సుప్రీంకోర్టును ఆశ్రయించిన సువేందు అధికారి

నందిగ్రామ్ అసెంబ్లీ నుంచి ఎన్నికైన తన గెలుపును సవాలు చేస్తూ పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దాఖలు చేసిన పిటిషన్‌ను కోల్‌కతా హైకోర్టులో విచారణ చేయరాదని, మరో కోర్టుకు బదిలీ చేయాలని కోరుతూ ప్రతిపక్ష బీజేపీ నేత, నందిగ్రామ్‌ ఎమ్మెల్యే సువేందు అధికారి సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు ఆయన పిటిషన్‌ దాఖలు చేశారు. 

ఒకప్పుడు తనకు కుడిభుజంలా వ్యవహరించిన సువేందు అధికారి తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీని వీడి బీజేపీలో చేరి నందిగ్రామ్ అసెంబ్లీలో సీఎం మమతాబెనర్జీని సుమారు రెండు వేల ఓట్ల తేడాతో ఓడించి సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.

ఒక వైపు దేశమంతా తృణమూల్ హవా వీచి.. ఆ పార్టీ తిరుగులేని ఆధిక్యంతో విజయదుందుభి మోగించినా సాక్షాత్తు సీఎం మమతాబెనర్జీ ఓడిపోవడం ఆ పార్టీ వర్గాలను, అభిమానులను షాక్ కు గురిచేసింది. ఈ నేపధ్యంలో ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని మమతా బెనర్జీ విమర్శలు గుప్పించారు. 

అంతటితో ఆగకుండా నందిగ్రామ్‌ అసెంబ్లీ పరిధిలో జరిగిన ఎన్నికను సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సీఎం మమతా బెనర్జి వేసిన పిటిషన్‌ను బుధవారం కోల్‌కతా హైకోర్టు విచారణకు స్వీకరించింది. మమతాదీదీ వేసిన పిటిషన్‌పై హైకోర్టు న్యాయమూర్తి షాంపా సర్కార్ ఆన్‌లైన్‌ ద్వారా విచారణ జరిపారు.

ఈ కేసులో సువెందు అధికారికి, ఇతర నిందితులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. నందిగ్రామ్ ఎన్నికకు సంబంధించిన అన్ని రికార్డులను భద్రంగా ఉంచమని ఎన్నికల కమీషన్ ను ఆదేశించారు. హైకోర్టు ఆగష్టు 12న ఈ కేసును విచారింపనున్నది. 

కాగా, సుప్రీం కోర్ట్ లో వేసిన పిటిషన్ లో సువెందు అధికారి కొలకత్తా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చందా చేసిన పరిశీలనలను అధికారి ఉదహరించారు. తాను బిజెపి సభ్యుడినని మమతా బెనర్జీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ వ్రాయడంతో ఆమె పిటిషన్ ను విచారించకుండా, ఆ కేసు నుండి ఆయన తనను తనకు  ఇంతకుముందు టిఎంసి అధినేత పిటిషన్ను వినకుండా తనను తాను ఉపసంహరించుకున్నారు

పశ్చిమ బెంగాల్ లో న్యాయవ్యవస్థపై దాడికి సంబంధించి జూలై 7 న ఇచ్చిన ఉత్తర్వులలో ఆయన ప్రస్తావించారు. “ఇబ్బంది కలిగించేవారిని” “కొత్త వివాదాలను” సృష్టించకుండా నిరోధించడానికి తాను ఈ కేసు నుండి ఉపసంహరించుకుంటున్నానాని జస్టిస్ చందా తెలిపారు. పైగా ఈ కేసు నుండి ఉపశమనం పొందడం కోసం ఉద్దేశ్యపూర్వకంగా మానసికమైన దురాక్రమణకు పాల్పడుతున్నందుకు ఆయన మమతా బెనర్జీకి రూ 5 లక్షల జరిమానా కూడా విధించారు.

జూన్ 24 న జస్టిస్ చందా ముందు జరిపిన వాదనలలో మమతా  న్యాయవాది అభిషేక్ మను సింగ్వి, పిటిషనర్ పక్షపాతం గురించి భయపడటానికి కారణాలను ప్రస్తావించారు. జస్టిస్ చందాకు “బిజెపితో దగ్గరి సంబంధం ఉంది” అని నివేదించారు. బిజెపి లీగల్ సెల్ కు నాయకత్వం వహించడంతో పాటు ఆ పార్టీ తరపున వివిధ కేసులలో న్యాయవాదిగా వాదించినట్లు ఆరోపించారు.