రెజ్ల‌ర్ ర‌వికుమార్ ద‌హియా కు రజిత పతాకం

నేడు భారత్‌ ఖాతాలో రెండు పతకాలు వచ్చి చేరాయి. ఉదయం భారత పురుషుల హాకీ జట్టు దేశానికి కాంస్య పతకం అందించి చరిత్ర సృష్టించగా, అనూహ్యంగా ఫైనల్‌లోకి దూసుకెళ్లిన రెజ్లర్ రవికుమార్ దహియా దేశానికి రెండో రజత పతకాన్ని అందించాడు. 

ఒలింపిక్స్ రెజ్లింగ్‌లో భారత్ రెజ్ల‌ర్ ర‌వికుమార్ ద‌హియా రజిత  పతాకం సాధించాడు. గురువారం 57 కేజీల విభాగంలో జ‌రిగిన ఫైన‌ల్లో ర‌ష్య‌న్ ఒలింపిక్ క‌మిటీకి చెందిన రెజ్ల‌ర్ జవుర్ ఉగుయెవ్ చేతిలో ర‌వి 4-7 తేడాతో ఓడిపోయాడు. దీంతో ఒలింపిక్స్ రెజ్లింగ్‌లో రజిత  పతాకం గెలిచిన రెండో ఇండియ‌న్ రెజ్ల‌ర్‌గా అత‌డు నిలిచాడు. 

గ‌తంలో 2012 ఒలింపిక్స్‌లో సుశీల్‌కుమార్ రెజ్లింగ్‌లో  రజిత పతాకం  సాధించిన విష‌యం తెలిసిందే. ఏమాత్రం అంచ‌నాలు లేకుండా తొలిసారి ఒలింపిక్స్ బ‌రిలోకి దిగిన ర‌వి ద‌హియా ఏకంగా ఫైన‌ల్ చేరి ఆశ్చ‌ర్య ప‌రిచిన విష‌యం తెలిసిందే.  టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ కు ఇది ఐదో పతాకం కావడం విశేషం. వెయిట్‌లిఫ్టింగ్‌లో మీరాబాయి చాను రాజితం గెల‌వ‌గా.. బ్యాడ్మింట‌న్‌లో పీవీ సింధు, బాక్సింగ్‌లో లవ్లీనా బోర్గొహైన్‌, హాకీలో మెన్స్ టీమ్ రజిత పతాకాలు గెలిచిన విష‌యం తెలిసిందే.

ర‌ష్య‌న్ ఒలింపిక్ క‌మిటీకి చెందిన జ‌వుర్ ఉగుయెవ్ 57 కిలోల కేట‌గిరీలో డిఫెండింగ్ వ‌ర‌ల్డ్ చాంపియ‌న్‌. గ‌తేడాది డిసెంబ‌ర్‌లో బెల్‌గ్రేడ్‌లో జ‌రిగిన ప్రపంచ క‌ప్‌లో గెలిచాడు. తొలిసారి ఒలింపిక్స్ బ‌రిలో దిగాడు. గ‌త 15 టోర్న‌మెంట్‌ల‌లో అత‌డు 14 పథకాలు  గెలిచాడు. 

అందులో 12 స్వర్ణ పథకాలు ఉండ‌టం విశేషం. 2020 ప్రపంచ కప్‌లో ప్ర‌త్య‌ర్థుల‌పై 45-1 స్కోరుతో తిరుగులేని ఆధిప‌త్యం ప్ర‌దర్శించాడు. ర‌వి ద‌హియా ఇత‌నితో 2019 వ‌ర‌ల్డ్ రెజ్లింగ్ చాంపియ‌న్‌షిప్స్‌లో ఆడి ఓడిపోయాడు. ద‌హియాపై 6-4తో గెలిచాడు. ఆ టోర్నీలో ర‌వి రజిత  పతాకం గెలిచాడు.

ఒలింపిక్స్‌లో భారత్ తరపున పతకం గెలిచిన నాలుగో పురుష రెజ్లర్‌గా,  ఓవరాల్‌గో ఐదో రెజ్లర్‌గా రవికుమార్ రికార్డులకెక్కాడు. అంతేకాదు, ఒలింపిక్స్ రెజ్లింగ్‌లో భారత్‌కు వరుసగా ఇది నాలుగో పతకం. 1952లో భారత దిగ్గజ రెజ్లర్ కేడీ జాదవ్ కాంస్య పతకం అందుకోగా, సుశీల్ కుమార్ 2008లో కాంస్యం, 2012లో రజత పతకాలు సాధించాడు. లండన్ గేమ్స్‌లో యోగేశ్వర్ దత్ కాంస్య పతకం సాధించగా, 2016 రియో ఒలింపిక్స్‌లో సాక్షి మాలిక్ విజయం కాంస్య పతకం సాధించిన తొలి భారత మహిళగా రికార్డు సృష్టించింది.

టోక్యో ఒలింపిక్స్‌లో దేశానికి రెండో రజత పతకాన్ని అందించిన రెజ్లర్ రవికుమార్ దహియాపై కనకవర్షం కురుస్తోంది. హర్యానా ప్రభుత్వం ఆయనకు నాలుగు కోట్ల రూపాయల నగదు పారితోషికం  ఇవ్వనుంది. క్లాస్ వన్ కేటగిరిలో ఉద్యోగం ఇవ్వనున్నారు. అదే సమయంలో హర్యానాలో ఎక్కడ కోరుకుంటే అక్కడ 50 శాతం రాయితీతో భూమి ఇవ్వనున్నారు. 

ఆయన సొంత గ్రామం నహ్రీలో ప్రభుత్వం ఇండోర్ స్టేడియం కట్టనుంది. తమ గ్రామంలో రెండు గంటలే విద్యుత్ ఉంటుందని, నిరంతరం విద్యుత్  సరఫరా చేయాలని రవికుమార్ దహియా తండ్రి రెండ్రోజుల క్రితం కోరడం సంచలనం సృష్టించింది. ఏ మాత్రం సౌకర్యాలు లేని గ్రామం నుంచి వచ్చిన దహియా ఒలింపిక్స్‌లో రజతం సాధించడం ప్రేరణాదాయకంగా నిలిచింది.