`ఇద్దరు పిల్లలు’ నిబంధన ప్రతిపాదన ఏదీ లేదు 

దేశంలో జనాభా నియంత్రణకోసం `ఇద్దరు పిల్లలు’ నిబంధన తీసుకు రావాలనే ప్రతిపాదన ఏదీ కేంద్ర ప్రభుత్వం ముందు లేదని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి భారతి ప్రవీణ్ పవార్ స్పష్టం చేశారు. ప్రభుత్వం అటువంటి విధానం రూపొందించాలని ఆలోచిస్తున్నారా  అని అడిగిన ప్రశ్నకు సమాధానంగా “లేదు” అని ఆమె లోక్ సభకు తెలిపారు. 

బిజెపి ఎంపి ఉదయ్ ప్రతాప్ సింగ్ లేవనెత్తిన ప్రశ్నకు సమాధానమిస్తూ  “నిర్దిష్ట సంఖ్యలో పిల్లలను కలిగి ఉండటానికి ఏదైనా బలవంతం లేదా ఉత్తరువు ఇవ్వడం ప్రతికూల ప్రభావం చూపుతుందని, పైగా లైంగిక పరమైన గర్భ విచ్చినాలకు దారితీస్తుందని అంతర్జాతీయ అనుభవాలు తెలిపుతున్నాయని ఆమె పేర్కొన్నారు. 

ఆడపిల్లలు పుడితే విడిచి పెట్టడం, ఆడ శిశు హత్యలకు దారితీయడం లేదా కొడుకులకు ప్రాధాన్యత ఇవ్వడంకు దారితీస్తుందని లిఖితపూర్వక సమాధానంలో ఆమె తెలిపారు.  ఇవన్నీ చివరికి లింగ నిష్పత్తిలో మార్పుకు దారితీస్తుందని ఆమె చెప్పారు. బిజెపి పాలిత రెండు రాష్ట్రాలు-ఉత్తర ప్రదేశ్, అస్సాంలలో ఇద్దరు పిల్లల విధానాలను ప్రతిపాదిస్తూ ఉండడంతో ఆమె సమాధానం ప్రాముఖ్యతను సంతరించుకుంది.

కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాలు ఎటువంటి కఠినమైన జనాభా నియంత్రణ చర్యలను ఆశ్రయించకుండానే,  కుటుంబ నియంత్రణ విషయంలో సమగ్ర విధానాన్ని అవలంబించడం ద్వారా సంతానోత్పత్తి రేటును తగ్గించడంలో విజయవంతమయ్యాయని పవార్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.

అలాగే, భారత్ కూడా ఆమోదం తెలిపిన కైరోలో 1994 లో జరిగిన జనాభా, అభివృద్ధి సదస్సులో య సమావేశం బలవంతంగా  కుటుంబ నియంత్రణ అమలు పరచడాన్ని స్పష్టంగా వ్యహాతిరేకించిన్నట్లు ఆమె తెలిపారు.

పౌరులకు ఎటువంటి వివక్ష లేకుండా, నిబంధం లేకుండా స్వచ్ఛందంగా,  సమాచార ఎంపికలను అందించడం ద్వారా ప్రభుత్వం అమలు చేస్తున్న జాతీయ కుటుంబ నియంత్రణ కార్యక్రమం (ఎన్‌ఎఫ్‌పిపి) జనాభా పెరుగుదలను కట్టడి చేయడం లక్ష్యంగా అమలు జరుగుతున్నట్లు మంత్రి పేర్కొన్నారు.  

మిషన్ పరివార్ వికాస్, విస్తరించిన గర్భనిరోధక ఎంపికలు, స్టెరిలైజేషన్ అంగీకారం కోసం పరిహార పథకం, పోస్ట్-పార్టమ్ ఇంట్రాటూరైన్ గర్భనిరోధక పరికర ప్రోత్సాహక పథకం, ఆశా కార్యకర్తల ద్వారా గర్భనిరోధక మందులను ఇంటికి పంపించే పథకం, వారి ద్వారానే ఔషధాల సామగ్రితో పాటు గర్భ పరీక్షా సామగ్రి కూడా ఇవ్వడం,  కుటుంబ నియంత్రణ లాజిస్టిక్స్ నిర్వహణ సమాచార వ్యవస్థ వంటి వివిధ సేవలను  ఎన్‌ఎఫ్‌పిపి కార్యక్రమం ద్వారా అందిస్తున్నట్లు మంత్రి వివరించారు. ఈ కార్యక్రమాలతో, మొత్తం సంతానోత్పత్తి రేటు 2005-06లో 2.7 శాతం ఉండగా  2015-16లో 2.2 శాతానికి తగ్గిందని ఆమె తెలిపారు.