సెమీస్‌కు చేరిన బాక్సర్ లవ్లినా బోర్గోహైన్

టోక్యో ఒలింపిక్స్ లో భారత్ కు రెండో పతకం ఖాయమైంది. టోక్యో ఒలింపిక్స్ లో యువ భారతీయ బాక్సర్ లోవ్లినా బోర్గోహైన్ శుక్రవారం మహిళల వెల్టర్ వెయిట్ విభాగంలో (64-69కిలోలు) చైనా తైపీకి చెందిన నీన్ చిన్ చెన్ పై విజయం సాధించారు. 
 
టోక్యోలో ఒలింపిక్స్‌లో అరంగేట్రం చేసిన లవ్లినా సెమీఫైనల్‌కు చేరుకుంది. సెమీఫైనలిస్టులు ఇద్దరికి పతకం ఖాయమైనందున భారత్‌కు కనీసం కాంస్య పతకం లభిస్తుందని భరోసా ఇచ్చింది. బాక్సర్ లోవ్లినా బోర్గోహైన్ కు ఒలింపిక్స్ లో సెమీఫైనల్ కు చేరడం ద్వారా రెండో పతకం భారత్ కు ఖాయమైంది. మీరాబాయి చాను వెయిట్ లిఫ్టింగ్ రజత పతకం తర్వాత టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు ఇది రెండో పతకం.
 
మాజీ వరల్డ్ చాంఫియన్ 4-1తో లవ్లీనా ఓడించింది.తొలి ఒలింపిక్స్ లోనే లవ్లీనా సంచలనం సృష్టించి భారతదేశానికి పేరు తెచ్చింది. అసోం రాష్ట్రంలోని గోలాఘాట్ ప్రాంతానికి చెందిన లవ్లీనా గతంలోనూ పలు పతకాలు సాధించింది. 
 
ఆర్చ‌రీలో దూసుకెళ్తున్న‌ దీపికా కుమారి
 
మరోవంక, ఆర్చ‌రీ వ్యక్తిగ‌త రిక‌ర్వ్ విభాగంలో దూసుకెళ్తోంది ఇండియ‌న్ ఆర్చ‌ర్ దీపికా కుమారి. శుక్ర‌వారం ఉద‌యం జ‌రిగిన ప్రిక్వార్ట‌ర్స్‌లో ర‌ష్యా ఆర్చ‌ర్ కేనియా పెరోవాపై 6-5 తేడాతో విజయం సాధించింది.  ఐదు సెట్లు ముగిసే స‌రికి ఇద్ద‌రు ఆర్చ‌ర్లు 5-5 స్కోరుతో స‌మంగా నిల‌వ‌డంతో షూట్ ఆఫ్‌లో ఫ‌లితం తేల్చాల్సి వ‌చ్చింది. 28 స్కోరుతో తొలి, మూడో సెట్‌ల‌ను దీపికా గెలిచింది. నాలుగో సెట్‌లో ఇద్ద‌రు స్కోర్లు స‌మం కాగా.. రెండు, ఐదో సెట్‌ల‌ను రష్యా ఆర్చ‌ర్ సొంతం చేసుకుంది.