ఏపీలో మాస్క్ ధరించకే పోతే రూ 100 జరిమానా 

ఏపీలో వరుసగా కరోనా కేసులు పెరుగుతూ ఉండడంతో మాస్క్ లేకుండా తిరిగే వారిపై కఠిన చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం సిద్దమయింది. కరోనా రోజురోజుకూ వ్యాప్తి చెందుతున్నా  చాలామంది ఇప్పటికీ మాస్కు లేకుండా తిరుగుతుండడంతో మాస్కు లేకుండా ఎవరైనా బయట తిరిగితే వారికి రూ.100 జరిమానా విధించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. 

ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ కమీషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. రోడ్డుపైకి ఎవరైనా మాస్కు లేకుండా వస్తే జరిమానా విధించాలని పోలీసులను ఆదేశించారు. ఇక షాపులు లేదా వ్యాపార సంస్థలు, కమర్షియల్‌ కాంప్లెక్సుల్లో 5 అడుగుల భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. 

అలాగే, షాపింగ్‌ మాల్స్, సినిమా హాళ్లు వంటి చోట సీటు మార్చి సీటు అంటే మధ్యలో సీటు ఖాళీగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి షాపులో, ఇతర చోట్లా శానిటైజర్‌ వేసుకున్న తర్వాతే వినియోగదారులను లోపలికి పంపించాలని ఆదేశించారు. థర్మల్‌ స్క్రీనింగ్‌ మెషీన్లను విధిగా వాడాలని పేర్కొన్నారు. 

మాస్క్ ధరించని వారిని లోపలికి అనుమతిస్తే రూ. 10 వేల నుండి రూ.25 వేల వరకు జరిమానా విధించేలా చర్యలు చేట్టాలని తెలిపారు. అంతేకాదు..2-3 రోజుల పాటు సంబంధిత సంస్థల్ని మూసివేసేలా చర్యలు తీసుకోనున్నారు. కోవిడ్ నిబంధనల్ని ఉల్లంఘించే వారి ఫొటోలను 8010968295కు వాట్సప్ చెయ్యాలని..ఆగస్టు 14 వరకూ కర్ఫ్యూ ఆంక్షలు అమల్లో ఉంటాయి.

 గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 2,287 పాజిటివ్‌ కేసులు ఆదివారం నమోదయిన్నట్లు ప్రభుత్వం తెలిపింది. 18 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 19,68,462కు పెరిగాయి.