ఆదిత్యనాథ్ కు అఖిలేష్ సర్టిఫికెట్ అవసరం లేదు!

యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వానికి మాజీ ముఖ్యమంత్రి, సమాజ్ వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ నుంచి సర్టిఫికేట్ అవసరం లేదని భారతీయ జనతా పార్టీ ఘాటుగా .చెప్పింది.  జూలై 12 న లక్నోలో ఇద్దరు అల్-ఖైదా ఉగ్రవాదులను అరెస్టు చేయడంపై యుపి పోలీసులను విశ్వసించలేదని ఎస్పీ నాయకుడు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో బీజేపీ నాయకత్వం తీవ్రంగా స్పందించింది.

“పాకిస్తాన్ ను అభినందించే వ్యక్తులను విడుదల చేయాలని అఖిలేష్ యాదవ్ కోరుకుంటున్నారు. మహిళలను వేధింపులకు గురిచేసేవారికి ప్రభుత్వం మద్దతు ఇవ్వాలని ఆయన కోరుకుంటున్నారు. ఒక మహిళపై ఒక మగవాడు అత్యాచారం చేస్తుంటే అది కేవలం తప్పు, వదిలివేయమని ఆయన తండ్రి చెప్పే మాటలు వినే  ప్రభుత్వాన్ని ఆయన కోరుకుంటున్నారు. ఆయనను క్షమించు ”అని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి దుష్యంత్ గౌతమ్ ఎద్దేవా చేశారు.

అల్-ఖైదాకు చెందిన ఇద్దరు ఉగ్రవాదులను లక్నో శివార్ల నుంచి ‘అన్సర్ ఘజ్వతుల్ హింద్’కు మద్దతుగా అరెస్టు చేసినట్లు యుపి పోలీసుల తీవ్రవాద నిరోధక దళం వెల్లడించింది.  వారి నుండి పేలుడు పదార్థాలు కూడా స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల వాదనపై అఖిలేష్ ప్రశ్నలు లేవనెత్తడంపై బిజెపి నాయకులు  తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.

“మేము ఉత్తర ప్రదేశ్ పోలీసులపై ఆధారపడలేము, ముఖ్యంగా బిజెపి ప్రభుత్వంలో” .బిఎస్పి అధినేత మాయావతి కూడా అరెస్టుపై యుపి పోలీసుల వాదనపై ప్రశ్నలు సంధించారు, అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇటువంటి చర్య మనసుల్లో సందేహాలకు దారితీస్తుంది” అంటూ అఖిలేష్ యాదవ్ పేర్కొనడంపై గౌతమ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇంతలో, రాష్ట్ర మహిళల భద్రతపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా విమర్శలపై స్పందించిన గౌతమ్, రంగు, కులం లేదా మతం ఆధారంగా కాంగ్రెస్ రాజకీయాలు చేయరాదని హితవు చెప్పారు.