ఒలింపిక్స్‌లో బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు చరిత్ర సృష్టించింది. ఈ మెగా ఈవెంట్‌లో రెండు మెడల్స్ గెలిచిన తొలి భారత మహిళగా నిలిచింది. ఆదివారం చైనాకు చెందిన హి బింగ్జియావోతో జరిగిన మ్యాచ్‌లో సింధు 21-13, 21-15 తేడాతో వరుస గేమ్స్‌లో విజయం సాధించింది.
దీంతో సింధు ఖాతాలో మరో రజిత పతాకం చేరింది. 2016 రియో ఒలింపిక్స్‌లోనూ సింధు రజిత పతాకం గెలిచిన విషయం తెలిసిందే. టోక్యో ఒలింపిక్స్‌లో ఇండియాకు ఇది రెండో మెడల్. తొలి మెడల్‌ను వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను అందించిన విషయం తెలిసిందే. ఇక బాక్సర్ లవ్లీనా ఇప్పటికే మరో మెడల్‌ను కూడా ఖాయం చేసింది.
సింధు కంటే ముందు రెజ్లర్ సుశీల్‌కుమార్ మాత్రమే ఒలింపిక్స్‌లో భారత్ తరఫున రెండు మెడల్స్ గెలిచాడు. అతడు 2008 గేమ్స్‌లో బ్రాంజ్, 2012 గేమ్స్‌లో సిల్వర్ మెడల్ గెలిచిన విషయం తెలిసిందే. శనివారం సెమీస్‌లో పరాజయం పాలవడంతో గోల్డ్ మెడల్ గెలవాలన్న ఆమె ఆశలు అడియాసలయ్యాయి.
అయితే ఆ ఓటమి నుంచి ఒక రోజు వ్యవధిలోనే సింధు కోలుకుంది. బ్రాంజ్ మెడల్ మ్యాచ్‌లో కఠినమైన చైనా ప్రత్యర్థిపై తొలి గేమ్ నుంచే పైచేయి సాధిస్తూ వచ్చింది. అటాకింగ్ గేమ్ ఆడుతూ.. ఏ సమయంలోనూ ప్రత్యర్థికి అవకాశం ఇవ్వలేదు. మ్యాచ్ 52 నిమిషాల పాటు సాగింది.
నిన్న సెమీస్‌లో వరల్డ్ నెంబర్ వన్ తై జు యింగ్ చేతిలో ఓడిన సింధు నేడు ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా జాగ్రత్తగా ఆడింది. పూర్తి ఎనర్జీతో, మంచి ఫుట్‌వర్క్‌తో కనిపించింది. చివరి వరకు అదే ఊపు కనిపించి రెండో సెట్‌ను కైవసం చేసుకున్న సింధు కాంస్యంతో మెరిసింది.
More Stories
జన్మతః పౌరసత్వం రద్దుపై ఫెడరల్ కోర్టు స్టే
అండర్-19 ప్రపంచకప్.. సూపర్ సిక్స్‌లోకి యువ భారత్
అక్రమ వలస వెళ్లిన భారతీయులను తిరిగి రప్పించేందుకు సిద్ధం