పాస్టర్ అత్యాచారం కేసు: ఎస్సీ కమిషన్ నోటీసులు 

ఆంధ్రప్రదేశ్: తూర్పుగోదావరి జిల్లా కాకినాడ సమీపంలో ఇటీవల జరిగిన మైనర్ బాలికపై చర్చి పాస్టర్ అత్యాచారం కేసులో జిల్లా ఎస్పీ, కలెక్టర్లకు జాతీయ ఎస్సీ కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఎస్సీ సామజిక వర్గానికి చెందిన బాలికపై పాస్టర్ అత్యాచారం చేసిన ఘటనలో ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేసిన సర్పవరం పోలీసులు ఎస్సీ-ఎస్టీ అత్యాచార నిరోధక చట్టంలోని సెక్షన్లు నమోదు చేయకపోవడం, పాస్టర్ అలవాల సుధాకర్ కి సంబంధించిన వివరాలు సరిగ్గా నమోదు చేయకపోవడం వంటి అంశాలను ప్రస్తావిస్తూ ఎస్సీ ఎస్టీ రైట్స్ ఫోరమ్ జాతీయ అధ్యక్షులు కె. నాగరాజ జాతీయ ఎస్సీ కమిషన్ కు పిటిషన్ దాఖలు చేశారు.

ఈ పిటిషన్ పై స్పందించిన ఎస్సీ కమిషన్, ఈ ఘటనకు సంబంధించి నివేదిక 15 రోజుల్లో ఇవ్వాలని, లేకపోతే తమ ఎదుట వ్యక్తిగతంగా హాజరు కావాల్సి ఉంటుందని తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ, కలెక్టర్లకు పంపిన నోటీసులో పేర్కొంది.