సాధికారతతో సహకార బలోపేతం

అన్ని రకాల సహకార సంస్థలను మరింత పురిపుష్టం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకుందని కేంద్ర హోంమంత్రి, కేంద్ర సహకార మంత్రి అమిత్‌షా తెలిపారు. తాజాగా జరిగిన కేంద్ర కేబినెట్ విస్తరణ సందర్భంగా ప్రధాని మోదీ కొత్తగా సహకార శాఖను ఏర్పాటు చేశారు. ఈ శాఖ బాధ్యతలను అమిత్‌షాకు అప్పజెప్పారు. 
 
కేంద్ర సహకార మంత్రి అమిత్‌షాతో శనివారం సహకార రంగానికి చెందిన ప్రముఖులు భేటీ అయ్యారు. ఆయన ఇంకా సహకార మంత్రిత్వ శాఖ బాధ్యతలు చేపట్టాక పోయినప్పటికీ ఆ రంగానికి చెందిన ప్రముఖులతో వరుసగా భేటీలు జరుపుతున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. 

మంత్రిని కలిసిన వారిలో నేషనల్ కో ఆ పరేటివ్ యూనియన్ ఆఫ్ ఇండియా (ఎన్‌సియుఐ) ఛైర్మన్ దిలీ ప్ సంఘాని, ఇండియన్ ఫార్మర్స్ ఫర్టిలైజర్ కో ఆపరేటివ్ లిమి టెడ్ (ఇఫ్కో) చైర్మన్, ఎండి బిఎస్ నకాయ్, యుఎస్ అవస్థీ, నా ఫెడ్ ఛైర్మన్ బిజేందర్ సింగ్ వంటి ప్రముఖులు ఉన్నారు. తాను వీరితో భేటీ అయి, వివిధ రంగాలలోని సహకార వ్యవస్థల గురించి సమగ్రంగా చర్చించినట్లు అమిత్ షా ట్వీట్ వెలువరించారు.

ఇఫ్కో, క్రిబ్‌చ్కో వంటి సంస్థలు విత్తనాల ఉత్పత్తి విషయంలో కృషి చేయాలని, 38000 హెక్టార్ల ఖాళీ భూములను ఇందుకు విని యోగించుకోవచ్చునని సూచించారు. అదేవిధంగా సేంద్రీయ వ్య వసాయం పట్ల కూడా దృష్టి కేంద్రీకృతం చేయాల్సి ఉందని తెలిపారు. సహకార ఉద్యమానికి కేంద్రం పూర్తిస్థాయిలో సాయం చేస్తుందని, దీని వల్ల వచ్చే సత్ఫలితాల ఫలాలు సహకార సంఘాల అట్టడుగు స్థాయిల వరకూ చేరుకుంటాయని అమిత్ షా తెలిపినట్లు ఆ తరువాత ఎన్‌సియుఐ ప్రకటన వెలువరించింది.

ఈ సందర్భంగా ‘‘ప్రధాని మోదీ నేతృత్వంలో సహకార శాఖను, సహకార సంస్థలను పరిపుష్టం చేయడానికి కృతనిశ్చయంతో ఉన్నాం. వాటిని మరింత బలోపేతం చేస్తాం. ఈ రోజు నేషనల్ కోఆపరేటివ్ చైర్మన్ దిలీప్ సంఘానీ, రైతుల ఫర్టిలైజర్ కోఆపరేటివ్ లిమిటెడ్ చైర్మన్ నకాయ్, యూఎస్ అవస్థీ, జాతీయ వ్యవసాయ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ చైర్మన్ బిజేందర్ సింగ్‌తో భేటీ అయ్యాను’’ అని అమిత్‌షా ట్వీట్ చేశారు.