దిల్ సుఖ్ నగర్ లో భూసుపోషణ అవగాహన‌ కార్యక్రమం

ఈ అధినిక కాలంలో సహజ వనరుల వినియోగం అత్యంత ప్రముఖమైన అంశం. పంచభూతలలో ఒకటైన భూమి పట్ల మన జీవనశైలి ప్రభావం పరస్పర సహకరంగా ఉంటూ భావితరలకు ఆదర్శంగా ఉండాలి. నగరంలో ఉంటూ మన చుట్టూ అందుబాటులో ఉన్న పరిమితమైన అవకాశాలను సైతం సద్వినియోగం చేసుకోవడం ఎలా అనే అంశం గురుంచి గ్రామ భారతి తెలంగాణ ప్రాంత కార్యవర్గ సభ్యులు  మదన్ గుప్తా వివరించారు.

హైదరాబాద్, దిల్ సుఖ్ నగర్ అష్టలక్ష్మి నగర్ లోని సరస్వతీమండల్ విజయపురి భవనంలో 22- జూలై గురువారం నాడు  గ్రామ భారతి భూసుపోషణ అవగాహన‌ కార్యక్రమం జరిగింది. ఇందులో పాల్గొన్న ఆర్ఎస్ఎస్ నగర సంఘచాలకులు మేకా కృష్ణా రావు మాట్లాడుతూ మనం నివసించే ఇంటి ఆవరణలో, అపార్ట్ మెంట్ లలో చిన్న చిన్న మొక్కల పెంచటంతో పాటు మిద్దె తోటల విషయాలను తెలిపారు.

ఈ కార్యక్రమంలో గ్రామ భారతి ప్రాంత కార్యవర్గ సభ్యులు మదన్ గుప్తా,  కరుణాకర్, విభాగ్ గోసేవ ప్రముఖ్  బూరుగు రమణ, భాగ్ కార్యవాహ  రఘురామ్, రామకృష్ణాపురం కార్పొరేటర్ రాధా ధీరజ్ గారు, సరూర్‌నగర్‌ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి గారు కూడా పాల్గొన్నారు.

స్థానిక ప్రజలు, గోసేవాప్రముఖ్ లు, పర్యావరణ కార్యకర్తలు పాల్గొన్న ఈ కార్యక్రమంలో  గో సంబంధిత, పర్యావరణ సంబంధిత పుస్తకాలు, ఉత్పత్తుల స్టాల్ కూడా నిర్వహించారు.