మోదీ ట్విట్టర్ ఫాలోవర్స్ @ 70 మిలియన్లు 

 ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్ ఫాలోవర్స్ సంఖ్య 70 మిలియన్ మార్క్‌ను చేరింది. ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియాలో అత్యధిక ఫాలోవర్స్ ఉన్నవారిలో క్రియాశీల రాజకీయ నేతల్లో ఒకరిగా ప్రధాని మోదీ నిలిచారు. రాజకీయ ప్రసంగాలతో మోదీ ఎప్పటికప్పుడు తన ఫాలోవర్స్‌ను పెంచుకున్నారు. 

2009లో మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ట్విట్టర్ ఖాతాను ప్రారంభించారు. 2010లో లక్ష మంది ఫాలోవర్స్ చేరగా.. 2011 నవంబర్‌లో ఫాలోవర్స్ సంఖ్య 4 లక్షలకు పెరగ్గా.. ఆ తర్వాత ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం భారీగా పెరిగారు. మోదీ దేశ ప్రజలను ఉద్దేశించి తన ప్రసంగాలతో ఆకట్టుకున్నారు. ప్రతి విషయాన్ని ప్రజలతో పంచుకోవడంతో పాటు సందేశాలతో పాటు సూచనలతో పాటు ప్రభుత్వ పథకాలపై ట్విట్టర్ వేదికగా వివరిస్తూ వస్తున్నారు.

మోదీ తర్వాత పోప్‌ ఫ్రాన్సిస్‌ ట్విట్టర్‌ ఖాతాను 53 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌కు 30.9 మిలియన్లు, మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామాకు 129.8 మిలియన్లు, ఫాలోవర్స్‌ ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌కు 7.1 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. 

కేంద్ర హోంమంత్రి అమిత్ షా అమిత్‌షాకు 26.3 మిలియన్ల మంది, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి 19.4 మిలియన్ల ఫాలోవర్స్‌ ఉన్నారు. అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ఖాతాను ట్విట్టర్‌ యూఎస్‌ క్యాపిటల్‌ వద్ద జరిగిన అల్లర్ల నేపథ్యంలో శాశ్వతంగా తొలగించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఆయనకు 88.7 మిలియన్స్‌ ఫాలోవర్లు ఉన్నారు.

కాగా,  భారతదేశంలో రూపొందించి, అభివృద్ధి చేసిన ట్విట్టర్ ప్రత్యర్థి  కూ ను ఉపయోగించాలని భారత ప్రభుత్వం ప్రజలను ప్రోత్సహిస్తుంది మరియు కోరుతుంది. 

ఒక నివేదిక ప్రకారం, ప్రత్యర్థి వేదికను ప్రోత్సహిస్తున్న అనేక మంది భారత ప్రభుత్వ విభాగాలు,  మంత్రులకు కూ ఎక్కువ అభిమాన సమాచార సాధనంగా మారుతున్నందున ట్విట్టర్ భారతదేశంలో అనుచరులను కోల్పోతోంది. అయినప్పటికీ, ప్రధాని మోదీ ఇంకా కూలో చేరలేదు. కానీ ఆయన  మంత్రివర్గం నుండి అనేక మంది మంత్రులు కూలో తమ ఖాతాలను తెరిచారు. ట్విట్టర్‌లో తన ఉనికిని కొనసాగిస్తూ పలు ప్రభుత్వ విభాగాలు కూను ఉపయోగించడం ప్రారంభించాయి.