ఇన్వె స్ట్‌ కర్ణాటకకు అనూహ్య స్పందన

ఇన్వె స్ట్‌ కర్ణాటకకు అనూహ్య స్పందన లభించింది. వాణిజ్య పరిశ్రమల శాఖ నిర్వహణలో గురువారం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో 23 కంపెనీలు రాష్ట్ర ప్రభుత్వంతో కీలక ఒప్పందం కుదుర్చుకున్నాయి. తద్వారా రూ.28 వేల కోట్లకు పైగా పె ట్టుబడులు తరలిరానున్నాయి. 

ముఖ్యమంత్రి బి ఎస్ యడియూరప్ప, భారీ పరిశ్రమల శాఖా మంత్రి జగదీశ్‌ శెట్టర్‌ల సమక్షంలో ఒప్పంద పత్రాలపై సం తకాలు జరిగాయి. ఈ ఒప్పందాల దరిమిలా 15 వేల మందికి ఉద్యోగా లు లభించనున్నాయి. నిర్ణీత అవధిలో ప్రాజెక్ట్‌లను పూర్తి చేయాలని ఒ ప్పందాలు కుదిర్చిన కంపెనీలకు సూచన చేశామని ముఖ్యమంత్రి అనంతరం మీడియాకు తెలిపారు. 

కొవిడ్‌ సంక్షోభ సమయంలోనూ రూ.28 వేల కోట్లకు పైగా పెట్టుబడులు తరలిరావడం ఎంతో సంతో షంగా ఉందని చెప్పారు. ఈ కంపెనీలకు ప్రభుత్వం అన్నివిధాలా సహాయ సహకారాలు అందిస్తుందని ఇదే సమయంలో స్థానికులకు ఉద్యోగాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. గత మార్చి నుంచి ఇంతవరకు 520కు పైగా ప్రా జెక్ట్‌లకు ఇన్వెస్ట్‌ కర్ణాటక ద్వారా అనుమతులు మం జూరు చేశామని పెట్టుబడుల మొత్తం రూ.77 వేల కోట్లకు పైగా ఉందని పేర్కొన్నారు. 

తాజా ఒప్పందాల ద్వారా వచ్చే రూ.28 వేల కోట్లు కలపుకొంటే ఏడాది అవధిలోనే రాష్ట్రానికి లక్ష కోట్ల రూపాయల పెట్టుబడులు తరలివచ్చినట్టు అ యిందని ముఖ్యమంత్రి తెలిపారు. ప్రత్యేకించి ఎలక్ర్టికల్‌ వాహనాల తయారీ, డేటా సెంటర్‌, ఏరో స్పేస్‌ రక్షణా విభాగాల్లో పలు కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయని పేర్కొన్నారు. 

దక్షిణాదిన కర్ణాటక రా ష్ట్రం పెట్టుబడులకు అన్నివిధాలా అనుకూలంగా ఉందని ఆయన వివరించారు. లిథియాన్‌ అయాన్‌ సెల్‌ ఉత్పాదనా కంపెనీ రాష్ట్రంలో రూ.4015 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రాగా సింగపూర్‌కు చెందిన ఎల్‌ఎన్‌జీ టర్మినల్‌ సంస్థ రూ.2250 కోట్ల మేరకు, అదాని డాటా సెంటర్‌ రూ.5 వేల కోట్ల పెట్టుబడులకు సంబంధించి గురువారం కీలక ఒప్పందాలు కుదుర్చుకున్నామని చెప్పారు. 

ఉప ముఖ్యమంత్రి డాక్టర్‌ సీఎన్‌ అశ్వర్థనారాయణ మాట్లాడుతూ రాష్ట్ర యువతకు మరింతగా ఉద్యోగ అవకా శాలు కల్పించేదిశలో నైపుణ్య శిక్షణకు ప్రాధాన్యమిస్తున్నామని తెలిపారు. వాణిజ్య పరిశ్రమల శాఖ అదనపు ముఖ్యకార్యదర్శి డాక్టర్‌ రాజ్‌కుమార్‌ ఖత్రి, వాణిజ్యపరిశ్రమల శాఖ కమిషనర్‌ గుంజన్‌ కృష్ణ, జాయింట్‌ డైరెక్టర్‌ బీకే శివకుమార్‌ కర్ణాటక ఉద్యోగ మిత్ర మేనేజింగ్‌ డైరెక్టర్‌ హెచ్‌ఎం రేవణ్ణగౌడ పలు కంపెనీల ప్రతినిధులతో కలిసి ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు.