్తృతం చేసుకుంటుంది. చైనాతో భాగస్వామ్యం తమకు ప్రాథమికంగా, అసాధారణ రీతిలో కలిసి వచ్చే సదవకాశం అవుతుందని తాలిబన్లు భావిస్తున్నారు.

దేశంలో పెట్టుబడులకు చైనా సిద్ధమైంది. ఇదే క్రమంలో అఫ్ఘన్ పునర్నిర్మాణానికి కూడా సాయం చేస్తుంది. ఇంతకంటే కావల్సింది ఏముందని తాలిబన్ల ప్రతినిధి ఇటలీ పత్రిక కు ఇచ్చిన ఇంటర్వూలో చెప్పినట్లు జియో న్యూస్ తెలిపింది. ఇక్కడి వనరులను నిర్వహించడం, ఆధునీకరించ డంతో ఆగకుండా ప్రపంచవ్యాప్తంగా మార్కెటింగ్‌కు కూడా చైనా దారులు వేస్తుందని ఇంతకంటే గొప్ప విషయం ఏముంటుందని తాలిబన్ల ప్రతినిధి చెప్పారు. 

కాగా, తమ దేశం ఏ దశలోనూ అఫ్ఘన్ అంతర్గత వ్యవహారాలలో జోక్యం చేసుకోబోదని, ఆ దేశ సర్వసత్తాకతను మన్ని స్తుందని, యావత్తూ అఫ్ఘనీలతో స్నేహాన్ని కొనసాగిస్తుందని ఇటీవలే చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి వాంగ్ వెన్‌బిన్ తెలిపారు. అయితే ఆ దేశంలో ఆర్థిక పరిస్థితి గమనిస్తే అక్కడ సరైన సమ్మిశ్రిత, సకల ప్రాతిని ధ్యపు రాజకీయ నిర్మాణ వ్యవస్థ అవసరం అని పేర్కొన్నారు. 

సమకాలీన విదేశీ, స్వదేశీ విధానాలను అనుసరించి తీరాలని, ఉగ్రవాద శక్తులతో ఎటువంటి సంబంధాలు ఉన్నా వాటిని తెంచుకుని తీరాలని చైనా అధికారికంగా స్పష్టం చేసింది. పైగా, రష్యాతో కూడా సత్సంబంధాలను పెంచుకోవాలని తాలిబన్లు నిర్ణయానికి వచ్చినట్లు ముజాహిద్ తెలిపారు. రష్యాను తాము ప్రధాన స్నేహపక్షంగా పరిగణిస్తామ ని స్పష్టం చేశారు.