తెలంగాణలో సంస్కృత భాష పట్ల విద్వేష యత్నం

తెలంగాణలో సంస్కృత భాషపట్ల విద్వేషం రేకెక్తినుంచే ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఆ భాషతో తెలుగు భాష మరుగున పడిపోతుందని దురభిప్రాయాలను సృష్టిస్తున్నారని సంస్కృత భారతి ఆధ్వర్యంలో జరిగిన గోష్టిలో పలువురు వక్తలు ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల ఇంటర్మీడియట్ బోర్డు జారీచేసిన సర్కులర్ లో ఇంటర్ లో ద్వితీయ భాషగా సంస్కృతం అభ్యాసంను `ప్రవేశ పెడుతున్నట్లు’ పేర్కొనడం పలు అపార్ధాలకు దారితీస్తున్నదని అభ్యంతరం వ్యక్తం చేశారు.
 
పైగా, కళాశాల స్థాయిలో సంస్కృతంను అసలు బోధింపవద్దని ఈ సందర్భంగా కొందరు తెలుగు అధ్యాపకులు ఆందోళన చేపట్టడం పట్ల విస్మయం వ్యక్తం చేశారు. సంస్కృతం అన్ని భారతీయ భాషలకు మూలమని, ఈ భాషా వికాసంతో అన్ని భారతీయ భాషలు కూడా పరిపుష్టి అవుతాయని స్పష్టం చేశారు. ముఖ్యంగా తెలంగాణాలో 1950 నుండి కళాశాలల్లో సంస్కృతంను బోధిస్తున్నారని, ఈ భాష తెలుగు భాష పరస్పర పూరకాలుగా అభివృద్ధి చెందుతూ వస్తున్నాయని గుర్తు చేశారు. 
 
సంస్కృత భాష హిందువులకు మాత్రమే చెందినదనే సంకుచిత భవనాలను కొందరు వ్యాప్తి చేస్తుండడం పట్ల గోష్ఠి నిర్వహించిన గోపాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. అరబిక్ వంటి విదేశీ భాషల బోధనకు అభ్యంతరం చెప్పని వారు భారతీయ భాషలకు మూలమైన సంస్కృతంను మాత్రమే ఎందుకు వ్యతిరేకిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. దీని వెనుక కుట్రకోణం దాగి ఉన్నట్లు విమర్శించారు. 
 
తెలంగాణలో అధికార భాషలుగా పేర్కొంటున్న తెలుగు, ఉర్దూలను మాత్రమే బోధించాలని అంటున్నవారు హిందీ, అరబిక్ వంటి భాషలను కూడా వ్యతిరేకిస్తారా అంటూ నిలదీశారు. ద్వితీయ భాష అంటే ఎవ్వరికీ ఇష్టమైన భాషను వారు ఎంచుకోవచ్చని అంటూ ఇతర భాషల పట్ల ద్వేషభావం ప్రమాదకరమని గోపాలకృష్ణ హెచ్చరించారు. 
 
ప్రైవేట్ గా లక్షలాది మంది సంస్కృతంలో పరీక్షలు వ్రాస్తుండగా ఇప్పుడే కొత్తగా ప్రవేశపెడుతున్నట్లు ఇంటర్మీడియట్ బోర్డు పేర్కొనడం ఏమిటని ప్రశ్నించారు. అనేక కళాశాలలు అడ్మిషన్ల సమయంలో సంస్కృత భాష బోధనా ఆందునాటులో ఉన్నట్లు చూపడం లేదని విమర్శించారు. 
 
తెలంగాణలో ఇప్పటికి 122 ప్రభుత్వ కళాశాలల్లో సంస్కృతం బోధనాంశంగా ఉందని,  29 ఎయిడెడ్ జూనియర్ కళాశాలలో, 19 రెసిడెంటిల్ జూనియర్ కళాశాలల్లో, ట్రైబల్ వెల్ఫేర్ కళాశాలలలో, 55 మోడల్ స్కూల్స్, 2 మైనారిటీ కళాశాలల్లో, 1 బిసి కళాశాలలో కూడా ఉందని వివైర్నచారు. అన్ని కళాశాలల్లో కూడా సంస్కృతం ఎంచుకొనే అవకాశం విద్యార్థులకు ఉండాలని స్పష్టంచేశారు.
ద్వితీయ భాషగా సంస్కృతంను తొలగించాలని కోరడం అవివేకం, అజ్ఞానం, నిరంకుశ ధోరణి, అప్రజాస్వామికం అంటూ సంస్కృతం కారణంగా తెలుగుకు ఏమాత్రం ముప్పు లేదని భరోసా ఇచ్చారు.
ప్రపంచ దేశాలు నేడు సంస్కృత భాష వ్యాప్తికి ప్రణాళికలు రచిస్తుంటే, .జర్మనీ, ఇటలీ, నెథర్లాండ్, స్విజర్లాండ్, ఇంగ్లాండ్, అమెరికా వంటి దేశాలలో  సంస్కృత భాష గురించి మక్కువ ఏర్పర్చుకొంటుంటే తెలంగాణలో ఈ భాష బోధనం వద్దనడం అవివేకం అని ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఎల్ వి సుబ్రహ్మణ్యం స్పష్టం చేశారు.  అనేక మంది గొప్ప సంస్కృత పండితులకు నెలవైన తెలంగాణాలో ఈ  భాషకు ఆధారణలేదని అత్యుత్సహం ప్రదర్శిస్తున్న అధికారులను హెచ్చరించాలని సూచించారు.
సంస్కృత భాష వాళ్ళవల్లన ఏ భాషకు ముప్పు లేదని స్పష్టం చేస్తూ, పైగా ఇది అన్ని భాషలలో ఉచ్ఛారణను మెరుగు పరుస్తుందని చెప్పారు.  సంస్కృత పదాలున్న తెలుగు భాషపై కూడా మనకు పట్టు కలిగిస్తుందని, ఉచ్చారణ లోపాలను తొలగిస్తుందని పేర్కొన్నారు. ఇంకా మరుగున పడి ఉన్న వెల్లడి తాళపత్ర గ్రంధాలలో  విజ్ఞాన రహస్యాలను వెలికితీసి, ఆధునిక శాస్త్రీయ ప్రగతికి జోడించడానికి సంస్కృత భాష వ్యాప్తి అత్యవసరమని ఆయన తెలిపారు. 
నూతన విద్యావిధానంలో విద్యార్హ్దులు తమకు అభీష్టం గల బోధనాంశాలు చేపట్టే సౌలభ్యం కలిగిస్తుందని, సంస్కృతంతో సహా ఏ భాషపట్ల ఉదాసీనత చూపడం తగదని మరో ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి సి ఉమామహేశ్వరరావు హితవు చెప్పారు.
 
