చైనా, టర్కీ డ్రోన్లతో పాక్ భారత్ పై దాడి చేయలేదు

జమ్మూ కాశ్మీర్ పోలీసులు శుక్రవారం తెల్లవారుజామున అక్నూర్ సెక్టార్‌లో ఒక డ్రోన్‌ను దించిన తరువాత, చైనా, టర్కీ నుండి పొందిన డ్రోన్ టెక్నాలజీని ఉపయోగించడం ద్వారా పాకిస్తాన్ భారత్ లో చొరబడి మనల్ని దెబ్బతీసేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ  ప్రభుత్వం అనుమతించదని బిజెపి భరోసా వ్యక్తం చేసింది.

“5 కిలోల ఐఇడితో పాటు ఐబి వెంట కాన్హాచక్ సెక్టార్ నుండి భారత భూభాగంలోకి ప్రవేశించే డ్రోన్‌ను నాశనం చేయడం ద్వారా జమ్మూ కాశ్మీర్‌లో పేలుళ్లను ప్రేరేపించే ప్రయత్నాన్ని విఫలమైనందుకు భద్రతా సంస్థలను బిజెపి ప్రశంసించింది” అని బిజెపి సీనియర్ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి కవిందర్ గుప్తా తెలిపారు.

బిజెపి నేతృత్వంలోని ప్రభుత్వం ఆచరణాత్మకమైన చర్యలు తీసుకోవడంతో జమ్మూ కాశ్మీర్ ను విచ్ఛిన్నం చేయాలనే పాకిస్తాన్ కలలు ఎప్పటికి  ఫలింపబోవని  ఆయన స్పష్టం చేశారు. ఆర్టికల్ 370 రద్దు చేసిన 2019 ఆగష్టు 5 తర్వాత కాశ్మీర్ లోయలో వేర్పాటువాదులు ఉనికి కోల్పోవడంతో ఆ ప్రాంత ప్రజలు జాతి నిర్మాతలుగా మారేందుకు ఎంతగానో ప్రభావితం కావిస్తున్నదని చెప్పారు.

దేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేసే వారి ఎత్తుగడలు విఫలం కావించడంలో  బిజెపి నేతృత్వంలోని ప్రభుత్వం అత్యుత్తమంగా పనిచేస్తున్నదని ఆయన కొనియాడారు. దేశంలో వాతావరణం మారిందని, ఇప్పుడు ఏ సంస్థ కూడా దేశానికి వ్యతిరేకంగా ఏమీ చేయలేదని ఆయన స్పష్టం చేశారు. జమ్మూ కాశ్మీర్ ఇప్పుడు సురక్షితమైన వారి చేతులలో ఉన్నదని తెలిపారు.

జమ్మూ కాశ్మీర్ లో ఇటీవలి కాలంలో నిషేధించబడిన ఉగ్రవాద సంస్థల కమాండర్లను కదలకుండా చేయడం, భారీ పరిమాణంలో  తటస్థీకరణ మరియు ఐఇడి ప్రేలుడు పదార్ధాలను స్వాధీనం చేసుకొంటూ ఉండడంతో దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నవారికి వ్యతిరేకంగా బీజేపీ ప్రభుత్వం ఏమిచేయగలదో స్పష్టం చేస్తున్నదని ఆయన పేర్కొన్నారు.

ఇప్పుడు పరిస్థితులు మారాయని, శత్రువులు ఇప్పుడు మన దేశంపై వ్యతిరేకంగా పనిచేయడం ఇప్పుడు సాధ్యం కాదని అంటూ ప్రధాని నరేంద్ర మోదీ, హోమ్ మంత్రి అమిత్ షా ప్రజలను భయబ్రాంతులకు గురిచేసే లేదా ఉగ్రవాద చర్యలకు పాల్పడే ఏ సంస్థనైనా తుదముట్టించడానికి భద్రతా సంస్థలకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని వెల్లడించారు. 

 జమ్మూలోని అఖ్నూర్ సెక్టార్‌లో శుక్రవారం తెల్లవారుజామున  కాల్చివేసిన డ్రోన్‌ను  చైనా, హాంకాంగ్, తైవాన్‌ లలో తయారు చేసిన్నట్లు పోలీసులు తెలిపారు.  గత ఒకటిన్నర సంవత్సరాల్లో జమ్మూ కాశ్మీర్ పోలీసులు 25 డ్రోన్ సోర్టీల ద్వారా పడిపోయిన మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు వారు చెప్పారు.   డ్రోన్ సోర్టీల ద్వారా ఉగ్రవాద సంస్థలైన లష్కరే తోయిబా, జైష్ మొహమ్మద్ పేలోడ్‌ను వదులుకున్నట్లు పోలీసులు తెలిపారు.

కాగా, జమ్ముకశ్మీర్‌లోని బందిపొరాలో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు గుర్తుతెలియని టెర్రరిస్టులు హతమయ్యారు. బందిపొరాలోని శోక్‌బాబా అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో భద్రతా బలగాలు గాలింపు చేపట్టాయి. 
 
దీంతో గాలింపు బృందాలపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారని, దీంతో భద్రతా దళాలు ఎదురు కాల్పులు ప్రారంభించాయని కశ్మీర్‌ జోన్‌ పోలీసులు తెలిపారు. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు టెర్రరిస్టులు హతమయ్యారని చెప్పారు. వారు ఏ ఉగ్రవాద సంస్థకు చెందినవారనే విషయం ఇంకా తెలియరాలేదని వెల్లడించారు. ఆపరేషన్‌ ఇంకా కొనసాగుతున్నదని తెలిపారు.
ఇలా ఉండగా, జమ్మూకశ్మీరులోని ఫూంచ్ జిల్లాలోని మాన్‌కోటి కృష్ణ ఘాటీ సెక్టారు అంతర్జాతీయ సరిహద్దు వద్ద శనివారం మందుపాతర పేలిన దుర్ఘటనలో ఓ భారత జవాన్ అమరుడయ్యారు. సరిహద్దుల్లో పెట్రోలింగ్ చేస్తున్న ఓ జవాన్ మందుపాతరపై కాలు వేయగా అది కాస్తా పేలింది. 
 
ఈ దుర్ఘటనలో ఆర్మీజవాన్ అక్కడిక్కడే మరణించారు.మృతుడు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని హమీర్ పూర్ గ్రామానికి చెందిన కృష్ణ వైద్య అని గుర్తించారు. సరిహద్దుల్లో గస్తీ తిరుగుతూ మందుపాతర పేలి అమరుడైన సిపాయి కృష్ణ వైద్యకు భారత సైనికులు నివాళులు అర్పించారు. కృష్ణ ఘాటీ సెక్టారులో డమ్మీ ఏరోప్లేన్ బెలూన్ లభించింది.