పొందూరు చేనేత సమస్యలపై సంబంధిత మంత్రితో చర్చిస్తా

పొందూరు చేనేత సమస్యలపై సంబంధిత మంత్రితో చర్చిస్తానని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ భరోసా ఇచ్చారు. పార్టీలకు అతీతంగా పొందూరు చేనేత అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. బ్యాంక్‌లు అర్హులైన చేనేత కార్మికులకు ఆర్థిక సహకారం అందించాలని ఆమె సూచించారు. 
 
శ్రీకాకుళంలో ఆమె జాతీయ చేనేత దినోత్సవంలో పాల్గని  పొందూరు కేంద్రంగా పని చేస్తున్న ఆంధ్ర ఫైన్ ఖాదీ కార్మిక అభివృద్ధి సంఘం భవనాన్ని నిర్మలా సీతా రామన్ సందర్శించారు. ముందుగా చేనేత కార్యాలయం వద్ద నున్న గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం చేనేత కార్మికులతో కలసి వారి స్థితిగతులను మంత్రి  నిర్మలా తెలుసుకున్నారు.
రూ 30 లక్షలతో నిర్మాణం చేపట్టనున్న చేనేత కార్మికుల భవనానికి మంత్రి నిర్మలా సీతారామన్  శంకుస్థాపన చేశారు. అనంతరం మగ్గంపై నూలు వదులుతున్న నేత కార్మికుడిని స్వగృహానికి చేరుకుని కార్మికుడితో మాట్లాడారు. వ్యవసాయ మార్కెట్‌ కమిటీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కేంద్ర చేనేతకారుల దినోత్సవంలో పాల్గొంటూ ఖాదీకి ప్రధాని మోదీ అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారని చెప్పారు. గత పదేళ్లలో ఖాదీ ఉత్పత్తులు 18వేల కోట్లకు పెరిగాయని కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్ పేర్కొన్నారు.
కేంద్ర మంత్రితో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, స్పీకర్ తమ్మినేని సీతారాం, శ్రీకాకుళం, విజయనగరం ఎంపీలు కే రామ్మోహన్ నాయుడు, బెందాలం చంద్రశేఖర్, రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర ప్రసాద్ , జిల్లా కలెక్టర్ తదితరులు పాల్గొన్నారు. మూడు రోజుల ఉత్తరాంధ్ర పర్యటనను నేడు ప్రారంభించిన ఆమె తొలిరోజు శ్రీకాకుళం జిల్లాలో పలు కార్యక్రమాలలో పాల్గొన్నారు.
 
రేపు నిర్మలా సీతారామన్‌ విశాఖ జిల్లాలో పర్యటించి వ్యాక్సినేషన్‌ కేంద్రాన్ని సందర్శించనున్నారు. గోలుగొండ మండలం కఅష్ణదేవిపేటలోని అల్లూరి స్మఅతివనంను సందర్శించనున్నారు. తాళ్లపాలెంలో రేషన్‌ పంపిణీ విధానాన్ని పరిశీలించనున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఆర్ధిక మంత్రి రాజేంద్రనాథ్‌ రెడ్డి, ఆర్ధిక శాఖ అధికారులు హాజరుకానున్నారు.