 సంస్కృతంలో అధ్యయనం చేయగల వారి సంఖ్యను పెంచుకోగలిగినప్పుడే మన ప్రాచీన విజ్ఞానం నుండి మరిన్ని మణిరత్నాలను వెలికి తీసుకు రాగలమని చెప్పారు. తెలుగు రాస్త్రాలలో గత  కొంత కాలంగా ఓరియంటల్ కళాశాలలు మూతబడుతూ ఉండడంతో సంస్కృత బోధనా సన్నగిల్లుతుందని విచారం వ్యక్తం చేశారు. 
తెలుగు, సంస్కృతం అనీభావ సంబంధం ఉన్న భాషలని అంటూ  ఈ మధ్యనే ఉద్దేశ్య పూర్వకంగా ఈ భాషల మధ్య అగాధం పెంచి సంస్కృతంను నిర్లక్ష్యం చేసే ప్రయత్నం చేస్తున్నారని తెలంగాణ సంస్కృత అధ్యాపకుల సంఘం అధ్యక్షులు రాజేంద్ర ప్రసాద్ విమర్శించారు. ప్రాచీన సంస్కృత కవులు కావ్యాలను తెలుగు లిపిలోనే వ్రాసారని గుర్తు చేశారు. ఓరియంటల్ పాఠశాలలో కూడా మహా కావ్యాలు తెలుగు భాషలో బోధిస్తూ, ఉభయ భాషలను అభివృద్ధి చేస్తూ వచ్చారని తెలిపారు. 
 
సంస్కృత భాషకు వ్యతిరేకంగా జరుగుతున్న కుట్రలో వామపక్షవాదుల హస్తం ఉన్నదని అఖిల భారతీయ విద్యార్ధి పరిషద్ జాతీయ అధ్యక్షులు పి మురళి మనోహర్ ఆరోపించారు. వీరికి `భారతీయ’ ఎక్కడ ప్రస్తావనకు వచ్చిన వ్యతిరేకించడం పరిపాటి అని ధ్వజమెత్తారు. 
 
భారతీయ వ్యతిరేక భవనాల కారణంగానే దేశంలో రాజకీయంగా, సైద్ధాంతికంగా కమ్యూనిస్టులు పతనం చెందుతున్నారని ఆయన స్పష్టం చేశారు. భారత ప్రజలను కలిపి ఉన్చేడిది సంస్కృత భాష అని డా. బి ఆర్ అంబెడ్కర్ చెప్పారని ఆయన గుర్తు చేశారు. పైగా దీనిని జాతీయ భాషగా ప్రకటించాలని డిమాండ్ చేశారని అంటూ అంబెడ్కర్ వాదులమని చెప్పుకొంటున్నవారు సంస్కృత భాషను వ్యతిరేకించడం ఏమిటని ప్రశ్నించారు.
భారతీయ భాషలను అణచివేయడానికి బ్రిటిష్ పాలకులు సంస్కృతంను మృతభాషగా చేశారని డా. అన్నదానం సుబ్రహ్మణ్యం విమర్శించారు. సంస్కృతం కొన్ని కులాల వారి సొత్తు అనే దురభిప్రాయాలు సృష్టించారని అంటూ ఈ భాష ప్రజలందరి సొత్తు అని చాటి చెప్పాలని సూచించారు. 
 
సంస్కృతంను  అందరు అధ్యయనం చేసుకొనే అవకాశం కల్పించాలని చెప్పారు. దేశ భక్తి, రాజ్యభక్తి, మన ధర్మం పట్ల గౌరవం పెరగాలన్నా సంస్కృతం కీలకం అని స్పష్టం చేశారు. నేడు అన్ని దేశాలు విజ్ఞాన పరిశోధనలకు మూలము ఈ భాష అని గ్రహిస్తుంటే మనం త్యజించడం తగునా అని ప్రశ్నించారు.