బాలీవుడ్ దివంగత నటుడు సుశాంత్ సింగ్ మృతితో సినీ పరిశ్రమలో డ్రగ్ వ్యవహరం కలకలం సృష్టించింది. శాండల్‌వుడ్‌లో సంజన గల్రానీ, రాగిణీ ద్వివేది పేర్లు వెలుగులోకి వచ్చాయి. వీరికి డ్రగ్ ప్లెడర్లతో సంబంధాలు ఉన్నాయని, తరచూ డ్రగ్ తీసుకున్నట్లు ఆరోపణలు రావడంతో సీసీబీ పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు.
ఈ నేపథ్యంలో వారి తలవెంట్రులను సేకరించి సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబరేటరీ (సీఎఫ్‌ఎస్‌ఎల్) సాంపుల్స్ ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా వీరిద్దరూ డ్రగ్స్ సేవించినట్లు ఈ నివేదికలు స్పష్టం చేశాయి. ఈ రిపోర్టులో వారు డ్రగ్స్ తీసుకున్నట్లు వెల్లడవ్వడంతో బెంగళూరు పోలీసులు మరోసారి రాగిణి, సంజనలకు సమన్లు జారీ చేయనున్నట్లు తెలుస్తోంది.
2020 అక్టోబర్‌లో వీరిద్దరి వెంట్రకల నమూనాలను సేకరించిన బెంగళూరు పోలీసులు ఎఫ్ఎస్‌ఎల్‌కు పంపించారు.సంజనా, రాగిణిలు ఇటీవల బెయిలుపై బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. జైలు నుంచి బయటకు రాగానే సంజన తన స్నేహితుడైన డాక్టర్‌ను పెళ్లి చేసుకుని వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది.
సంజనా ప్రభాస్ బుజ్జీగాడు మూవీతో పాటు పలు సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. రాగిణి కన్నడలో స్టార్‌నటిగా గుర్తింపు పొందింది.
More Stories
జమిలీ ఎన్నికలపై 31న జేపీసీ రెండో సమావేశం
బిజెపి ఎంపీలపై క్రిమినల్ కేసు కొట్టివేత
8 రోజుల్లో 9 కోట్ల మంది పుణ్యస్నానాలు