ఎమ్మిగనూరు ఎమ్యెల్యే ఇంటి ముట్టడికి బిజెపి యత్నం 

హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా హిందువుల ఆరాధ్య దేవత అయిన గోమాతను కించపరిచే విధంగా మాట్లాడిన ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ బిజెపి కార్యకర్తలు ఎమ్యెల్యే ఇంటి ముట్టడి కార్యక్రమం చేపట్టారు. 
భారతీయ జనతా పార్టీ కార్యాలయం నుండి ఎమ్మెల్యే ఇంటిదాకా పలు నినాదాలు చేస్తూ ఎమ్మెల్యే ఇంటిని ముట్టడించారు. నియోజకవర్గ ఇంచార్జ్ మురహరి రెడ్డి ఆధ్వర్యంలో  ఆదివారం చలో ఎమ్మిగనూరు కార్యక్రమంలో భాగంగా ఈ ముట్టడి చేపట్టారు.
హిందూ సమాజానికి ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి బేషరతుగా  క్షమాపణ చెప్పాలని  డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే ఇంటి దగ్గర కాసేపు పోలీసులు బిజెపి నాయకుల మధ్య తోపులాట జరిగింది. దానితో  పోలీసులు బలవంతంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. 
 
అనంతరం స్వంత పూచీకత్తుపై  విడుదుల చేశారు.  అంతకు మునుపు ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డి పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని డి ఎస్ పి వినోదకుమార్ కు పిర్యాదు చేసారు. .హిందూ వ్యతిరేక  ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డి పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని .బిజెపి జిల్లా అధ్యక్షుడు పోలంకి రామస్వామి డిమాండ్ చేశారు.  
 
బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు హరీష్ బాబు, రాష్ట్ర కార్యదర్శి నీలకంఠ మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ జైన్,  జిల్లా ప్రధాన కార్యదరేసులు అంబలి కాశీ విశ్వనాథ్, నరసింహ వర్మ, మాజీ కార్పొరేటర్ రంగస్వామి, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు అరుణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 
 
గోవధ చట్టం అమలు సాధ్యం కాదని స్పష్టం చేస్తూ ఆ చట్టాన్ని ఎత్తువేయాలని ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డి గత శుక్రవారం డిమాండ్ చేయడం కలకలం రేపింది. భారత్‌లో కాలం చెల్లిన చట్టాల్లో గోవధ చట్టం ఒకటని అంటూ ప్రపంచంలో ఇటువంటి చట్టం ఎక్కడా లేదని వాపోయారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్, భజరంగధల్ బక్రీద్ పండుగ రోజు గోవధ చట్టాన్ని వివాదంగా మారుస్తున్నారని విమరించారు.
 లౌకిక దేశంలో గోవు పూజించేవారికి పూజించే వస్తువని, తినే వారికి ఆహార వస్తువని అంటూ ఆ చట్టాన్ని ఎద్దేవా చేశారు.  ప్రజల ఆహార అలవాట్లపై నిషేధం విధించడం పౌరుని ప్రాథమిక హక్కులకు భంగం కలిగించడమేనని స్పష్టం చేశారు. అయితే ఈ వాఖ్యలో తీవ్ర వివాదాస్పదం కావడంతో గోవధ నిషేధంపై నిన్న తాను మాట్లాడిన మాటలు వైసీపీకి, సీఎంవో కార్యాలయానికి ఎటువంటి సంబంధం లేదని అంటూ నష్టనివారణ ప్రయత్నం చేశారు.