మ‌నీశ్ న‌ర్వాల్‌కు స్వర్ణం.. సింగ‌రాజ్‌కు రెండ‌వ మెడ‌ల్‌

పారాలింపిక్స్‌లో భారత్ కు మరో స్వర్ణ పతాకం లభించింది.  టోక్యోలో శనివారం జరిగిన పురుషుల పి 4 మిక్స్‌డ్ 50 మీటర్ల పిస్టల్ ఎస్ హెచ్ 1 పోటీల్లో మనీష్ నర్వాల్ బంగారు పతకం, సింఘరాజ్ అదానా రజతపతకం సాధించారు. దీంతో టోక్యో పారా ఒలింపిక్స్ లో భారత క్రీడాకారులు పతకాల పంట పండిస్తున్నారు.ఇప్పటివరకు భారత్ కు పారా ఒలింపిక్స్ లో 15 పతకాలు వచ్చాయి. మూడు స్వర్ణం,  7 కాంస్యం, 5 రజతం గెల్చుకున్నారు. 

19 ఏళ్ల షూటర్ మనీష్ పారా ఒలింపిక్ రికార్డు సృష్టించాడు. మనీష్ బంగారు పతకం కైవసం చేసుకోవడానికి 218.2 పాయింట్లు సాధించాడు. పీ4 మిక్స్‌డ్ 50మీట‌ర్ల పిస్తోల్ ఈవెంట్‌లో మ‌నీశ్ అద్భుత ప్ర‌ద‌ర్శ‌న ఇచ్చాడు. టాప్‌లో నిలిచిన అత‌ను స్వ‌ర్ణ ప‌త‌కాన్ని కైవ‌సం చేసుకున్నాడు.

ఇక ఇదే ఈవెంట్‌లో సింఘ‌రాజ్‌కు సిల్వ‌ర్ మెడ‌ల్ ద‌క్క‌డం విశేషం. సింఘరాజ్ 216.7 పాయింట్లతో టోక్యో పారా ఒలింపిక్స్‌లో తన రెండవ పతకాన్ని సాధించాడు. సింఘరాజ్ అధనా ఫైనల్‌లో మొదటి 10 షాట్ల తర్వాత 92.1 పాయింట్లను సంపాదించాడు.  మ‌హిళ‌ల షూటింగ్ ఈవెంట్‌లో అవ‌ని రెండు మెడ‌ల్స్ సాధించిన విష‌యం తెలిసిందే.

50మీ పిస్తోల్ ఎస్‌హెచ్‌1 ఫైన‌ల్లో షూట‌ర్ మ‌నీశ్‌.. 218.2 పాయింట్లు స్కోర్ చేశాడు. దీంతో అత‌ను పారాలింపిక్స్ చ‌రిత్ర‌లో కొత్త రికార్డు క్రియేట్ చేశాడు. ఈ స్కోర్ పారాలింపిక్స్‌లో రికార్డుగా నిలిచింది. అంతేకాదు.. వ‌ర‌ల్డ్ ప్రపంచ కూడా మ‌నీశ్ ఖాతాలోనే ఉన్న‌ది. 

షూటింగ్‌లో బంగారు ప‌త‌కం గెలిచిన షూట‌ర్ మ‌నీశ్ న‌ర్వాల్‌పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురుస్తోంది. మ‌నీశ్ సూప‌ర్ విక్ట‌రీ కొట్టారంటూ కేంద్ర క్రీడాశాక మంత్రి అనురాగ్ ఠాకూర్ త‌న ట్విట్ట‌ర్‌లో తెలిపారు. ఇదే క్యాట‌గిరీలో వ‌ర‌ల్డ్ రికార్డును నెల‌కొల్పినందుకు షూట‌ర్‌కు మంత్రి కంగ్రాట్స్ తెలిపారు.

పారాలింపిక్స్‌లో ప‌త‌కాలు గెలిచిన షూట‌ర్ల‌కు హ‌ర్యానా రాష్ట్ర ప్ర‌భుత్వం భారీ న‌జ‌రానా ప్ర‌క‌టించింది. స్వర్ణ పతాకం పొందిన  షూట‌ర్ మ‌నీశ్ న‌ర్వాల్ కు రూ 6  కోట్లు ఇవ్వ‌నున్న‌ట్లు ఇవాళ హ‌ర్యానా ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. ఇదే ఈవెంట్‌లో సిల్వ‌ర్ మెడ‌ల్ గెలిచిన మ‌రో షూట‌ర్ సింగ‌రాజ్ అధానాకు నాలుగు కోట్ల రివార్డును ఇవ్వ‌నున్న‌ట్లు వెల్ల‌డించింది. ప‌త‌కాలు గెలిచిన ఈ ఇద్ద‌రికీ ప్ర‌భుత్వ ఉద్యోగాలు కూడా ఇవ్వ‌నున్న‌ట్లు హ‌ర్యానా స‌ర్కార్ చెప్పింది.

కాగా, పారాలింపిక్స్‌లో భారత్‌కు మరో పతకం ఖాయమయింది. షెట్లర్‌ ప్రమోద్‌ భగత్‌ బ్యాడ్మింటన్‌ మెన్స్‌ ఫైనల్స్‌కు దూసుకెళ్లాడు. జపాన్‌ ప్లేయర్‌ ఫుజిహరాతో జరిగిన ఎస్‌ఎల్‌ 3 విభాగం సెమీఫైనల్‌లో 21-11, 21-16 తేడాతో ప్రమోద్‌ విజయం సాధించాడు. దీంతో ఫైనల్‌లో గెలిచినా, ఓడినా ప్రమోద్‌కు పతకం లభించనుంది.