కృష్ణాబోర్డు బృందం వెంట ఏపీ అధికారులు…. తెలంగాణ అభ్యంతరం

కృష్ణ నదీ యాజామాన్య బోర్డు బృందం రాయలసీమ ఎత్తిపోతల పథకం పనుల పరిశీలన సమయంలో ఎపికి చెందిన అధికారులు ఉండటం పట్ల తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరాలు తెలిపింది. ఎపి అధికారులతో కలిసిన బోర్డు సభ్యుల బృందం ఇచ్చే నివేదిక పట్ల ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. 

తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి రజత్ కుమార్ కృష్ణ రివర్ బోర్డు చైర్మన్‌కు లేఖ రాశారు. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా నేషనల్ గ్రీన్ ట్రిభ్యునల్ ఇచ్చిన ఆదేశాల తర్వాత చాల ఆలస్యంగా బోర్డు బృందం రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులను పరిశీలించిందని లేఖలో పేర్కొన్నారు.

తాము ఫిర్యాదుదారులమైనందుకు తమ ప్రతినిధులను కూడా బోర్డు బృందం వెంట తీసుకెళ్లాలని బోర్డు ఛైర్మన్‌ను కోరామని,అయితే తటస్థులు మాత్రమే వెళ్లాలన్న కేంద్ర ప్రభుత్వం ఆదేశాలకు అనుగుణంగా ఛైర్మన్ తమ ప్రతిపాదనను అంగీకరించలేదని రజత్ కుమార్ లేఖలో గుర్తుచేశారు.

ఈ నెల 11న రాయలసీమ ఎత్తిపోతల పథకం పనుల పరిశీలన సమయంలో కృష్ణ బోర్డు బృందంతోపాటు ఎపికి చెందిన నీటిపారుదల శాఖ ఈఎన్సీ నారాయణరెడ్డి, మరికొందరు సిఈలు ఉన్నారని తెలిపారు. వీరు బోర్డు బృందం సభ్యులతో మాట్లాడటమే కాకుండా నీటి పథకాలకు సంబంధించి పవర్‌పాయిట్ ప్రజెంటేషన్లు కూడా ఇచ్చారని లేఖలో తెలిపారు. 

ఈ పరిస్థితుల్లో కృష్ణ రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు సభ్యులు రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులపై ఇచ్చే నిదేదిక నిష్పాక్షితకపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయని లేఖలో పేర్కొన్నారు. మారోవైపు రెండు రోజలు పాటు రాయలసీమ ఎత్తిపోతల పథకం పను లు పరిశీలనకు వెళ్లిన కృష్ణ బోర్డు సభ్యుల బృందం ఒక్కరోజుతోనే తన పర్యటనను అర్ధాంతరరంగా ముగించుకుంది.

 కృష్ణానదీ జలాలను అక్రమంగా రాయలసీమ సాగునీటిపథకాలకు ఎపి తరలిస్తోందని ఈ చర్యల ను వెంటనే అడ్డుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రభు త్వం కృష్ణారివర్ మేనేజ్‌మెంట్ బోర్డును కోరింది.వ్కృ ష్ణానదీజలాలనుంచి ఏ విధమైన నీటి వాటాలు లేని హంద్రీనీవా సుజల స్రవంతి పథకానికి శ్రీశైలం జలాశ యం నుంచి నీటి ఎత్తిపోతలను వెంటనే నిలిపివేయాలని స్పష్టం చేసింది.

తుంగభద్ర నదీజలాలనుంచి సుకేంసుల బ్యారేజ్ ద్వారా కర్నూలుకడప కాలువకు 39.90 టిఎంసిల నీటి కేటాయింపులు ఉండగా, గత కొన్ని దశాబ్ధాలుగా ప్రతి ఏటా 54టిఎంసిల కు పైగానే తుంగభద్ర జలాలను తరలిస్తున్నారని ఈ సందర్భంగా వ్రాసిన లేఖలో పేర్కొన్నారు.