పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో యుద్ధసామగ్రి 

పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో యుద్ధ సామాగ్రిని మనంతట మనం ఉత్పత్తి చేసుకోగలటమే కాకుండా ఎగుమతులు చేయగలిగే స్థాయికి భారత్ చేరుకోగలిగినదని భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డి ఆర్ డి ఓ)  చైర్మన్ డాక్టర్ జి సతీష్ రెడ్డి వెల్లడించారు. 
శత్రు దేశాల ప్రయోగించే క్షిపణులను ముందుగానే గుర్తించి వాటిని ఆకాశంలోనే ధ్వంసం  చేయగలిగే అత్యున్నత క్షిపణులను నేడు ఉత్పత్తి చేయగల్గుతున్నామని తెలిపారు.   క్రిష్ణాజిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో ఆదివారం విజయవాడలో జరిగిన ఆత్మీయ సమావేశం లో ఆయన ప్రసంగిస్తూ దేశ రక్షణ కోసం సంబంధించి తమ రక్షణ రంగం నానాటికీ బలోపేతమవుతున్నామని చెప్పారు.
శత్రు దేశాలు, ఉగ్రవాద సంస్థలు, అసాంఘిక శక్తులు ప్రయోగించే డ్రోన్లను గుర్తించి ధ్వంసం చేసే పరిజ్ఞానాన్ని భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ) ఇప్పటికే విజయవంతంగా అభివృద్ధి చేసిందని సతీశ్‌రెడ్డి వెల్లడించారు. రక్షణ రంగంలో భారత్‌ ప్రపంచంలోనే అగ్రరాజ్యాలకు దీటుగా అభివృద్ధి సాధిస్తోందని ఆయన చెప్పారు.
 
భారత సైన్యం, ఇతర భద్రతా దళాలకు ఈ వ్యవస్థ త్వరలోనే అందుబాటులోకి వస్తుందని చెప్పా రు. డ్రోన్‌ విధ్వంసక వ్యవస్థతోపాటు రక్షణ రంగంలో భారత్‌ ప్రపంచంలోనే బలమైన శక్తిగా ఎదుగుతున్నదని తెలిపారు. ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా 48 కిలోమీటర్ల దూరం  వరకు దూసుకెళ్ళే అత్యంత శక్తివంత తుపాకులను తయారు చేసుకోగల్గుతున్నామని పేర్కొన్నారు. ప్రస్తుతం దాదాపు 11 వేల చిన్న పెద్ద పరిశ్రమల్లో దేశ రక్షణ సామాగ్రి తయారవుతుందని సతీష్ రెడ్డి వివరించారు.

రక్షణ రంగంలో భారతదేశం స్వయం సమృద్ధిని సాధించి ప్రపంచంలోనే మొదటి ఐదు అగ్రరాజ్యాల జాబితాలో స్థానం సాధించిందని పేర్కొంటూ బాలిస్టిక్‌ క్షిపణి రక్షణ వ్యవస్థ కలిగి ఉన్న నాలుగు దేశాల్లో భారత్‌ ఒకటని గుర్తు చేశారు. అత్యాధునిక తేజస్‌ యుద్ధ విమానాలను రూపొందించిన ఆరు దేశాల్లో మన దేశం ఉందని తెలిపారు.  

అణు ట్యాంకర్లు కలిగిన ఏడు దేశాల్లో భారత్‌ ఉందని పేర్కొంటూ, క్షిపణి విధ్వంసకర వ్యవస్థను అభివృద్ధి చేసిన ఆరు దేశాల్లో భారత్‌కు చోటు దక్కిందని చెప్పారు.  పగ్రహాలను న్యూట్రలైజ్‌ చేసి ధ్వంసం చేయగల సామర్థ్యం కలిగిన నాలుగు దేశాల్లో భారత్‌ కూడా ఉండటం గర్వకారణం  అని పేర్కొన్నారు.

డ్రోన్లను గుర్తించడం, జామ్‌ చేయడం, ధ్వంసం చేయడం కోసం రూపొందించిన పరిజ్ఞానాన్ని విజయవంతంగా పరీక్షించి కేంద్ర ప్రభుత్వం వద్ద ప్రదర్శించామని సతీష్ రెడ్డి తెలిపారు. ఈ పరిజ్ఞానాన్ని ఇప్పటికే భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌కు అందించామని,  మరికొన్ని పరిశ్రమలకు కూడా త్వరలో అందించి వాటి ద్వారా డ్రోన్‌ విధ్వంసక వ్యవస్థ ఉత్పత్తిని చేపడతామని వివరించారు. టీటీడీతో సహా ఎవరైనా సరే ఆ పరిశ్రమల నుంచి డ్రోన్‌ విధ్వంసక టెక్నాలజీని కొనుగోలు చేసి అవసరమైనచోట్ల నెలకొల్పుకోవచ్చని చెప్పారు.

కృష్ణా జిల్లా నాగాయలంక మండలం “గుల్లలమంద” గ్రామంలో ప్రస్తుతం వెయ్యి మంది శ్రామికులతో క్షిపణి కేంద్ర నిర్మాణం పనులు చురుగ్గా సాగుతున్నాయని తెలిపారు. ఆ గ్రామాన్ని దత్తత తీసుకుని సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తామని చెప్పారు.   భారత దేశ రక్షణ తో పాటు ప్రజా ఆరోగ్య పరిరక్షణకు ప్రస్తుతం ఎనలేని కృషి జరుగుతున్నదని తెలిపారు.  యుద్ధ  అస్త్రశస్త్రాలు తయారీలో ప్రపంచంలో అమెరికా, చైనా, రష్యా వంటి అగ్రదేశాల సరసన భారత్ చేరగల్గదంటూ సగర్వంగా చెప్పారు. 
 
నేడు యావత్ ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా కు సంబంధించి వ్యాక్సిన్ కు ప్రతిగా తమ శాస్త్రవేత్తలు రూపొందించిన “2 డీజి” మందు ను తొలుత ప్రజా బాహుళ్యం లోకి చేరవేసేందుకు 18 ఫార్మా కంపెనీలకు తగు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించగా ఇప్పటికే ఆరు కంపెనీలు ఉత్పత్తి ప్రారంభించి క్రమేణా విదేశాలకు ఎగుమతి చేసే స్థాయికి చేరుకోగలమన్న విశ్వాసం వ్యక్తం చేశారు. 
 
ప్రధాని నరేంద్ర మోదీ ప్రోత్సాహంతో కేవలం వాట్టామని పేర్కొన్నారు. తాజాగా ఇంటి నుంచే తగు చికిత్స కోసం 10 కేజీరం, పది రోజుల్లోనే ఇప్పటికే 16 కేంద్రాల్లో వెయ్యి పడకల ఆసుపత్రి ప్రారంభించామని గుర్తు చేశారు. జిల్లాస్థాయి వరకు ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటుకు చర్యలు చేపల ఆక్సిజన్ సిలిండర్ లను రాత్రి పగలు ఉత్పత్తి చేస్తున్నామని వెల్లడించారు. గతంలో లో యేడాదికి 40 వేల పీపీఈ కిట్ల ఉత్పత్తి సాగితే ప్రస్తుతం రోజుకు పది లక్షల కిట్ల ఉత్పత్తి చేస్తున్నామని తెలిపారు.