ఆఫ్గానిస్తాన్‌లో తాలిబన్లు లక్ష్యంగా చేసుకుని అమెరికా వైమానిక దాడులు జరపడంతో 200 మందికి పైగా తాలిబన్లు మృతి చెందారు. ఈ విషయాన్ని ఆఫ్గాన్ రక్షణ శాఖ ప్రతినిధి ట్వీట్ చేశారు. కొన్ని రోజులుగా ఆప్గనిస్తాన్ అట్టుడుకుతోంది. తాలిబన్లు, ప్రభుత్వ దళాల మధ్య అక్కడ యుద్ధ వాతావరణం నెలకొంది. అమెరికా నాటో దళాలను వెనక్కు ఉపసంహరించుకున్న నాటి నుండి తాలిబన్లు పెట్రేగిపోతున్నారు. ఊళ్లకు ఊళ్లను బలవంతంగా తమ నిర్బంధంలోకి తీసుకుంటున్నారు. ప్రాంతాలను తమ చేతుల్లోకి బలవంతంగా తీసుకుంటున్నారు.
ఇటువంటి సమయంలో షెబెర్గాన్ నగరంలో సమావేశం నిర్వహిస్తున్న తాలిబన్లపై అమెరికా వైమానిక దళం వైమానిక దాడులు జరపడంతో భారీ ప్రాణ నష్టం కలిగింది. వైమానిక దాడుల్లో సుమారు 200 మందికి పైగా తాలిబన్లు చనిపోయారని రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఫవాద్ అమన్ ట్వీట్ చేశారు.
జవ్జాన్ ప్రావిన్స్‌లోని షెబెర్గాన్ నగరంలో తాలిబన్లు సమావేశం నిర్వహిస్తున్నారన్న సమాచారంతో శనివారం రాత్రి వైమానిక దాడులు చేశామని, దీంతో ప్రాణ నష్టంతో పాటు వారి ఆయుధాలు, మందుగుండు సామాగ్రి, ఇతర వాహనాలు ధ్వంసమయ్యాయని చెప్పారు. ఇటీవల జవ్జాన్ ప్రావిన్స్ రాజధానిని తాలిబన్లు తమ చేతుల్లోకి తీసుకున్నారు.
“ఈ రోజు సాయంత్రం వైమానిక దళం తాలిబన్ల సమావేశం, దాగి ఉన్న ప్రదేశాలను లక్ష్యంగా చేసుకుని జరిపిన దాడులలో షెబెర్గాన్ నగరంలో 200 మందికి పైగా తీవ్రవాదులు మరణించారు. వైమానిక దాడుల ఫలితంగా వారి ఆయుధాలు, మందుగుండు సామగ్రి, వారి వాహనాలు 100 కి పైగా ధ్వంసమయ్యాయి” అని ఆఫ్ఘన్ రక్షణ మంత్రిత్వ అధికారి ఫవాద్ అమన్ ట్వీట్ చేశారు.
శనివారం సాయంత్రం 6:30 గంటలకు జవ్జాన్ ప్రావిన్స్‌లోని షెబెర్గాన్ నగరంలో బి-52 బాంబర్ ద్వారా తాలిబాన్ సమావేశాన్ని లక్ష్యంగా చేసుకున్నారు. ” సాయంత్రం 6:30 గంటలకు జవ్జాన్ ప్రావిన్స్‌లోని షెబెర్గాన్ నగరంలో బి-52 ద్వారా తాలిబాన్ల సమావేశాన్ని లక్ష్యంగా చేసుకున్నారు. అమెరికా వైమానిక దళాల వైమానిక దాడి ఫలితంగా తీవ్రవాదులు భారీగా నష్టపోయారు” అని ఆ ట్వీట్ లో వివరించారు.
అంతకుముందు, పాకిస్థాన్ జాతీయ ఉగ్రవాదిని గజ్ని ప్రావిన్షియల్ సెంటర్ శివార్లలో ఆఫ్ఘన్ కమాండో బలగాలు అరెస్టు చేశాయి. అతను తీవ్రవాద కార్యకలాపాలు, పౌరుల హత్యలలో పాల్గొన్నాడు. ప్రభుత్వ దళాలతో వారం రోజుల పాటు జరిగిన హింసాత్మక ఘర్షణల తర్వాత ఉత్తర ఆఫ్ఘనిస్తాన్‌లోని జవ్జాన్ ప్రావిన్స్ రాజధాని తాలిబాన్‌ల ఆధీనంలోకి వచ్చింది.
గత రెండు రోజుల్లో తాలిబాన్‌ల చేతిలో పడిన రెండో ప్రాంతీయ రాజధానిగా వ్యూహాత్మక నగరం షెబెర్‌ఘన్ ఉందని ఆఫ్ఘన్ వార్తా సంస్థ నివేదించింది.

More Stories
శుద్ధి చేసిన యురేనియం ఇరాన్‌లోనే ఉండాలి
ఇరాన్ యుద్ధంలో 42 సైనిక విమానాలు కోల్పోయిన అమెరికా
ఉద్యోగంతో పాటు అమెరికాలో చట్టబద్ధంగా ఉండేందుకు ముప్పు!