వాట్సాప్‌లోనూ కొవిడ్ టీకా స్లాట్

వ్యాక్సిన్ బుకింగ్‌ను కేంద్ర ప్రభుత్వం మరింత సులభతరం చేసింది. వాట్సాప్ ద్వారా కూడా టీకా బుకింగ్ స్లాట్ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఈ మేరకు కేంద్ర మంత్రి మన్సుక్ మాండవీయ ఆ వివరాలను ట్విటర్‌లో వెల్లడించారు. 

స్మార్ట్‌ఫోన్ ఉన్న ప్రతీ ఒక్కరు వాట్సాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. వాట్సాప్ ద్వారా కరోనా హెల్ప్ డెస్క్‌ని ఈ ఏడాది మార్చిలో కేంద్రం అందుబాటులోకి తెచ్చింది. ఈ నెల ప్రారంభం నుంచి వ్యాక్సిన్ సర్టిఫికేట్ డౌన్‌లోడ్‌కి అవకాశం కల్పించింది. 

ఇప్పటికే ఈ హెల్ప్‌డెస్క్ నుంచి 31 లక్షల మంది వ్యాక్సిన్ సర్టిఫికేట్లు డౌన్‌లోడ్ చేసుకున్నారు. ఇతర ఆప్షన్ల కంటే వాట్సాప్ ద్వారా ఎక్కువ మంది అత్యంత వేగంగా వ్యాక్సిన్ సర్టిఫికేట్టు డౌన్‌లోడ్ చేసుకున్నట్టు కేంద్రం గుర్తించింది. దీంతో వాట్సాప్ ద్వారా వ్యాక్సిన్ స్లాట్ బుకింగ్‌కి అవకాశం కల్పించింది.

ఇలా చేయాలి…

మీ మొబైల్ నంబరులో 9013151515 నంబరు సేవ్ చేసుకోవాలి. ఇదే నంబరుకు బుక్ స్లాట్ అని ఇంగ్లిష్‌లో టైప్ చేసి మెసేజ్ పంపాలి.

* ఆరు అంకెల ఓటీపీ నంబరు మీ మొబైల్‌కి వస్తుంది. మూడు నిమిషాల్లోగా ఓటీపీ నంబర్ ఎంటర్ చేయాలి

* ఆ నంబరు ఆధారంగా ప్రభుత్వం దగ్గర ఉన్న వివరాలను బట్టి మనకు వివిధ ఆప్షన్లు వస్తాయి. అందులో మొదటి డోసు ఎప్పుడు ఇచ్చారు, రెండో డోసు ఎప్పుడు తీసుకోవాలి అనే విషయాలు ఉంటాయి.

* హెల్ప్ డెస్క్ మెనూలో కుటుంబ సభ్యుల్లో ఎవరి పైరునైనా చేర్చాలా , దగ్గరలో ఉన్న వ్యాక్సిన్ సెంటర్ వివరాలు ఇలా వివిధ ఆప్షన్లకు 1, 2 ,3 ఇలా 8 వరకు నంబర్లు కేటాయించారు. మన అవసరానికి తగ్గట్టు నంబరును సమాధానంగా ఇస్తే దానికి తగ్గట్టుగా ఆప్షన్లు వస్తాయి.

* ఈ హెల్ప్‌లైన్ డెస్క్ ద్వారా వ్యాక్సిన్ స్లాట్ బుక్ చేసుకోవడంతో పాటు కరోనాకు సంబంధించి ఇతర సమాచారాన్ని కూడా తెలుసుకునే వీలుంది.

స్మార్ట్‌ఫోన్‌ ఉన్న ప్రతీ ఒక్కరి ఫోన్‌లో వాట్సాప్‌ కామన్‌గా మారింది. ఎంట్రీ లెవల్‌ ఫోన్లలోనూ వాట్సాప్‌ ఉంటోంది. అంతేకాదు గ్రామీణ ప్రాంతాల ప్రజలు సైతం వాట్సాప్‌ను వినియోగడంలో పట్టు పెంచుకున్నారు. దీంతో వాట్సాప్‌  ద్వారా వాక్సిన్‌ స్లాట్‌ బుకింగ్‌కు కేంద్రం అవకాశం కల్పించింది.

వాట్సాప్‌ ద్వారా కరోనా హెల్ప్‌ డెస్క్‌ని ఈ ఏడాది మార్చిలో కేంద్రం అందుబాటులోకి తెచ్చింది. ఈ నెల ప్రారంభం నుంచి వ్యాక్సిన్‌ సర్టిఫికేట్‌ డౌన్‌లోడ్‌కి అవకాశం కల్పించింది. ఇప్పటికే ఈ హెల్ప్‌డెస్క్‌ నుంచి 31 లక్షల మంది వ్యాక్సిన్‌ సర్టిఫికేట్లు డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. ఇతర ఆప్షన్ల కంటే వాట్సాప్‌ ద్వారా ఎక్కువ మంది అత్యంత వేగంగా వ్యాక్సిన్‌ సర్టిఫికేట్టు డౌన్‌లోడ్‌ చేసుకున్నట్టు కేంద్రం గుర్తించింది. దీంతో వాట్సాప్‌ ద్వారా వ్యాక్సిన్‌ స్లాట్‌ బుకింగ్‌కి అవకాశం కల్పించింది.