దౌత్య మార్గంలో కేరళ బంగారం స్మగ్లింగ్ ఉగ్రవాద చర్యే!

స్వప్నా సురేష్ తదితరులు 2019 నవంబర్ నుండి 2020 జూన్ మధ్య యుఎఇ నుండి 167 కిలోల బంగారాన్ని భారతదేశంలోకి అక్రమంగా రవాణా చేయడం ద్వారా ఉగ్రవాద చర్యకు పాల్పడ్డారని, అలా చేయడం వల్ల దేశ భద్రత, ఆర్థిక స్థిరత్వానికి ముప్పు వస్తుందని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) కేరళ హైకోర్టుకు తెలిపింది.

దౌత్య మార్గాల ద్వారా బంగారం అక్రమ రవాణాకు పాల్పడిన సురేష్, ఇతరులు తమ చర్యలు యుఎఇతో భారతదేశ సంబంధాలను దెబ్బతీస్తాయని కూడా తెలుసునని, అందువల్ల చట్టవిరుద్ధ కార్యకలాపాలు (నివారణ) చట్టం (యుఎపిఎ) కింద నేరాలు జరుగుతాయని ఎన్ఐఏ హైకోర్టుకు తెలిపింది. ఉగ్రవాద చర్య కోసం, కుట్ర, ఉగ్రవాద సంస్థలో భాగం కావడం జరుగుతుందని స్పష్టం చేసింది.

సురేష్ బెయిల్ దరఖాస్తును వ్యతిరేకిస్తూ ఏజెన్సీ ఆ మేరకు హైకోర్టుకి నివేదించింది. ఏజెన్సీకి న్యాయవాది సూరజ్ టి ఎలెంజికల్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తాను బెయిల్ కోసం చేసిన పిటిషన్ ను కొట్టివేసిన ఎన్ఐఏ కోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ స్వప్న సురేష్ కేరళ హైకోర్టును ఆశ్రయించింది. తనపై ఉన్న కేసు చట్ట పరీక్షకు నిలబడదని, ఈ కేసులో విచారణ అనంతంగా కొనసాగుతోందని ఆమె వాదించారు.

జస్టిస్ కె వినోద్ చంద్రన్, జియాద్ రెహ్మాన్ఏ ఎ ధర్మాసనం ముందు శుక్రవారం జరిగిన విచారణ సందర్భంగా ఎలెన్‌జికల్ తన క్లయింట్ ఏడాదికి పైగా అదుపులో ఉన్నారని కోర్టుకు తెలిపారు. ఎన్‌ఐఏ కేసులో మరికొందరు నిందితుల ఇలాంటి అభ్యర్ధనలను జాబితా చేసినప్పుడు సురేష్‌ చేసిన పిటిషన్‌ను జూలై 29 కి వాయిదా వేస్తున్నట్లు ధర్మాసనం అనడంతో న్యాయవాది ఈ వినతి చేశారు.

ఉగ్రవాద చర్యకు పాల్పడినందుకు, నిందితులు కలిసి కుట్ర పన్నారని, అందుకోసం వ్యక్తులను నియమించుకొని, ఒక ఉగ్రవాద సంస్థను ఏర్పాటు చేశారని, నిధులు సేకరించారని, యుఎఇ నుండి 167 కిలోల బంగారాన్ని అక్రమంగా రవాణా చేశారని, అందుకోసం వనంతపురంలో యుఎఇ కాన్సులేట్ జనరల్ ను ఉపయోగించుకున్నారని   ఎన్‌ఐఏ ఆరోపించింది.

“లావాదేవీలలో ప్రధాన భాగం, ముఖ్యంగా రివర్స్ హవాలా ద్వారా నిధులు, స్మగ్లింగ్ బంగారం కొనుగోలు” అని యుఎఇతో మ్యూచువల్ లీగల్ అసిస్టెన్స్ ట్రీటీ (ఎమ్ఎల్ఎటి) కింద ఒక అభ్యర్థనను ఆ దేశానికి పంపినట్లు ఏజెన్సీ తెలిపింది.

సురేష్‌తో సహా నిందితులను బెయిల్‌పై విడుదల చేయడం కేసులో కొనసాగుతున్న దర్యాప్తును తీవ్రంగా దెబ్బతీస్తుందని, వారు సాక్ష్యాలను దెబ్బతీసి, సాక్షులను ప్రభావితం చేయవచ్చని పేర్కొంది. “అప్పీలుదారు (సురేష్) దేశంలో, విదేశాలలో చాలా సంబంధాలను కలిగి ఉన్నారు, ఇది చట్ట ప్రక్రియ నుండి తప్పించుకోవడానికి ఉపయోగించబడుతుంది” అని ఎన్ఐఏ ఆమె బెయిల్ కు అభ్యంతరం వ్యక్తం చేస్తూ తెలిపింది.