శంషాబాద్ నుంచి గొల్లపల్లి వరకు రైల్వే విద్యుదీకరణ

శంషాబాద్ రైల్వే స్టేషన్  (ఉందానగర్) నుంచి మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల సమీపంలోని గొల్లపల్లి రైల్వే స్టేషన్ వరకు 60 కిలోమీటర్ల విద్యుదీకరణ పూర్తయింది. హైదరాబాద్ నుంచి దక్షిణాది రాష్ట్రాల గేట్ వేగా ఉన్న ఈ బెంగళూరు మార్గంలో డబ్లింగ్ పనులు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం వరకు కొనసాగుతున్నాయి. 
 
కర్నూలు, కడప, తిరుపతి, చెన్నై, అనంతపురం, బెంగళూరు తదితర ప్రాంతాలకు వెళ్లే ఈ మార్గంలో ఈ డబుల్ లైన్, విద్యుదీకరణ వల్ల రైళ్ల రాకపోకల్లో వేగం పెరిగే అవకాశం ఉంది.
2015-16 ఆర్ధిక సంవత్సరంలో హైదరాబాద్ నుంచి మహబూబ్ నగర్ వరకు రైల్వే లైన్ డబ్లింగ్, విద్యుదీకరణ ప్రాజెక్టు మంజూరైంది. 
 
ఇప్పటి వరకు గొల్లపల్లి వరకు పూర్తికాగా, మిగిలిన మహబూబ్ నగర్ వరకు  ళిక సదుపాయాల కల్పన, సామర్థ్యం పెంపు, విద్యుదీకరణ పనులు కొనసాగుతున్నాయి. దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలోని నెట్ వర్క్ లలో సికింద్రాబాద్ నుంచి మహబూబ్ నగర్ వరకు చేపట్టాలని నిర్ణయించారు. 
 
అయితే ఫలక్ నుమా నుంచి ఉందానగర్ మధ్య ఎంఎంటీఎస్ రెండో దశ కింద చేపట్టగా.. మిగిలిన రైల్వే లైన్ పనులు రైల్ వికాస్ నగమ్ లిమిటెడ్ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి.