
బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర అన్ని నియోజకవర్గాల్లో 250 రోజులకు జరపడానికి అన్ని సన్నాహాలు చేస్తున్నారు. పాదయాత్ర నిర్వహణ కోసం 30 విభాగాలు ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రదీప్ కుమార్ తెలిపారు. ఈ నెల 24న బండి సంజయ్ ఆధ్వర్యంలో పాతబస్తీ భాగ్యలక్ష్మీ ఆలయం నుంచి పాదయాత్ర ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.
పాదయాత్ర నిర్వహణ కోసం ఇంఛార్జిగా గంగిడి మనోహర్‌రెడ్డిని, సహ ఇంఛార్జీలుగా తూళ్ల వీరేందర్‌గౌడ్, లంకల దీపక్ రెడ్డి, శంకర్‌ను నియమించారు. 2023లో రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి తీసుకు రావడమే లక్ష్యంగా పాదయాత్రకు సన్నాహాలు చేస్తున్నారు. పాదయాత్ర ద్వారా ప్రజల సమస్యలు, సలహాలు తీసుకుఒని 2023 మేనిఫెస్టో రూపకల్పన చేస్తామని చెబుతున్నారు.
యువత, మహిళలు, వృద్ధులు, రైతులను సమీకరించడం పట్ల దృష్టి సారిస్తున్నారు. మొదటగా ఆగస్టు 9 నుంచి బండి సంజయ్ పాదయాత్ర నిర్వహించాలనుకున్నారు.
ఆగస్టు 13 వరకు పార్లమెంట్ సమవేశాలు ఉండటం, కీలకమైన బిల్లులు సభ ముందుకు రానున్న దృష్టా పాదయాత్రను వాయిదా వేశారు. పాదయాత్ర ప్రారంభం నాడు కీలక జాతీయ నేత లేదా ముఖ్యమైన కేంద్ర మంత్రిని ఆహ్వానించాలని నిర్ణయించారు.
More Stories
బిజెపిపై విషం కక్కడమే వారి అజెండా!
యూట్యూబర్ సన్నీ యాదవ్ కు పోలీసులు లుక్ఔట్ నోలీసులు
బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసిన హైదరాబాద్ మెట్రో!