ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న జమాత్ ఇస్లామీ

వేర్పాటువాద కార్యకలాపాలను ప్రోత్సహించినందుకు జమాత్ ఇస్లామీపై నమోదైన కేసులో జమ్మూ కాశ్మీర్‌లోని 14 జిల్లాల్లోని 56 ప్రాంగణాలలో దాడులు నిర్వహించినట్లు ఎన్ఐఎ తెలిపింది. సోదాల సందర్భంగా నిందితుల ప్రాంగణంలోని కీలకమైన పత్రాలను, ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎన్ఐఏ తెలిపింది.

“జమ్మూ కాశ్మీర్ పోలీసులు, సి ఆర్ పి ఎఫ్ తో పాటు ఎన్ఐఎస్  జమ్మూ, కాశ్మీర్ లోని శ్రీనగర్, బుద్గాం, గందర్‌బల్, బారాముల్లా, కుప్వారా, బండిపోరా, అనంతనాగ్, షోపియాన్, పుల్వామా, కుల్గాం, రాంబన్, దోడా, కిష్త్వార్,  రాజౌరి జిల్లాలలో 56 ప్రాంతాల్లో ఆదివారం  సోదాలు నిర్వహించారు. 

కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు యుఎ(పి) చట్టం కింద వేర్పాటువాద కార్యకలాపాలకు సంబంధించి చట్టవిరుద్ధమైన కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు జమాత్ ఇస్లామీపై  ఫిబ్రవరి 5, 2021 న తాము కేసు నమోదు చేసిన్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సంస్థను ప్రభుత్వం ఫిబ్రవరి 29, 2019న నిషేధించింది.

“సంస్థ సభ్యులు దేశీయంగా, విదేశాలలో  ప్రత్యేకంగా జకాత్, మౌదా, బైత్-ఉల్-మాల్ రూపంలో విరాళాల ద్వారా నిధులను సేకరిస్తున్నారు. వీరు సేకరించిన నిధులను హిజ్బ్-ఉల్-ముజాహిదీన్ (హెచ్‌ఎమ్), లష్కరే-తైబా (ఎల్‌ఇటి) వంటి నిషేధిత ఉగ్రవాద సంస్థలకు, ఇతర సంస్థల ద్వారా కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ఆ విధంగా విఘాతకర, వేర్పాటువాద కార్యకలాపాలలో పాల్గొనేటట్లు జమాత్ ఇస్లామీ జమ్మూ, కాశ్మీర్ లో యువతను ప్రేరేపిస్తూ, కొత్తగా సభ్యులను చేరేటట్లు చేస్తున్నది” అని ఈ పత్రాల ద్వారా ఎన్ఐఎ స్పష్టమైన ఆధారాలు సేకరించింది.

ఆదివారం నిర్వహించిన సోదాలలో ఈ నిధిషేత సంస్థ ఆఫీస్ బేరర్లు, సభ్యులు, నిర్వహిస్తున్న  ట్రస్టుల కార్యాలయాలు కూడా ఉన్నాయి.