దేవాలయ భూములు హిందువులకే చెందుతాయి

దేవాలయాల భూములు కేవలం హిందువులకు మాత్రమే చెందుతాయని,  వాటి మీద ఆదాయం దేవాలయాల అభివృద్ధి హిందువుల కోసమే వాడాలని స్పష్టం చేస్తూ మద్రాస్ హైకోర్టు చారిత్రాత్మకమైన తీర్పు ఇచ్చింది.   ప్రభుత్వాలు దొంగల మాదిరిగా దోచుకొని ఇతర కార్యక్రమాలు ఇతర మతాలకు ఇవ్వకూడదని తేల్చి చెప్పింది.

అలాగే 1985లో తమిళనాడులో 5 లక్షల ఎకరాలు దేవాలయాల భూములను ఉండేవి. ప్రస్తుతం 4 లక్షల 50 వేలు మాత్రమే లెక్క చూపిస్తున్నారని విస్మయం వ్యక్తం చేసింది. మిగిలిన 50 వేల ఎకరాలు ఏమయ్యాయి లెక్క తీయాలని, ఆక్రమణలో ఉంటె వెంటనే స్వాధీనం చేసుకోవాలని ఆదేశించింది. ఆక్రమించిన వారిపై కేసులు నమోదు చేసి, ఆ భూములను తిరిగి దేవాలయాలకు అప్పచెప్పాలని స్పష్టం చేసింది.

ఆలయాల భూములు దేవుడి పేరు మీదనే ఉండాలని, దేవాలయ అధికారులు ఆధీనంలో, దేవాలయం ఆధీనంలో మాత్రమే ఉండాల,  ప్రభుత్వాలు పనికిరాని వాటిపై పెత్తనం చేయ కూడదని కూడా తెలిపింది. 

దేవాలయాల పరిరక్షణ కోసం తమిళనాడులో `సేవ్ టెంపుల్స్’ పేరుతో జరుగుతున్న ఉద్యమంలో భాగంగా దాఖలు చేసిన  పిటీషన్ పై స్పందిస్తూ హైకోర్టు దేశ చరిత్రనే మలుపు తిప్పే ఈ తీర్పు ఇచ్చింది. దేవాలయాల భూముల పరిరక్షణకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకోవాలని, ప్రత్యేక కోర్టులు, ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని కూడా ఆదేశించింది. 

కేవలం హిందూ దేవాలయాల ఆదాయంతో మాత్రమే ప్రభుత్వాలు నడుస్తున్నాయని పేర్కొంటూ దొంగల మాదిరిగా దోచుకొని మరి ఇతర మతాల కోసం క్రైస్తవులు, ముస్లింల కోసం ఎందుకు ఖర్చు చేస్తున్నారని ప్రశ్నించింది. ప్రభుత్వాల రోజు వారి పరిపాలన కోసం, తమ యొక్క భోగాల కోసం హిందువుల దేవాలయాల ఆదాయాన్ని ఎందుకు వాడుతున్నారని నిలదీసింది.

దాతలు హిందూ దేవాలయాలకు హిందూ దేవుడికి భూములు ఇచ్చారని గుర్తు చేస్తూ దాతలు మీ భోగాల కోసం ఇవ్వలేదు హిందూ ధర్మం కోసం ఇచ్చారా అంటూ ప్రశ్నించింది.  దేవాలయాలలో ఉన్న అన్ని ఖాళీలు, పోస్టులు భర్తీ చేయాలని, హిందువులకు మాత్రమే ఉద్యోగాలు ఇవ్వాలని, అన్యమతస్తులకు కాదని కూడా స్పష్టం చేసింది.

దేశంలో చర్చిలు, మసీదులు ప్రభుత్వ ఆధీనంలో లేవు అందులో ఎంత ఆదాయం వస్తుందో ఎవరికీ తెలియదని గుర్తు చేస్తూ, హిందూ దేవాలయాలను మాత్రం దొంగల మాదిరిగా దోచుకుంటున్నారని అంటూ ఘాటుగా ఘాటుగా వ్యాఖ్యానించింది.

ఈ తీర్పు ఇచ్చిన న్యాయమూర్తి ఎస్ ఆర్  మహదేవన్ కొద్దీ రోజుల క్రితమే మతం మారితే రిజర్వేషన్ చెల్లదు అని చారిత్రాత్మక తీర్పు కూడా ఇవ్వడం జరిగింది. హిందూ ధర్మం ప్రకారం రిజర్వేషన్ ప్రకారం ఉద్యోగాలు తీసుకొని క్రైస్తవం, ఇతర మతాలలో చేరిన వారి ఉద్యోగాల నుండి తొలగించాలని, వారి జీతాన్ని రికవరీ చేసి, వారిపై కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. 

 కాగా, హిందూ దేవాలయాల పై ప్రభుత్వాలు చేస్తున్న పెత్తనాన్ని రూపుమాపేలా మద్రాస్ హైకోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పు రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా దేవాలయ పవిత్రత మరియు ఆస్తుల పరిరక్షణ కోసం సాగుతున్న ఉద్యమానికి దోహదం చేస్తుందని విశ్వ హిందూ పరిషద్ తెలంగాణ అధికార ప్రతినిధి రావినూతల శశిధర్ ఆశాభావం వ్యక్తం చేశారు. 

మద్రాసు హైకోర్టు  తీర్పును పూర్తిగా  పరిశీలించి తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల నుండి కూడా దేవాలయాల ఆస్థులను కాపాడటానికి, అన్యమతస్తులను దేవాలయాల నుండి తొలగించడానికి, హిందూ దేవాలయాలపై ప్రభుత్వాల పెత్తనాన్ని రూపుమాపడానికి అవసరమైన న్యాయ పరమైన ప్రక్రియ ప్రారంభిస్తామని ఆయన వెల్లడించారు.